Nara Lokesh: 'మేం జగన్‌లా పారిపోయే వ్యక్తులం కాదు' - రెడ్ బుక్ పని ప్రారంభమైందంటూ మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు
Srikakulam News: ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే వారికి శిక్ష తప్పదని మంత్రి లోకేశ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన తిరుమల లడ్డూ వివాదం, ప్రభుత్వ స్కూళ్ల బలోపేతం వంటి అంశాలపై మాట్లాడారు.
Minister Nara Lokesh Comments: తిరుమల లడ్డూ వివాదం కొనసాగుతోన్న వేళ.. అక్కడికి వెళ్తానంటున్న జగన్ డిక్లరేషన్ ఇచ్చే సంప్రదాయాన్ని పాటిస్తే బాగుంటుందని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. శ్రీకాకుళంలో (Srikakulam) పాఠశాల ఆకస్మిక పరిశీలన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మనం ఏ మతానికి చెందిన వారమైనా అన్ని మతాలను గౌరవించాలని.. తాము చర్చి, మసీదులకు వెళ్లినప్పుడు వారి మత విశ్వాసాలకు అనుగుణంగా నడుచుకుంటామని చెప్పారు. తాము జగన్‌లా పారిపోయే వ్యక్తులం కాదని.. సూపర్ సిక్స్ ఆల్రెడీ అమలు చేస్తున్నామని అన్నారు. 'వంద రోజుల్లో సూపర్ సిక్స్ అమలు చేస్తామని నేను ఎక్కడ చెప్పలేదు. మూసేసిన అన్న క్యాంటీన్లను ప్రారంభించాం. మెగా డీఎస్సీ ఇస్తామని చెప్పాం ఇచ్చాం. రూ.1000 పెన్షన్ 100 రోజుల్లో పెంచాం. జగన్ దానికి ఐదు ఏళ్లు తీసుకున్నాడు. మాకు చిత్తశుద్ధి ఉంది. త్వరలో ఉచిత గ్యాస్ ఇస్తాం. ఓ పద్ధతి ప్రకారం ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటాం.' అని లోకేశ్ స్పష్టం చేశారు.
'తిరుమల లడ్డూ.. విచారణలో వాస్తవాలు'
తిరుమల లడ్డూ నాణ్యతా లోపంతో పాటు అనేక సమస్యలను భక్తులు యువగళం పాదయాత్రలో తన దృష్టికి తెచ్చారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీని ప్రక్షాళన చేయాలని ఈవోకు చెప్పామని లోకేశ్ తెలిపారు. 'Yv సుబ్బారెడ్డి అన్ని ధరలు పెంచమని చెప్పి సామాన్యులకు దేవుడిని దూరం చేసే విధంగా ప్రవర్తించారు. తిరుమలలో జరిగిన అవకతవకలపై నిగ్గు తేల్చేందుకు కమిటీ వేశాం. విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయి. ఇప్పుడు తిరుమల లడ్డూ నాణ్యత బాగుందని వైసీపీ ప్రజా ప్రతినిధులు కూడా చెబుతున్నారు. దేవుని జోలికి వెళ్తే ఏం జరుగుతుందో గత ఎన్నికల్లో మీరంతా చూశారు.' అని పేర్కొన్నారు.
'రెడ్ బుక్' పని ప్రారంభం
ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి శిక్ష తప్పదని తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని లోకేశ్ అన్నారు. 'ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే రెడ్ బుక్ అమలు ప్రారంభమైంది. చట్టాన్ని అతిక్రమించి తప్పు చేసిన వారిని వదలేది లేదు. ఇందులో భాగంగానే ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు. రైట్ ప్లేస్‌లో రైట్ పర్సన్ ఉండాలనేదే మా ప్రభుత్వ అభిమతం. గత ప్రభుత్వ హయాంలో యూనివర్శిటీలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారు. వారి హయాంలో ఆయా వర్శిటీల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం.' అని స్పష్టం చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయబోమని కేంద్ర మంత్రి కుమారస్వామి, సీఎం చంద్రబాబు స్పష్టంగా చెప్పారని లోకేశ్ తెలిపారు. 'ప్రైవేటీకరణ లేదని నేను, మా ఎమ్మెల్యేలందరూ స్పష్టం చేశాం. విశాఖ ఉక్కును బతికించడం కోసం నిధులు మంజూరు చేయాలని సీఎం కేంద్రాన్ని కోరారు. దీనికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు. వైసీపీ నేతలు ఎందుకు కంగారు పడుతున్నారో అర్థం కావడం లేదు. ఇటీవల వరదల సమయంలో ప్రజలకు అండగా నిలబడ్డాం. ఎవరు అసలైన నాయకులో రాష్ట్ర ప్రజలకు అర్థమైంది.' అని లోకేశ్ పేర్కొన్నారు.
'విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు'
ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించిందని.. ఫలితంగా ప్రభుత్వ స్కూళ్లల్లో 9 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారని లోకేశ్ మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ప్రస్తుతం మన ముందున్న లక్ష్యమని.. ఇందు కోసం ప్రణాళికబద్ధంగా పని చేస్తున్నామని అన్నారు. 'గత ప్రభుత్వం రూ.2500 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు బకాయి పెట్టింది. గుడ్లు, చిక్కీలకు రూ.200 కోట్లు, నాలుగైదు నెలల నుంచి ఆయాలకు జీతాలు బకాయి పెట్టింది. అవన్నీ పద్ధతి ప్రకారం తీర్చుకుంటూ వస్తున్నాం. నేను జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు ఒకరోజు పూర్తిగా స్కూళ్ల పరిశీలనకు కేటాయిస్తున్నా. వాస్తవాలను తెలుసుకునేందుకు స్కూళ్లను తనిఖీ చేస్తున్నా.' అని లోకేశ్ పేర్కొన్నారు.
Also Read: Viral News : ఆవు కల్తీ అందుకే ఆవు నెయ్యి కూడా కల్తీ - మాజీ స్పీకర్ తమ్మినేని వివరణ