అన్వేషించండి

Nara Lokesh Delhi Tour: ఏపీలో డేటా సిటీ ఏర్పాటుకు సహకారం అందించండి, కేంద్ర మంత్రి జైశంకర్‌ను కోరిన నారా లోకేష్

Andhra Pradesh News | ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్లే యువతకు శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డేటా సిటీ ఏర్పాటుకు సహకారం అందించాలని కేంద్ర మంత్రి జైశంకర్‌ను లోకేష్ కోరారు.

Data center In Vasakhapatnam | న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ యువతను అంతర్జాతీయ స్థాయిలో తయారుచేసేందుకు అవసరమైన శిక్షణా, మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం మద్దతు ఇవ్వాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్. జైశంకర్ ను కోరారు. విశాఖపట్నంలో ఎఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డాటా సిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా సాఫ్ట్ స్కిల్స్ శిక్షణను విస్తరించాలని, వీటి ద్వారా రాష్ట్రం భవిష్యత్తులో టెక్నాలజీ హబ్‌గా మారే అవకాశముందని మంత్రి వివరించారు.

వలస కార్మికుల కోసం ప్రత్యేక చర్యలు, స్కిల్ అభివృద్ధిలో సహకారం కావాలి, ఆంధ్రప్రదేశ్‌ నుంచి విదేశాలకు వెళ్లే కార్మికుల భద్రత, గౌరవం, సంక్షేమం కోసం ప్రవాస భారతీయ బీమా యోజన వంటి పథకాలను విస్తరించాలని కోరారు. ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్రంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఓవర్సీస్ ట్రైనింగ్, మైగ్రేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం ఫాస్ట్ ట్రాక్ అనుమతులు, నిధుల మంజూరుపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరముందని చెప్పారు.

జాతీయ, అంతర్జాతీయ స్థాయి స్కిల్ కాన్‌క్లేవ్‌లలో భాగస్వామ్యం 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్కిల్ కాన్క్లేవ్‌ కార్యక్రమాల్లో కేంద్రం భాగస్వామ్యాన్ని కల్పించినందుకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలకు కేంద్రం నిరంతర సహకారం అందించాలని కోరారు. తాజా సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని రాష్ట్ర బృందం వివిధ రంగాల్లో అభివృద్ధి కోసం సింగపూర్ ప్రభుత్వంతో జరిగిన చర్చల వివరాలను జైశంకర్‌కు వివరించిన లోకేష్, కేంద్రం పూర్తి మద్దతు కావాలని తెలిపారు.

ప్రవాసాంధ్రుల సంఖ్య, ఆదాయ స్థాయిపై వివరాలు
ప్రపంచవ్యాప్తంగా 35 లక్షలమంది ప్రవాసాంధ్రులు ఉన్నారు:
అమెరికాలో: 10 లక్షల మంది
గల్ఫ్ దేశాల్లో: 8 లక్షల మంది
ఐరోపాలో: 4 లక్షల మంది

అక్కడి ప్రజల తలసరి ఆదాయం $70,000 కాగా, ప్రవాసాంధ్రుల ఆదాయం $1,26,000గా ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలపై దృష్టి పెడుతూనే యూరప్, ఆస్ట్రేలియా, జపాన్, కొరియా, తైవాన్ వంటి దేశాలతో మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్టనర్ షిప్ అరేంజ్‌మెంట్స్ (MMPA) ఏర్పాటు చేయడంలో కేంద్రం చేపట్టిన చర్యలను లోకేష్ ప్రశంసించారు.

భారత్‌ను ప్రపంచ నైపుణ్య రాజధానిగా తీర్చిదిద్దే లక్ష్యానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తుందని స్పష్టం చేశారు. రష్యా, ఆస్ట్రేలియా వంటి దేశాలతో కలిసి స్కిల్ డెవలప్‌మెంట్, అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో పాటు జాయింట్ ట్రైనింగ్ & అసెస్‌మెంట్, ట్విన్నింగ్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ కోసం పనిచేస్తున్నామని తెలిపారు. త్వరలో నైపుణ్య పోర్టల్ ప్రారంభించనున్నామని, ఇది ఉద్యోగార్థులు, పారిశ్రామిక సంస్థల మధ్య వేదికగా పనిచేస్తుందని వివరించారు.

భవిష్యత్ లో డాటా షేరింగ్ అవసరం
విదేశీ ఉద్యోగ అవకాశాలను పెంచడానికి, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం రప్పించేందుకు కేంద్రం నుండి డాటా షేరింగ్ సహకారం అందించాలని నారా లోకేష్ కేంద్ర మంత్రిని కోరారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget