అన్వేషించండి

BC Declaration Nara Lokesh : మంగళగిరి బీసీలకు లోకేష్ ప్రత్యేక ప్లాన్ - డిక్లరేషన్ సభలో ప్రకటన !

Nara Lokesh : మంగళగరి బీసీ వర్గాలకు నారాలోకేష్ ప్రత్యేకమైన వరాలు ప్రకటించారు. బీసీ డిక్లరేషన్ సభలో వాటి వివరాలు వెల్లడించారు.

Naralokesh announced special boons for Mangalagari BC communities  : బీసీ అంటే భవిష్యత్తు, బీసీ అంటే భరోసా... బీసీ అంటే బలహీనవర్గం కాదు... బలమైన వర్గం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభివర్ణించారు. మంగళగిరిలో ఏర్పాటు  చేసిన జయహో బీసీ సభలో లోకేశ్ ప్రసంగించారు. రూ.3 వేల కోట్ల నిధులతో 4.20 లక్షల మంది బీసీలను పేదరికం నుంచి బయటికి తీసుకువచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు.  ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు కేటాయించి, పనిముట్లు కూడా అందించిన పార్టీ టీడీపీ అని వివరించారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, స్కిల్ డెవలప్ మెంట్, స్టడీ సర్కిళ్లు, విదేశీ విద్య వంటి పథకాలు తీసుకువచ్చిన జెండా మన పసుపు జెండా అని వెల్లడించారు. చేనేత కార్మికులకు, మత్స్యకారులకు, కల్లు గీత కార్మికులకు 50 ఏళ్లకు లోపే పెన్షన్లు అందించిన పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ మోసం 

 బీసీల కోసం ఏకంగా మంత్రిత్వ శాఖ ఉండాలని కూడా టీడీపీ తీర్మానం చేసింది. కానీ ఈ సైకో ముఖ్యమంత్రి అయ్యాక బీసీ సోదరులకు వెన్నుపోటు పొడిచాడు. ఆనాడు బీసీలే వెన్నెముక అన్న వ్యక్తి ఇవాళ బీసీ సోదరుల వెన్నెముక విరగ్గొట్టాడు. స్థానిక సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు తగ్గించి 16 వేల మందికి పదవులు దూరం చేశాడని విమర్శించారు.  ఇవాళ బీసీలకు చెందిన 8 వేల ఎకరాల అసైన్ మెంట్ భూములను వెనక్కి తీసుకున్నారు. ఆదరణ పథకం కూడా రద్దు చేశారు. ఆనాడు ఆదరణ పథకం కోసం బీసీ సోదరులు 10 శాతం డబ్బు కడితే, ఆ డబ్బు నేడు తిరిగి ఇచ్చే పరిస్థితి లేదు. బీసీల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు... కానీ ఆ కార్పొరేషన్ల చైర్మన్లకు కుర్చీలు కానీ, టేబుళ్లు కానీ ఉన్నాయా? రూ.75 వేల కోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధులు తప్పుదారి పట్టించారని ఆరోపించారు. 

మత్స్యకారులకు  జగన్ వెన్నుపోటు 

ఈ సైకో జగన్ జీవో నెం.217 తీసుకువచ్చి మత్స్యకారులకు వెన్నుపోటు పొడిచారు. ఆప్కాబ్ ను నిర్వీర్యం చేశారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 300 మంది బీసీలను చంపేశారు. 26 వేల మంది బీసీలపై దొంగ కేసులు పెట్టి జైలుకు పంపారు. యనమల రామకృష్ణుడు పెళ్లికి వెళితే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అయ్యన్నపాత్రుడిపై ఏకంగా రేప్ కేసు పెట్టారు. కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడిపైనా కేసులు పెట్టారు. నిన్న గాక మొన్న నంద్యాల టీడీపీ అధ్యక్షుడిగా రాజశేఖర్ ను నియమిస్తే, ఆ బీసీ నాయకుడిపై ఈ ప్రభుత్వం రౌడీషీట్ తెరిచింది. ఈ ప్రభుత్వానికి ఒక్కటే చెబుతున్నా... మీరు పెట్టే ఎఫ్ఐఆర్ లను మడిచి ఎక్కడ పెడతారో పెట్టుకోండని మండిపడ్డారు. 

మంగళగిరి బీసీలకు అనేక వరాలు   

2019లో నేను పోటీ చేయాలనుకున్నప్పుడు... రాష్ట్రంలో ఎక్కడ్నించి పోటీ చేస్తావని చంద్రబాబు నన్ను అడిగారు. రాష్ట్రంలో టీడీపీ ఎప్పుడూ గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి... గెలిపించి చూపించే బాధ్యత నాది అని చంద్రబాబుతో చెప్పాను. ఆనాడు నన్ను మంగళగిరి పంపించారు. కేవలం 21 రోజుల ముందే నియోజకవర్గానికి వచ్చాను. అప్పటి ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయాను.  కానీ, గత 4 సంవత్సరాలు 10 నెలలుగా మంగళగిరి ప్రజల కోసం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఈ పసుపు జెండా చేసింది. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా 29 సంక్షేమ పథకాలు మంగళగిరిలో చేశాం. మీరు ముందుకు నడవండి మీకు అండగా మేముంటాం అని మంగళగిరి ప్రజలు కొండంత భరోసా ఇచ్చారు. వారికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను. ఈ సందర్భంగా చంద్రబాబుకు మంగళగిరి ప్రజల తరఫున కొన్ని విజ్ఞప్తులు చేస్తున్నా. మొదటిది... కొండ పోరంబోకు, ఫారెస్ట్, ఇరిగేషన్, దేవాదాయ, రైల్వే భూముల్లో మంగళగిరి ప్రజలు దశాబ్దాలుగా ఉంటున్నారు. ఇళ్లు కూడా కట్టుకున్నారు. ఒక తరం కాదు, రెండు తరాలుగా కాదు... మూడు తరాలుగా అక్కడుంటున్నారు. ఆ భూములను క్రమబద్ధీకరించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.  మంగళగిరి నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాల కోసం 20 వేల ఇళ్లు కూడా కట్టించాల్సి ఉందని..   పద్మశాలీలు చాలా చోట్ల చేనేతలుగా ఉంటారు... మంగళగిరి నియోజకవర్గంలో వారు స్వర్ణకారులుగా ఉన్నారు. పద్మశాలీ సోదరులను ఆదుకునేందుకు ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను. మంగళగిరిలో చేనేత కార్మికుల కోసం తీసుకువచ్చిన పైలెట్ ప్రాజెక్టును రాష్ట్రస్థాయికి తీసుకెళ్లాలని కూడా పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నాన్నారు.  అమరావతి మాస్టర్ ప్లాన్ సందర్భంగా కొందరు రైతుల భూములను యూ1 జోన్ లో పెట్టడం జరిగింది. అందువల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అది కూడా రద్దు చేయాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నమన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Letter To CM Chandrababu: వైసీపీ హయాంలో అక్రమ భూ రిజిస్ట్రేషన్లు, దారుణాలు జరిగాయంటూ చంద్రబాబుకు మాజీ ఉద్యోగి లేఖ
వైసీపీ హయాంలో అక్రమ భూ రిజిస్ట్రేషన్లు, దారుణాలు జరిగాయంటూ చంద్రబాబుకు మాజీ ఉద్యోగి లేఖ
Yadadri Blast News: యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడుతో ఒకరి మృతి - 10 మందికి తీవ్ర గాయాలు
యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడుతో ఒకరి మృతి - 10 మందికి తీవ్ర గాయాలు
Rishabh Pant Stunning Fifty: రిషభ్ రపారపా.. కంగారూ బౌలర్ల ఊచకోత.. స్టన్నింగ్ ఫిఫ్టీతో పంత్ ఎదురు దాడి.. 145 లీడ్ లో టీమిండియా 
రిషభ్ రపారపా.. కంగారూ బౌలర్ల ఊచకోత.. స్టన్నింగ్ ఫిఫ్టీతో ఎదురు దాడి.. 145 లీడ్ లో టీమిండియా 
Vijayawada Traffic Diversions: ఈ 5న విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, హైందవ శంఖారావ సభకు వచ్చేవాళ్ళ రూట్ ఇదే!
ఈ 5న విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, హైందవ శంఖారావ సభకు వచ్చేవాళ్ళ రూట్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Clarity on Retirement | సిడ్నీ టెస్టులో స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చిన రోహిత్ శర్మ | ABP DesamGame Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamRam Charan Game Changer Mumbai | బాలీవుడ్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన రామ్ చరణ్ | ABP DesamRare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Letter To CM Chandrababu: వైసీపీ హయాంలో అక్రమ భూ రిజిస్ట్రేషన్లు, దారుణాలు జరిగాయంటూ చంద్రబాబుకు మాజీ ఉద్యోగి లేఖ
వైసీపీ హయాంలో అక్రమ భూ రిజిస్ట్రేషన్లు, దారుణాలు జరిగాయంటూ చంద్రబాబుకు మాజీ ఉద్యోగి లేఖ
Yadadri Blast News: యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడుతో ఒకరి మృతి - 10 మందికి తీవ్ర గాయాలు
యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడుతో ఒకరి మృతి - 10 మందికి తీవ్ర గాయాలు
Rishabh Pant Stunning Fifty: రిషభ్ రపారపా.. కంగారూ బౌలర్ల ఊచకోత.. స్టన్నింగ్ ఫిఫ్టీతో పంత్ ఎదురు దాడి.. 145 లీడ్ లో టీమిండియా 
రిషభ్ రపారపా.. కంగారూ బౌలర్ల ఊచకోత.. స్టన్నింగ్ ఫిఫ్టీతో ఎదురు దాడి.. 145 లీడ్ లో టీమిండియా 
Vijayawada Traffic Diversions: ఈ 5న విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, హైందవ శంఖారావ సభకు వచ్చేవాళ్ళ రూట్ ఇదే!
ఈ 5న విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, హైందవ శంఖారావ సభకు వచ్చేవాళ్ళ రూట్ ఇదే!
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఒక్కడే 'గేమ్ చేంజర్'... మరొక ముఖ్య అతిథి లేరు, ఇంకెవర్నీ పిలవలేదు
పవన్ కళ్యాణ్ ఒక్కడే 'గేమ్ చేంజర్'... మరొక ముఖ్య అతిథి లేరు, ఇంకెవర్నీ పిలవలేదు
Breaking News: బుమ్రాకు గాయం.. మైదానం వీడి వెళ్లిపోయిన స్టార్ పేసర్
బుమ్రాకు గాయం.. మైదానం వీడి వెళ్లిపోయిన స్టార్ పేసర్.. ఫిఫ్టీ దాటిన లీడ్
AP Land Scam: వైసీపీ హయాంలో రూ.600 కోట్ల ల్యాండ్ స్కామ్- చీమకుర్తి శ్రీకాంత్, రీతూ చౌదరిలపై సంచలన ఆరోపణలు
వైసీపీ హయాంలో రూ.600 కోట్ల ల్యాండ్ స్కామ్- చీమకుర్తి శ్రీకాంత్, రీతూ చౌదరిలపై సంచలన ఆరోపణలు
Human Metapneumovirus: వైరస్ తీవ్రత నిజమే.. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - చైనాలో పర్యటించవచ్చన్న ప్రభుత్వం
వైరస్ తీవ్రత నిజమే.. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - చైనాలో పర్యటించవచ్చన్న ప్రభుత్వం
Embed widget