MP Gudivada Amarnath : ఆర్థిక కష్టాలన్నీ టీడీపీ వల్లేనంటూ మంత్రి అమర్ నాథ్ కామెంట్లు!
MP Gudivada Amarnath: రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ఓ ప్రశ్నకు సంబంధించి కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఇధి ఏపీ రాజకీయాల్లో దుమారాన్నిలేపుతోంది.
MP Gudivada Amarnath : కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ ను పెంచుతోంది. 2014-2015 ఆర్థిక సంవత్సరం నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరం మధ్యలో ఎక్సెస్ ఎక్సిపెండించర్ కు సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి రెగ్యులరైజేషన్స్ ఉన్నాయే అందులో వివరించారు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకూ అసెంబ్లీ అనుమతి కూడా లేకుండా 11 లక్షల కోట్ల రూపాయలకు పైగా అదనంగా ఖర్చు పెట్టిందని దానికి సంబంధించి ఏమైనా వివరాలు కేంద్రానికి సమర్పించిందా అని ఓ ప్రశ్నను అడిగారు. దీనికి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంక జ్ చౌదరి... తమ దగ్గర 2020 మార్చి 31 న కాగ్ ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ వివరాలు మాత్రమే ఉన్నాయన్నారు.
51 వేల 677 కోట్ల రూపాయలకు మాత్రమే రెగ్యులరైజ్
దాని ప్రకారం రాష్ట్ర విభజన తర్వాత 2018-19 ఆర్థిక సంవత్సరం వరకూ లక్షా 62 వేల 828 కోట్ల రూపాయల ఎక్సెస్ ఎక్స్ పెండిచర్ చూపించారని అన్నారు. అయితే వాటిలో 51వేల 677 కోట్ల రూపాయలకు మాత్రమే నాటి ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసిందన్న కేంద్రం.. మిగిలిన ఖర్చులకు కు సంబంధించి ఎలాంటి వివరాలను పొందుపరచ లేదన్నారు. కేంద్రం రాజ్యసభ సాక్షిగా ఇచ్చిన సమాధానంపై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ పత్రికా ప్రకటనను విడుదల చేశారు.
టీడీపీ వల్లే అనేర ఆర్థిక సమస్యలు..
టీడీపీ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడిందన్న అమర్ నాథ్...ఆప్పట్లో ఆర్థిక క్రమ శిక్షణ లేకుండా తీసుకున్న నిర్ణయాల కారణంగానే ఇఫ్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందని తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే సీఎం జగన్ పలు మార్లు చెప్పినా టీడీపీ ఖండించిందన్న గుడివాడ అమర్ నాథ్.. ఇప్పుడు రాజ్యసభలోనే టీడీపీ ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యం బయట పడి అసలు నిజాలు ప్రజలకు తెలిసాయి అన్నారు.
టీడీపీ లెక్కలు చెప్పారు గానీ వైసీపీవి ఎందుకు చెప్పలేదు..
అయితే గుడివాడ అమర్ నాథ్ టీడీపీ పైన విమర్శలు చేస్తున్నా కేంద్రం చెప్పింది కేవలం 2018-19 వరకూ లెక్కలు మాత్రమేనని.. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం చేసిన అదనపు వ్యయాలకు సంబంధించి ఎలాంటి వివరాలను కేంద్ర ఇవ్వలేదని.. ఇది ఉద్దేశ పూర్వకంగా టీడీపీని ఇరుకున పెట్టేందుకే ఇలా చేసి ఉంటుందనే వాదన టీడీపీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది. కావాలనే టీడీపై పట్టుబట్టినట్లుగా వ్యవహిరిస్తున్నారని అన్నారు. 2019 వరకు లెక్కలు చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత జరిగిన అదనపు వ్యయాలకు సంబంధించి కూడా పూర్తి సమాచారాన్ని ఇవ్వాలన్నారు. అప్పుడే వైసీపీ గురించి ప్రజలకు తెలుస్తుందని చెప్పారు.