Chandrababu Naidu Oath Ceremony LIVE: 'చంద్రబాబు అనే నేను' - ఏపీ సీఎంగా నాలుగోసారి చంద్రబాబు ప్రమాణస్వీకారం
Chandrababu Oath Taking Ceremony LIVE Updates: ఏపీ సీఎంగా చంద్రబాబు, మంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణం చేయనున్నారు. దీనికి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చూడండి

Background
ఆంధ్రప్రదేశ్‌లో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న ఎన్డీఏ కూటమి కొలవుదీరనుంది. ఉదయం 11.27 నిమిషాలకు గన్నవరంలోని కేసరపల్లి వేదికగా సీఎంగా చంద్రబాబుతో గవర్నర్ నజీర్ ప్రమాణం చేయించనున్నారు. దీని కోసం భారీ ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. చంద్రబాబు నాల్గోసారి సీఎంగా ప్రమాణం చేయనున్నారు. చంద్రబాబుతో 24 మంది మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. అందులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు.
ప్రమాణ స్వీకారమహోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రహంమంత్రి అమిత్‌షా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు కేంద్రమంత్రులు, ఇతర్రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. [yt][/yt]
చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీపై ఉంటుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రమాణ స్వీకార వేదికపై ఆయన తొలి సంతకం చేయనున్నారని తెలుస్తోంది. చిరంజీవి, రజనీకాంత్ వంటి సినీ రంగ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. వారంతా ప్రమాణ స్వీకారానికి రానున్నారు.
ప్రమాణస్వీకారం కోసం 12 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. వచ్చే అతిథులు, ప్రజలు, పార్టీ నేతల కోసం 36 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. కేవలం వీఐపీలు, ప్రధాన గ్యాలరీ కోసం 3 ఎకరాలు కేటాయించారు. మిగిలిన స్థలమంతా ప్రజలు, పార్టీ నాయకుల కోసం ఏర్పాట్లు చేశారు. నేరుగా చూసేందుకు రాలేని వారి కోసం వివిధ జిల్లాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు.
పార్కింగ్ ఎలాంటి సమస్యలు లేకుండా విమానాశ్రయం నుంచి నేరుగా సభా ప్రాంగణానికి చేరుకునేలా వీఐపీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ కోసం కూడా 50 ఎకరాలు సిద్ధం చేశారు. పాస్‌లు ఉన్న వారినే ఆ పార్కింగ్ ప్రాంతంలోకి రానిస్తున్నారు. లేకుంటే వేరే మార్గాల్లో తరలిస్తున్నారు. 10 వేల మందితో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
ప్రమాణం చేయనున్న మంత్రులు వీళ్లే
1. కొణిదెల పవన్ కళ్యాణ్ (కాపు)
2. కింజరాపు అచ్చెన్నాయుడు (బీసీ, కొప్పుల వెలమ)
3. కొల్లు రవీంద్ర (బీసీ మత్స్యకార)
4. నాదెండ్ల మనోహర్ (కమ్మ)
5. పి.నారాయణ (కాపు)
6. వంగలపూడి అనిత (ఎస్సీ మాదిగ)
7. సత్యకుమార్ యాదవ్ (బీసీ, యాదవ)
8. నిమ్మల రామానాయుడు (కాపు)
9. ఎన్.ఎమ్.డి.ఫరూక్ (ముస్లిం మైనారిటీ)
10. ఆనం రామనారాయణరెడ్డి (రెడ్డి)
11. పయ్యావుల కేశవ్ (కమ్మ)
12. అనగాని సత్యప్రసాద్ (బీసీ, గౌడ)
13. కొలుసు పార్థసారధి (బీసీ, యాదవ)
14. డోలా బాలవీరాంజనేయస్వామి (ఎస్సీ మాల)
15. గొట్టిపాటి రవి (కమ్మ)
16. కందుల దుర్గేష్ (కాపు)
17. గుమ్మడి సంధ్యారాణి (ఎస్టీ)
18. బీసీ జనార్థన్ రెడ్డి (రెడ్డి)
19. టీజీ భరత్ (ఆర్య వైశ్య)
20. ఎస్.సవితమ్మ (కురబ)
21. వాసంశెట్టి సుభాష్ (బీసీ, శెట్టిబలిజ)
22. కొండపల్లి శ్రీనివాస్ (బీసీ తూర్పు కాపు)
23. మండిపల్లి రామ్ ప్రసాద్ (రెడ్డి)
24. నారా లోకేష్ (కమ్మ)
అర్థరాత్రి ప్రకిటంచిన మంత్రిమండలిలో బీసీలకు నాలుగు స్థానాలు దక్కగా... కాపులు, కమ్మ సామాజిక వర్గానికి నాల్గేసి పదవులు వరించాయి. రెడ్డలకు మూడు, ఎస్సీలకు రెండూ ఎస్టీల, ఆర్యవైశ్యులకు, కురబ, ముస్లిం వర్గాలకు ఒక్కో స్థానం లభించింది. ఇంకొక మంత్రిపదవిని ఇంకా ఎవరికీ కేటాయించలేదు.
బీసీలు-7
కాపులు- 4
కమ్మ-4
రెడ్డి-3
ఎస్సీ-2
ఎస్టీ-1
ఆర్యవైశ్య-1
కురబ-1
ముస్లిం-1
మహిళలు-3
మంత్రులుగా ప్రమాణం చేయనున్న వారిలో 17 మంది కొత్త ముఖాలు. మిగిలిన వారంతా ఏదో టైంలో మంత్రులుగా పనిచేశారు.
సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత చంద్రబాబు నేరుగా తిరుమల వెళ్లనున్నారు. గురువారం ఉదయం దర్శనం చేసుకొని అక్కడి నుంచి తిరిగి రానున్నారు.
మంత్రిగా ఎమ్.రామ్‌ప్రసాద్‌రెడ్డి ప్రమాణ స్వీకారం
Chandrababu Naidu Oath Ceremony Live: మంత్రిగా ఎమ్.రామ్‌ప్రసాద్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు.
మంత్రిగా కే.శ్రీనివాస్ ప్రమాణస్వీకారం
Chandrababu Naidu Oath Ceremony Live: మంత్రిగా కే.శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించారు. 2024లో గజపతినగరం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.





















