అన్వేషించండి

Nara Lokesh: అధికారంలోకి రాగానే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తాం: నారా లోకేష్

Nara lokesh fires on AP CM Jagan: టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చాక అంగన్వాడీ (Anganwadis) చెల్లెమ్మల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరిస్తాం అన్నారు.

అమరావతి: రాజులు, రాజ్యాలు అంతరించిపోయి ప్రజాస్వామ్యం అమల్లోకి వచ్చాక సైతం ఆంధ్రప్రదేశ్ లో నియంత పాలన కొనసాగుతుందని నారా లోకేష్ అన్నారు. సుమారు అయిదేళ్ల క్రితం ఏపీ ప్రజలు పొరపాటున జగన్మోహన్ రెడ్డి అనే నయా నియంతకు అధికారమిచ్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara lokesh) వ్యాఖ్యానించారు. సీఎం జగన్ అనాలోచిత, పిచ్చి నిర్ణయాలతో అన్నివర్గాల ప్రజలను అవస్థల పాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ, జనసేన  అధికారంలోకి వచ్చాక అంగన్వాడీ (Anganwadis) చెల్లెమ్మల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరిస్తాం అన్నారు.

హామీలు నేరవేర్చాలని అడిగితే పట్టించుకోని జగన్!
ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ అంగన్వాడీలు 40రోజులుగా ఆందోళనలు చేస్తుంటే సీఎం జగన్ కనీసం స్పందించడం లేదన్నారు. పైగా విధుల్లోకి చేరకపోతే ఉద్యోగాలు పీకేస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జలతో బెదిరింపులకు దిగుతున్నాడని లోకేష్ ఆరోపించారు. ప్రభుత్వ అనాలోచిత, మొండివైఖరి కారణంగా ఇప్పటికే ఇద్దరు అంగన్వాడీ చెల్లెమ్మలు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. జగన్ అంగన్వాడీలపై ప్రయోగించిన ఎస్మా ఆయన పాలిట భస్మాసుర హస్తంగా మారబోతోందని వ్యాఖ్యానించారు.
ఎంతటి నియంత అయినా ప్రజాభీష్టానికి తలొగ్గక తప్పదన్న చారిత్రక సత్యాన్ని గుర్తించలేని జగన్... మరో 3నెలల్లోపే ఇంటికి వెళ్లడం ఖాయం అన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా బెదిరిపోకుండా న్యాయమైన డిమాండ్ల సాధనకు 40రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలకు టీడీపీ తరఫున సంపూర్ణ మద్దతు తెలిపారు. టిడిపి-జనసేన నేతృత్వంలో రాబోయే ప్రజాప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తుందని మాట ఇచ్చారు.

మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్ అడ్డగించిన అంగన్వాడీలు 
రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం తమపై ఎస్మా ప్రయోగించినా పలు చోట్ల వెనక్కి తగ్గకుండా ఆందోళనకు దిగుతున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈనెల 25న అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు జిల్లా ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెళ్లగా.. ఉరవకొండ నియోజకవర్గంలో అంగన్వాడి వర్కర్లు ఒక్కసారిగా ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని, వెంటనే జీతాలు పెంచాలని మంత్రి పెద్దిరెడ్డిని డిమాండ్ చేశారు. మంత్రి కాన్వాయ్ ముందుకు కదలకుండా అడ్డుకుని, రహదారిపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఉరవకొండలో ఉద్రిక్త  పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అంగన్వాడీలను బలవంతంగా అక్కడినుంచి పక్కకు జరపడంతో మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. తమ సమస్యలు పరిష్కరించాలని నిరసనలు చేస్తున్న కూడా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Embed widget