అన్వేషించండి
Ram Mohan Naidu: రామ్మోహన్‌నాయుడిని పొగడ్తలతో ముంచెత్తిన ఎమ్మెస్కే.. మానవతావాది అంటూ కితాబు
MSK Prasad: కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు చేసిన సాయాన్ని భారత క్రికెట్ మాజీ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ గుర్తు చేసుకున్నారు. మావనతా హృదయంతో కీలక సమయంలో అమెరికా వెళ్లేందుకు సాయపడ్డారని ప్రశంసలు

రామ్మోహన్‌నాయుడిని పొగడ్తలతో ముంచెత్తిన ఎమ్మెస్కే
Source : X
Rammohan Naidu: కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు(Rammohan Naidu) మంచి మనసున్న వ్యక్తి అని మరోసారి చాటుకున్నారు. నిబంధనలు కన్నా మానవీయతే గొప్పదని నిరూపించారు.ఈ మాటలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో, శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలోని ఆయన అభిమానులో అన్న మాటలు కాదు..భారత క్రికెట్ మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్(Msk Prasad) స్వయంగా కొనియాడారు..
ఎమ్మెస్కేకు సాయం
కేంద్ర విమానాయానశాఖమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu)ది మానవత్వం ఉన్న మహనీయుడంటూ భారత క్రికెట్ మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కొనియాడారు. గత ఏడాది జూన్‌లో కేంద్రమంత్రిగా రామ్మోహన్‌నాయుడు తనకు చేసిన సాయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. తన మేనల్లుడు అమెరికా(America)లో అకస్మాత్తుగా మరణించాడని..ఆ సమయంలో తాను ఢిల్లీలో(Delhi) ఉన్నానని గుర్తు చేసుకున్నారు. తక్షణం తాను అమెరికా వెళ్లేందుకు రామ్మోహన్ ఎంతో సాయం చేశారన్నారు. విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్(Hydearabad) వచ్చేందుకు సాయపడ్డారన్నారు. అంతేగాక ఆ సమయంలో హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో అంతర్జాతీయ చెక్-ఇన్ కౌంటర్ మూసివేసి ఉండటంతో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడి జోక్యంతో తాను ఆ ప్రక్రియను పూర్తి చేసి అమెరికాకు వెళ్లగలిగానని అన్నారు. బాధల్లో ఉండగా చేసిన ఏ చిన్నసాయమైనా ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఆ రోజు రామ్మోహన్‌నాయుడు ఆ సాయం చేయకుంటే...తాను సకాలంలో అమెరికా వెళ్లేవాడిని కాదని...ఆయన గుర్తు చేసుకున్నారు. లీడర్లు అంతా రామ్మోహన్‌నాయుడిలా ఉంటే ప్రజలకుఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డారు.
ఈ ఒక్కవిషయంలోనే కాదు...సాయం కోరి వచ్చిన ఏ ఒక్కరినీ వెనుతిప్పి పంపరని..ఆయనను ఎరిగినవారి మాట. ఖచ్చితంగా తన పరిధిలోని అంశం అయితే తప్పకుండా చేసి పెడాతారని వారు చెబుతున్నారు. అలాగే ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా శాయశక్తులా కృషిచేస్తారన్నారు. శారీరకంగా, సామాజికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దివ్యాంగులకు ధైర్యం కల్పించి, ఆత్మస్థైర్యం కల్పించేలా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. దీనికోసం ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రూ.50 లక్షల సీఎస్ఆర్ నిధులతో దివ్యాంగులకు వివిధ పరికరాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి అర్హులైన వారందరికీ పరికరాలు అందజేశారు. తన శాఖ పరిధిలోని అంశం కాకపోయినప్పటికీ....పేద ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఆయన శాయశక్తులా కృషి చేస్తారని దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేశారు.
అలాగే ఏజెంట్ల చేతిలో మోసపోయి సౌదీలో చిక్కుకుపోయిన 22 మంది శ్రీకాకుళం జిల్లా వాసులను స్వదేశానికి రప్పించడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. వారితో ఫోన్‌లో మాట్లాడిన ఆయన అధైర్యపడొద్దని భారత ప్రభుత్వంతో మాట్లాడి క్షేమంగా ఇంటికి చేర్చుతామని హామీ ఇచ్చారు. అలాగే వారి కుటుంబ సభ్యులకు సైతం ధైర్యం చెప్పారు.
విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి, వారి భవిష్యత్తుకు సాధికారిత కల్పించడం కోసం ఆయన తండ్రి కింజారపు ఎర్రన్నాయుడు పేరిట ఎరన్న విద్యా సంకల్పం కార్యక్రమం కింద శ్రీకాకుళం జిల్లా గ్రంధాలయంలో సమగ్ర స్టడీ మెటీరియల్ బుక్ ర్యాక్‌ను ఆయన నెలకొల్పారు. అలాగే రిమ్స్ ఆస్పత్రి సిబ్బంది కోసం తన ఎంపీ నిధులతో దాదాపు 30లక్షలు ఖర్చు చేసి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు.
హుద్‌హుద్ తుపాన్ సమయంలోనూ,తిత్లీ తుపాన్ బీభత్సానికి శ్రీకాకుళం జిల్లా అతలాకుతులమైనప్పుడు....ప్రభుత్వ సాయానికి తోడు యువత,కార్యకర్తలను వెంటబెట్టకుని ఆయన చేసిన సహాయ చర్యలను జిల్లా ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion