By: ABP Desam | Updated at : 02 Sep 2021 09:10 AM (IST)
విజయసాయిరెడ్డి (ఫైల్ ఫొటో)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాజ్యసభ్య సభ్యుడు విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఏపీలో 1,180 ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు ట్వీట్ చేశారు. ఈ పోస్టుల నోటిఫికేషన్ ను ఏపీపీఎస్సీ త్వరలోనే జారీ చేయనుందని చెప్పారు. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. దీంతో పాటుగా.. ఈడబ్ల్యూఎస్ కోటా అమలుకు ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పారు. కాగా, ఏపీలో 1,180 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టులను జాబ్ క్యాలెండర్‌లో చేర్చాలని అధికారులను ఆదేశించింది. వీటి భర్తీ ప్రక్రియ చేపట్టాల్సిందిగా ఏపీపీఎస్సీకి (APPSC) ఆదేశాలు జారీ చేసింది. విభాగాల వారీగా జారీ చేసే పోస్టుల వివరాలతో రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఈ 1,180 పోస్టులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నిఏర్పాట్లు చేసింది. 1,180 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ల జారీకి అనుమతిస్తూ జగన్ గారి ప్రభుత్వం ఇప్పటికే జీవో విడుదల చేసింది. ఈడబ్ల్యూఎస్ కోటా అమలుకు ఇంతకుముందే ఉత్తర్వులు ఇచ్చింది. pic.twitter.com/VEYfu9M7yW
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 1, 2021
విభాగాల వారీగా పోస్టుల వివరాలు..
అసిస్టెంట్ ఇంజనీర్లు- 190, యునానీ విభాగంలో మెడికల్ ఆఫీసర్- 26, ఆయుర్వేద విభాగంలో మెడికల్ ఆఫీసర్- 72, హోమియోపతి విభాగంలో మెడికల్ ఆఫీసర్- 53, ఆయుష్ విభాగం డాక్టర్ ఎన్‌ఆర్‌ఎస్‌జీఏసీలో లెక్చరర్- 3, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్- 670, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు గ్రేడ్ 3 (ఎండోమెంట్)- 60 , హోమియో విభాగంలో లెక్చరర్ పోస్టులు- 24, తెలుగు రిపోర్టర్ (లెజిస్లేచర్)- 5, జూనియర్ లెక్చరల్ ఏపీఆర్ఈఐ సొసైటీ- 10, డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్- 4, అసిస్టెంట్ కన్జర్వేటర్, ఫారెస్టు సర్వీస్- 9, డిగ్రీ లెక్చరర్ ఏపీఆర్ఈఐ సొసైటీ- 5, ఇంగ్లిష్ రిపోర్టర్ (లెచిస్లేచర్)- 10, హార్టికల్చర్ ఆఫీసర్- 39
Vijayawada News : ఇంద్రకీలాద్రిపై అవకతవకలు, దుర్గమ్మ చీరలు మాయం!
Dharmana Krishna Das: నేను ఎమ్మెల్యే- ఆయనే సీఎం - ఇది ఫిక్స్- మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కామెంట్స్
Nellore Politics : ఈసారి నెల్లూరు ఎంపీ సీటు ఆదాలకు లేనట్లేనా? ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
Praja Vedika Demolition : చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత, ప్రజా వేదిక కూల్చివేతపై టీడీపీ శ్రేణుల నిరసన
CM Jagan: రూట్ మారుస్తున్న సీఎం జగన్- ప్లీనరీ తర్వాత ఆ విమర్శలకు చెక్ పెడతారట!
Expensive Pillow: ఈ దిండు ధర రూ.45 లక్షలు, కొన్నవాడికి ఇక నిద్ర పడుతుందా?
Puppalaguda Accident : పుప్పాలగూడలో ఘోర ప్రమాదం, సెల్లార్ పనుల్లో గోడ కూలి ముగ్గురు మృతి
Govt Teachers Properties : పాఠశాల విద్యాశాఖ సంచలన నిర్ణయం, టీచర్లు ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలని ఆదేశాలు
Viral Video Today: మారథాన్లో మ్యారేజ్ ప్రపోజల్- ఇలాంటిది ఇప్పటి వరకు మీరు చూసి ఉండరు!