TDP Janasena : పవన్, నేను సేమ్ టు సేమ్ - హిందూపురంలో బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు
Balakrishna Comments : పవన్ కు తనకు మధ్య ఒక పోలిక ఉందని నందమూరి బాలకృష్ణ అన్నారు. తామిద్దరం ముక్కుసూటిగా మాట్లాడతామన్నారు.
Balakrishna Comments : నియోజకవర్గాల వారీగా జరుగుతున్న జనసేన, టీడీపీ ( TDP Janasena ) సమన్వయ కమిటీ సమావేశాలో ఆసక్తికర సన్నివేశాలు కనిపిస్తున్నాయి. హిందూపురంలో జరిగిన టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు. జనసేన నేతలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మెడలో జనసేన నేతలు జనసేన కండువా వేశారు. ఆ కండవాతోనే బాలకృష్ణ సమన్వయ సమావేశంలో ప్రసంగించారు.
హిందూపురంలో టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశం
పవన్ కల్యాణ్‌కు నాకు మధ్య సారూప్యత ఉందని పవన్ తెలిపార. తాను, వన్ కల్యాణ్ ముక్కుసూటిగా మాట్లాడుతాం అన్నారు. ప్రజా ఉద్యమంలో పాల్గొనడానికి నాకు నేనుగా నిర్ణయం తీసుకున్నాను అని తెలిపారు.. టీడీపీ-జనసేన కలయిక కొత్త శకానికి నాంది పలికుతుందన్న ఆయన.. రాష్ట్ర మొత్తం ఇన్ని సీట్లు అన్ని సీట్లు కాదు.. మొత్తంగా టీడీపీ , జనసేన గెలవాలని పిలుపునిచ్చారు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు బాలకృష్ణ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం అని మండిపడ్డారు.. రాష్ట్రంలో పరిపాలన మొత్తం నేరస్తులు, హంతకుల చేతిలో ఉందన్నారు. ప్రజాస్వామ్య సంరక్షణ అందరూ కలిసి పోరాటం చేయాలి.. పరిపాలన ఇష్టరాజ్యంగా సాగుతోందని విమర్శించారు.
జగన్ పాలనలో పది ఏళ్లు వెనక్కి రాష్ట్రం
వైఎస్ జగన్ పాలనలో పది సంవత్సరాలు వెనక్కి రాష్ట్రం వెళ్లిపోయిందన్నారు బాలకృష్ణ . రాష్ట్రానికి అప్పులు ఇచ్చే వాళ్ళు కరువయ్యారు.. 1000 కోట్ల అప్పు కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. టీడీపీ – జనసేన కార్యకర్తలు కలవడం.. ఇలా సమావేశం నిర్వహించడం.. కలిసి ముందుకు నడవడం.. ఒక మంచి శుభ పరిణామం అన్నారు. జనం స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు అని తెలిపారు. సామాజిక సాధికార బస్సుయాత్రలో స్వతంత్ర సమరయోధులను అవమానిస్తున్నారు.. మన ఉనికికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు.. అరాచక ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేయాలంటే ఓటు ఒక్కటే.. ప్రతి ఒక్కరు బయటకు వచ్చి ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
గడప గడపలో వైసీపీని నిలదీసిన ప్రజలు
హిందూపురంలో ప్రతిపక్షంలో ఉండి కూడా అభివృద్ధి పనులు చేస్తన్నామని బాలకృష్ణ తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఒక సిమెంట్ రోడ్డు గానీ, ఒక గొయ్యికి తట్టెడు మట్టడు కానీ పోయలేదు, తట్టేడు మట్టికాని తీయలేదని విమర్శించారు. పరిపాలన చేతకాక మూడు రాజధానులు అంటూ కాలయాపన చేస్తున్నారు.. పెయిడ్ ఆర్టిస్టులతో పారిశ్రామిక సదస్సులు నిర్వహించారు. కానీ, రాష్ట్రానికి ఒక పరిశ్రమ రాలేదు అని ఆరోపించారు. ఆరోగ్య ఆస్పుత్రులకు బకాయి పడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి.. డబ్బులు ఇచ్చి సలహాదారులను పెట్టుకున్నాడు అని విమర్శించారు.. గడపగడపలో పార్టీలకు అతీతకంగా ప్రజలు నిలదీశారని బాలకృష్ణ గుర్తు చేశారు.