Nara Lokesh on Veeramallu: పవన్ అన్న సినిమా కోసం వెయిటింగ్ - నారా లోకేష్ ట్వీట్ వైరల్
pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా కోసం తాను ఎదురు చూస్తున్నట్లుగా నారా లోకేష్ట్వీట్ చేశారు. సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న బృందానికి అభినందనలు తెలిపారు.

Nara Lokesh on Pawan Kalyan Moive: పవన్ కల్యాణ్ సినిమా వీరమల్లు కోసం తాను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని నారా లోకేష్ అన్నారు. హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా లోకేష్ ట్వీట్ చేశారు. మా పవన్ అన్న సినిమా విడుదల సందర్భంగా సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న బృందానికి అభినందనలు తెలిపారు. పవర్ స్టార్ అభిమానుల్లాగే తాను కూడా సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నానని. పవనన్న, ఆయన సినిమాలు, ఆయన స్వాగ్ నాకు చాలా చాలా ఇష్టమని తెలిపారు. పవర్ స్టార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో 'హరిహర వీరమల్లు' అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.
మా పవన్ అన్న సినిమా #HariHaraVeeraMallu విడుదల సందర్భంగా సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న బృందానికి అభినందనలు. పవర్ స్టార్ అభిమానుల్లాగే నేనూ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను. పవనన్న, ఆయన సినిమాలు, ఆయన స్వాగ్ నాకు చాలా చాలా ఇష్టం. పవర్ స్టార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో… pic.twitter.com/NP9rw3eZkR
— Lokesh Nara (@naralokesh) July 23, 2025
పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన నటించిన తొలి సినిమా విడుదల అవుతోంది. మూడు, నాలుగేళ్ల కిందటే షూటింగ్ ప్రారంభమైనా.. పవన్ కల్యాణ్ రాజకీయ కార్యక్రమాల కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. ఇది మొదటి భాగం మాత్రమే.. రెండో భాగం కూడా షూటింగ్ జరగాల్సి ఉంది. అది ఈ సినిమా ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. పవన్ కల్యాణ్‌కు వ్యక్తిగతంగా ఆర్థిక పరంగా సినిమా విజయం లేదా పరాజయం వల్ల పెద్దగా ఎఫెక్ట్ ఉండదు కానీ.. నిర్మాత ఏ ఎం రత్నం ఇబ్బంది పడతారు.అందుకే పవన్ కల్యాణ్ ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమాలో నటించారు.
మరో వైపు ఈ సినిమా విడుదల సందర్భంగా అభిమానులు భారీ సంబరాలకు ఏర్పాట్లు చేశారు. ఈ సారి టీడీపీ ప్యాన్స్ కూడా పవన్ కల్యాణ్ సినిమా విషయంలో ప్రత్యేకమైన ఆసక్తిని చూపిస్తున్నారు. వైసీపీకి చెందిన వారు బాయ్ కాట్ నినాదం ఇస్తున్నారని ప్రచారం జరుగుతున్నా పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. నిజానికి సినిమాలకు రాజకీయాలకు సంబంధం ఉండదు.. సినిమా బాగుంటే.. ఏ రాజకీయ పార్టీలకు చెందిన వారైనా సినిమాలు చూస్తారు. పవన్ కల్యాణ్ సినిమా బాగుంటే.. వైసీపీ క్యాడర్ కూడా పెద్ద ఎత్తున చూస్తుంది. ప్రేక్షకులకు కావాల్సింది ఎంటర్‌టెయిన్ మెంటే కనీ రాజకీయాలు కాదు.
అందుకే పవన్ సినిమా విడుదల సందర్భంగా అంబటి రాంబాబు కూడా సినిమా హిట్ అవ్వాలని ఆకాంక్షించారు. అయితే ఇంతకు ముందు ఓ సారి మీడియాతో మాట్లాడిన పేర్ని నాని.. హరిరహ వీరమల్లు సినిమా ఫ్లాప్ అని గుప్పించారు. ఓ సారి వాయిదా పడినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. కానీ అంబటి మాత్రం హిట్ అవ్వాలని కోరుకున్నారు.





















