Minister Gottipati Ravi : సమస్య గురించి తెలిసిన మరుక్షణం స్పందన - ఏపీ మంత్రి రియాక్షన్‌తో ఆ రైతు హ్యాపీ !
Andhra Politics ఓ రైతు సమస్యను చిటికెలో పరిష్కరించారు మంత్రి గొట్టిపాటి రవికుమార్ . అసలేం జరిగిందంటే ?
Minister Gottipati Ravikumar solved a farmers problem : పొలంలో కరెంట్ తీగలు కిందకు వెలాడుతున్నాయి. పొలం పని చేసుకోవాలంటే అత్యంత జాగ్ర్తతగా చేసుకోవాలి. కర్ర తీసుకుని ఆ తీగల్ని ఒకరు ఎత్తి పట్టుకుంటే.. మరొకరు పొలం పని చేసుకోవాలి. ఆ తీగల్ని పైకి స్తంభాలకు కట్టుకోవాలని ఆ పొలం యజమాని అయిన రైతు చాలా సార్లు అధికారుల్ని కలిసి కోరారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. కరెంట్ అదికారులు తప్ప మరెవరూ ఆ సమస్యను పరిష్కరించలేరు. అందుకే చెప్పి.. చెప్పి విసిగిపోయారు. చివరికి ఆ కరెంట్ తీగకు దూరంగా ఉంటూ పొలం పని చేసుకుంటున్నారు. కానీ ఆయన సమస్య ఒక్క సారిగా పరిష్కారమయిపోయింది. అప్పటికప్పుడు అధికారులు ఉరుకులు పరుగుల మీద వచ్చి కరెంట్ వైర్ ను సరి చేశారు. పొలం లో పడకుండా చూశారు.
ఏమయిందో అని ఆ రైతు కంగారు పడ్డారు. అయితే.. ఆయన సమస్య మంత్రి గారి దృష్టి వెళ్లిందని అందుకే నిమిషాల్లో పరిష్కారమయిందని కాసేపటికి తెలిసింది. ఆ రైతు పేరు అబ్బయ్య. అసలు ఊరు కడప జిల్లా ఖాజీపేట మండలం నాగసాని పల్లెయ అబ్బయ్య పొలంలో విద్యుత్ తీగలు నేలను తాకుతుండేవి. గత కొంత కాలంగా రైతు తాను పడుతున్న ఇబ్బందులను పలు మార్లు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లిన సమస్య పరిష్కారం కాలేదు.
ఇటీవల వర్షాలు పడడంతో దుక్కి దున్నుకోవాలిని రైతు అబ్బయ్య భావించారు. ఈక్రమంలో పొలంలో అడ్డుగా ఉన్న విద్యుత్ తీగలను కుటుంబ సభ్యుల సాయంతో పట్టుకునేలా చూసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఫోటో ఏపీ విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కంటపడింది. రైతన్న ఇబ్బంది చూసిందే తడవుగా స్థానికంగా ఉండే అధికారులకు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ గారు ఆదేశించారు.
యుద్ధ ప్రాతిపదికన అబ్బయ్య పొలంలో స్తంభం ఏర్పాటు చేశారు. ఏళ్ల తరబడి పరిష్కారం కానీ సమస్య మంత్రి గారి ఆదేశాలు అందిన కేవలం మూడు గంటల్లోనే పరిష్కారం అయ్యింది. మంత్రి గొట్టిపాటి రవి కుమార్ గారు చూపించిన చొరవను చూసి రైతన్న ఆనందం వ్యక్తం చేశారు. మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సమస్యలపై స్పందించే మంత్రి ఉండాలి కానీ.. రైతులకు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఇష్టే పరిష్కారం అవుతాయి. నిర్లక్ష్యం చూపే అధికారులను పరుగులు పెట్టించే మంత్రి వస్తే.. సమస్యలు తగ్గిపోతాయని నిరూపితమయిందని రైతు సంతోషపడుతున్నారు.