News
News
X

Nara Lokesh: కుప్పంలో అర్ధరాత్రి అన్నా క్యాంటీన్లు ధ్వంసం, ఘాటుగా స్పందించిన నారా లోకేష్

Nara Lokesh: టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లపై వైసీపీ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు నారా లోకేష్ తెలిపారు. అలాగే ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్న క్యాంటీన్లను నిర్వహించి తీరుతామన్నారు.

FOLLOW US: 

Nara Lokesh On Anna Canteens Damage: టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లపై మరోసారి దాడి జరిగింది. అర్ధరాత్రి అన్నా క్యాంటీన్లపై వైసీపీ దాడి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ దిగజారుడు తనానికి నిదర్శనం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. కుప్పం ఆర్టీసీ బస్టాండు కూడలి వద్ద 56 రోజులుగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ పై వైసీపీ శ్రేణులు దాడి చేసి ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 201 అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. ఇప్పుడు పేదవాడి నోటి దగ్గర కూడు లాక్కుంటున్నా ఘనత వైసీపీ సొంతం అన్నారు. అర్ధరాత్రి కుప్పంలోని అన్న క్యాంటీన్ పై దాడి చేసిన వైసీపీ రౌడీ మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ (Nara Lokesh) డిమాండ్ చేశారు. 

అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను ధ్వంసం చేస్తారా.. 
ఏపీలో ఉన్మాది పాలన సాగుతోందని, రాష్ట్రంలో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు ఇటీవల కుప్పం పర్యటనలో విమర్శించారు. కుప్పంలో మూడో రోజుల పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గురువారం నాటి కుప్పం ఘటన తానెన్నడూ చూడలేదన్నారు. వైసీపీ రౌడీ మూకలతో దాడులకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రౌడీ ప్రతాపాలు తన దగ్గర కాదు... జగన్‌ దగ్గర చూపించుకోవాలన్నారు. తానిచ్చిన ఇళ్లను ఎందుకు రద్దు చేశారని చంద్రబాబు ప్రశ్నించారు. పులివెందులకు టీడీపీ హయాంలోనే నీళ్లు వచ్చాయని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేశారు. పేదలకు అన్నంపెట్టే అన్న క్యాంటీన్లను ధ్వంసం చేస్తారా? అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పేదల పొట్టకొట్టిన వైసీపీ శ్రేణులకు మాట్లాడే అర్హత లేదన్నారు. పోలీసుల కనుసన్నల్లోనే అన్న క్యాంటీన్‌పై దాడి జరిగిందని విమర్శించారు. పోలీస్ వ్యవస్థ భ్రష్టు పట్టడానికి కారణం సీఎం జగన్, డీజీపీయేనని ఆరోపించారు. 

వైసీపి అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు పూర్తి అవుతున్నా.. ఇప్పటి వరకూ ఒక్క అభివృద్ధి పనులు చేపట్టలేదని టీడీపీ అధినేత మండిపడ్డారు.. కనీసం రైతులకు ఎంతగానో ఉపయోగపడే హంద్రీనీవా ప్రాజెక్టు పనులు కూడా ఎక్కడికక్కడే నిలిపి వేశారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో  హంద్రీనీవా పనుల కోసం విడుదల చేసిన డబ్బులు సైతం ఖర్చు పెట్టకుండా నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. హంద్రీనీవా పనులు పూర్తి చేయక పోతే జగన్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోతారని ఆయన హెచ్చరించారు.

Published at : 30 Aug 2022 10:12 AM (IST) Tags: Nara Lokesh Comments on Anna Canteen Nara Lokesh Fires on YCP Nara Lokesh Latest News Chandra Babu Fires on YCP Anna Canteen Destroy Issue

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: కూకట్ పల్లి మెట్రోస్టేషన్ కింద కారులో చెలరేగిన మంటలు 

Breaking News Live Telugu Updates: కూకట్ పల్లి మెట్రోస్టేషన్ కింద కారులో చెలరేగిన మంటలు 

MP Vijayasai Reddy : దసపల్లా భూములపై సుప్రీం ఆదేశాల ప్రకారమే ప్రభుత్వ నిర్ణయం- ఎంపీ విజయసాయి రెడ్డి

MP Vijayasai Reddy : దసపల్లా భూములపై సుప్రీం ఆదేశాల ప్రకారమే ప్రభుత్వ నిర్ణయం- ఎంపీ విజయసాయి రెడ్డి

కొత్త జాతీయ పార్టీ పేరుతో కేసిఆర్ వేయబోతున్న స్కెచ్ ఇదేనా?

కొత్త జాతీయ పార్టీ పేరుతో కేసిఆర్ వేయబోతున్న స్కెచ్ ఇదేనా?

Prajaporu BJP : ప్రజాపోరుతో వణుకు పుట్టించాం - ఏపీ ప్రభుత్వ అరాచక, అవినీతి పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లామన్న ఏపీ బీజేపీ !

Prajaporu  BJP :  ప్రజాపోరుతో వణుకు పుట్టించాం - ఏపీ ప్రభుత్వ అరాచక, అవినీతి పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లామన్న ఏపీ బీజేపీ !

Dharmana : రాజధాని లేక పోవడానికి చంద్రబాబే కారణం - మేధావులు స్పందించాలని పిలుపునిచ్చిన మంత్రి ధర్మాన !

Dharmana :  రాజధాని లేక పోవడానికి చంద్రబాబే కారణం  - మేధావులు స్పందించాలని పిలుపునిచ్చిన మంత్రి ధర్మాన !

టాప్ స్టోరీస్

Jasprit Bumrah Ruled Out: భయాలే నిజం అయ్యాయ్ - టీ20 వరల్డ్‌కప్ నుంచి బుమ్రా అవుట్!

Jasprit Bumrah Ruled Out: భయాలే నిజం అయ్యాయ్ - టీ20 వరల్డ్‌కప్ నుంచి బుమ్రా అవుట్!

Allu Arjun: నేనెందుకూ పనికి రానని ఆయన ఫీలింగ్ - బన్నీ కామెంట్స్ వైరల్!

Allu Arjun: నేనెందుకూ పనికి రానని ఆయన ఫీలింగ్ - బన్నీ కామెంట్స్ వైరల్!

రూ.12 వేలలోపే నోకియా ట్యాబ్ - భారీ డిస్‌ప్లేతో!

రూ.12 వేలలోపే నోకియా ట్యాబ్ - భారీ డిస్‌ప్లేతో!

In Pics : చంద్రప్రభ వాహనంపై శ్రీవారు, నర్తనకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనం

In Pics : చంద్రప్రభ వాహనంపై శ్రీవారు, నర్తనకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనం