అన్వేషించండి

Mission Vatsalya: నెలకు రూ.4 వేలు ఇచ్చే ప్రభుత్వ పథకం.. 'మిషన్ వాత్సల్య' స్కీమ్ దరఖాస్తు విధానం ఇలా!

Mission Vatsalya: అనాథ పిల్లల రక్షణ, భద్రత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిషన్ వాత్సల్య పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఈ పథకం కింద ఏపీ ప్రభుత్వం నెలకు రూ.4 వేలు అందిస్తుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మిషన్ వాత్సల్య బాలల రక్షణ, సంక్షేమం, భద్రతకు కేంద్ర పథకం.
  • ప్రతి బిడ్డకు ₹4000 ఆర్థిక సహాయం, వసతి, విద్య అందిస్తారు.
  • జిల్లా బాలల రక్షణ విభాగాలు, కమిటీలు పథకాన్ని అమలు చేస్తాయి.
  • తల్లిదండ్రులు కోల్పోయిన, నిరాదరణకు గురైన పిల్లలు దీనికి అర్హులు.

Mission Vatsalya: మిషన్ వాత్సల్య (Mission Vatsalya) అనేది భారతదేశంలోని పిల్లల రక్షణ, సంక్షేమం, భద్రత కోసం కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో నిర్వహిస్తోన్న ఒక ప్రతిష్టాత్మకమైన పథకం. గతంలోని 'చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్' పథకానికి మార్పుచేర్పులు చేసి 2021-22 నుంచి దీనిని "మిషన్ వాత్సల్య"గా మార్చారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా మిషన్ వాత్సల్య పథకం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా, రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అమలు చేస్తుంది.  

ఆంధ్రప్రదేశ్‌లో పథకం అమలు విధానం

రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ ఒక జిల్లా బాలల రక్షణ విభాగం (District Child Protection Unit) ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీనికి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తూ పథకం పర్యవేక్షిస్తుంటారు.  

1. ఆర్థిక సహాయం  

ఏపీ ప్రభుత్వం ఈ పథకం కింద అర్హులైన పిల్లల చదువు నిరంతరాయంగా సాగడానికి ఆర్థిక సహాయం అందిస్తుంది. గతంలో ఈ సహాయం తక్కువగా ఉండేది, కానీ మిషన్ వాత్సల్య మార్గదర్శకాల ప్రకారం ప్రస్తుతం అర్హులైన ప్రతి బిడ్డకు నెలకు రూ. 4,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ డబ్బు నేరుగా లబ్ధిదారులైన పిల్లల/తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. 

Also Read: రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!

2. బాలల సదనాలు

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడిచే చిల్డ్రన్ హోమ్స్, అబ్జర్వేషన్ హోమ్స్ ఈ పథకం పరిధిలోకి వస్తాయి. ఇక్కడ చేరిన పిల్లలకు ఉచిత వసతి, నాణ్యమైన భోజనం, విద్యా సౌకర్యాలు, వైద్య సహాయం అందిస్తారు. ఏపీలో ఈ హోమ్‌ల పర్యవేక్షణకు ప్రత్యేక తనిఖీ బృందాలు పనిచేస్తాయి.

3. చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు & జువెనైల్ జస్టిస్ బోర్డులు 

ఏపీలోని అన్ని జిల్లాల్లో బాలల సంక్షేమ కమిటీలు పనిచేస్తున్నాయి. రక్షణ అవసరమైన పిల్లలను గుర్తించి వారిని హోమ్‌లకు పంపాలా లేదా స్పాన్సర్‌షిప్ ఇవ్వాలా అనేది ఈ కమిటీలే నిర్ణయిస్తాయి. చట్టపరమైన చిక్కుల్లో పడిన బాల నేరస్థుల కౌన్సెలింగ్, సంస్కరణల కోసం జువెనైల్ జస్టిస్ బోర్డులు పనిచేస్తాయి. 

Also Read: మళ్లీ మళ్లీ జరగాలి పెళ్లి.. చంద్రబాబు కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనపై గుడివాడ అమర్నాథ్ సెటైర్లు

లబ్ధిదారులు ఎవరు? 

  • కోవిడ్ మహమ్మారి సమయంలో తల్లిదండ్రులు ఇద్దరినీ లేదా సంపాదించే వ్యక్తిని కోల్పోయిన పిల్లలకు ప్రాధాన్యత
  • భర్త చనిపోయి లేదా వదిలేసి, ఆర్థికంగా పిల్లలను పోషించలేని స్థితిలో ఉన్న మహిళల పిల్లలు 
  • తల్లిదండ్రులు హెచ్‌ఐవీ, క్యాన్సర్ లేదా ఇతర తీవ్రమైన జబ్బులతో బాధపడుతూ పిల్లల పోషణ చూసుకోలేని కుటుంబాలు
  • ఇటుక బట్టీలు, హోటళ్లు, ఇతర పనుల నుంచి రక్షించిన బాలలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో తిరిగే అనాథ పిల్లలు

దరఖాస్తు చేసుకునే విధానం  

  • స్థానిక అంగన్‌వాడీ కార్యకర్త లేదా సూపర్‌వైజర్ ద్వారా ప్రాథమిక సమాచారం సేకరించి దరఖాస్తు చేసుకోవచ్చు.
  • మీ పరిధిలోని చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (CDPO) ఆఫీసులో అప్లికేషన్ సమర్పించాలి.
  • జిల్లా కేంద్రంలో ఉండే జిల్లా బాలల రక్షణ అధికారి ఆఫీసులో నేరుగా సంప్రదించి, అవసరమైన పత్రాలు (ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, బోనఫైడ్ సర్టిఫికేట్, తల్లిదండ్రుల మరణ ధృవీకరణ పత్రాలు) సమర్పించాల్సి ఉంటుంది.

Also Read: తాడిపత్రి చదరంగం - వైసీపీతో కాదు.. పెద్దారెడ్డితోనే ఫైట్! జేసీ మార్క్ పాలిటిక్స్ వెనుక అసలు కథ ఇదీ

Frequently Asked Questions

మిషన్ వాత్సల్య పథకం అంటే ఏమిటి?

ఇది కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో పిల్లల రక్షణ, సంక్షేమం, భద్రత కోసం అమలు చేస్తున్న పథకం. 2021-22 నుండి దీనిని 'చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్' పథకం నుండి మార్చారు.

ఈ పథకం కింద ఎంత ఆర్థిక సహాయం అందిస్తారు?

అర్హులైన ప్రతి బిడ్డకు నెలకు రూ. 4,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ డబ్బు నేరుగా లబ్ధిదారులైన పిల్లల/తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు.

మిషన్ వాత్సల్య పథకానికి ఎవరు అర్హులు?

కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, ఆర్థికంగా పిల్లలను పోషించలేని మహిళల పిల్లలు, తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న తల్లిదండ్రుల పిల్లలు అర్హులు. రక్షించబడిన బాలలు, అనాథ పిల్లలు కూడా లబ్ధిదారులు.

మిషన్ వాత్సల్య పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

అంగన్‌వాడీ కార్యకర్త ద్వారా, సీడీపీఓ ఆఫీసులో లేదా నేరుగా జిల్లా బాలల రక్షణ అధికారి ఆఫీసులో దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Embed widget