అన్వేషించండి

AnanthaBabu Bail Cancelled: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు - ఇక విచారణ పూర్తయ్యే వరకూ జైల్లోనే?

Driver Subrahmanyam Murder Case: ఎమ్మెల్సీ అనంతబాబుకు గట్టి షాక్ తగిలింది. గతంలో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేస్తూ బుధవారం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

MLC Anantha Babu Bail Cancelled: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ  అనంత ఉదయభాస్కర్ కు రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం భారీ షాక్ ఇచ్చింది. గతంలో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేస్తూ బుధవారం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సాక్షులను ప్రభావితం చేయడం, బెదిరింపులకు పాల్పడటం వంటి తీవ్రమైన ఆరోపణలు నిరూపణ కావడంతో, న్యాయస్థానం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. దీంతో అనంతబాబు ఇప్పుడు విచారణ పూర్తయ్యే వరకు జైలులోనే రిమాండ్ ఖైదీగా కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 సాక్షులపై బెదిరింపులే కొంపముంచాయి !                            

ఈ కేసులో సాక్షులుగా ఉన్న నలుగురిని అనంతబాబు తీవ్రంగా ప్రలోభపెట్టడమే కాకుండా, తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే చంపేస్తానని హెచ్చరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసేటప్పుడు  సాక్షులను ప్రభావితం చేయకూడదు అనే నిబంధనను పెట్టింది. అయితే, అనంతబాబు ఈ నిబంధనలను ఉల్లంఘించారంటూ బాధితుల ఫిర్యాదుతో కాకినాడ సర్పవరం పోలీసులు ఏప్రిల్ 24న ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆనాటి నుండి ఆయన రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోనే ఉన్నారు. తాజాగా బెయిల్ రద్దు కావడంతో ఆయనకు బయటకు వచ్చే దారులు మూసుకుపోయాయి.

 కోర్టు ఆగ్రహం.. మే 20 నుంచి రెగ్యులర్ విచారణ                        

బెయిల్‌పై ఉండి వ్యవస్థను తప్పుదోవ పట్టించేలా ప్రవర్తించడంపై గతంలోనే న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడి ప్రవర్తన సాక్షుల భద్రతకు ముప్పుగా మారిందని కోర్టు అభిప్రాయపడింది. మరోవైపు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో మే 20 నుంచి రెగ్యులర్ విచారణ  ప్రారంభం కానుంది. ఈ క్రమంలో నిందితుడు బయట ఉంటే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ళ సుబ్బారావు చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించింది.

 ఏమిటీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు?                                  

మే 2022లో తన వద్ద డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యంను  అనంతబాబు హత్య చేశారనే ఆరోపణలు ఉన్నాయి. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని బాధితుడి ఇంటి వద్దే  డోర్ డెలివరీ చేయడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తొలుత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా, దళిత సంఘాలు , ప్రతిపక్షాల పోరాటంతో పోలీసులు అనంతబాబును అరెస్ట్ చేశారు. పోలీసులు చార్జిషీటు సమయానికి దాఖలు చేయకపోవడంతో సుప్రీంకోర్టులో ఆయనకు బెయిల్ వచ్చింది. అయితే ఆయన సాక్షుల్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేయడం   అనంతబాబును మళ్ళీ కటకటాల వెనక్కి నెట్టేలా చేశాయి. మే 20 నుండి ప్రారంభం కాబోయే విచారణలో మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయని బాధితుడి కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
MLC Nagababu Cabinet Rank: కేబినెట్ హోదా’తో సరిపెట్టిన పవన్ వ్యూహం.. నాగబాబుకు ఇక మంత్రి యోగం లేనట్లేనా?
కేబినెట్ హోదా’తో సరిపెట్టిన పవన్ వ్యూహం.. నాగబాబుకు ఇక మంత్రి యోగం లేనట్లేనా?
Chandra Babu About Mega DSC 2025: మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget