News
News
X

Dharmana On Three Capitlas : మూడు రాజధానులను సమర్థించకపోతే ఉత్తరాంధ్రకు ద్రోహం చేసినట్లే - యువత వైఎస్ఆర్‌సీపీకి వ్యతిరేకంగా లేదన్న ధర్మాన !

మూడు రాజధానులను సమర్థించకపోతే ఉత్తరాంధ్రకు ద్రోహం చేసినట్లేనని మంత్రి ధర్మాన అన్నారు. అందరూ విశాఖ రాజధానిని సమర్థించాలన్నారు.

FOLLOW US: 
 
Dharmana On Three Capitlas :   ప్రతి పౌరుడూ విశాఖపట్నం మన రాజధాని అని గొంతెత్తి నినదించాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. అలా  చేస్తేనే ఈ ప్రాంతం అస్తిత్వం కాపాడిన వారవుతారని ఆయన వ్యాఖ్యానించారు. పట్టభద్రుల ఓట్ల నమోదు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు మనం చప్పట్లు కొడితే.. మన ప్రాంతానికి ద్రోహం చేసినట్లేనని ధర్మాన తెలిపారు. ప్రజల జీవ‌న ప్ర‌మాణాల‌తోనే అభివృద్ధి సాధ్యం అని అన్నారు. ప్ర‌జా ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ఓ ప్ర‌భుత్వం ప‌నిచేయాల‌ని అదే విధంగా వైసీపీ స‌ర్కారు ప‌నిచేస్తోంద‌న్న్నారు.  గ‌డ‌ప‌గడ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో భాగంగా ప‌నిచేసిన ఇంఛార్జుల సాయంతో ఓట‌రు న‌మోదు ప్ర‌క్రియ చేప‌డుతున్నామని ధర్మాన తెలిపారు.  

పట్టభద్రులు వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ! 

పార్టీ చేప‌ట్టిన ప్ర‌తి ప‌నినీ చిత్త‌శుద్ధితో కార్య‌కర్త‌లు చేప‌ట్టాలని హితబోధచేశారు.  ప‌ట్ట‌భ‌ద్రులు ఈ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకం అని తాను అనుకోవ‌డం లేదన్నారు.  వాళ్లంతా ఈ ప్ర‌భుత్వానికి త‌గినంత మ‌ద్ద‌తు ఇస్తార‌నే భావిస్తున్నానని.. ఆ విషయాన్ని ఈ ఎన్నికలు నిరూపిస్తాయన్నారు.  అందుకు అనుగుణంగా కార్య‌క‌ర్త‌లు ప‌నిచేసి వారిని ఇటుగా ఆక‌ర్షితులు అయ్యేలా ప‌నిచేయాల‌ని  పిలుపునిచ్చారు .విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం కేంద్రం 23 సంస్థ‌ల‌ను ఇచ్చిందని.. కానీ  వాటిలో ఉత్తరాంధ్రకు దక్కిందేమిటి అని ధర్మాన ప్రశ్నించారు.  ఇప్ప‌టిదాకా ఒక్క కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ను కూడా ఏర్పాటు చేయలేదన్నారు.  అస‌లు వాటిని ఇచ్చిందే విడిపోయాక న‌ష్ట‌పోయినందుకు ప‌రిహార రూపంలో ఇచ్చిన సంస్థ‌ల‌ను మ‌న‌కు క‌నీసం ఓ రెండు సంస్థ‌ల‌నూ కేటాయించ‌లేదని ఆరోపించారు. 

గ్రామీణ యువత వలస వెళ్లిపోతున్నారు ! 

News Reels

గ్రామీణ ఆంధ్రావ‌నిలో యువ‌త ఎక్క‌డ స్వ‌స్థ‌లాల్లో లేరని..  ఉపాధి లేక వెళ్లిపోతున్నారని ధర్మాన ఆవేదన వ్యక్తం చేశారు.  ఇవ‌న్నీ ప‌రిగ‌ణించ‌కుండా చేస్తూ పాల‌న చేశారని టీడీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. తనను ద‌ద్ద‌మ్మ అని టీడీపీ నేతలు అనడం భావ్యం కాదన్నారు.  అచ్చెన్నాయుడు కూడా ఈ ప్రాంతానికి చేసింది లేదు. మీకు ఓటేసినందుకు ప్ర‌జ‌లు ద‌ద్ద‌మ్మ‌లా క‌నిపిస్తున్నారా ? ఒక్క సంస్థ‌ను కూడా  మీరు తెప్పించ‌లేక‌పోయారని మండిపడ్డారు.  మీరు చంద్ర‌బాబు పంచ‌న చేరి  ఆయ‌న చెప్పిన విధంగా రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారానికి తెలుగుదేశం నాయ‌కులంతా ప్ర‌య‌త్నిస్తున్నారా అని ప్ర‌శ్నించారు. రాజ‌ధాని  ఏర్పాటులో  వివిధ సంద‌ర్భాల‌లో చాలా కోల్పోయాం. కానీ ఇప్పుడు జ‌గ‌న్  మ‌న‌కు న్యాయం చేయాల‌ని భావిస్తున్నారని ధర్మాన తెలిపారు. 

మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడితే ద్రోహులే ! 

మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఎవ్వ‌రు మాట్లాడినా ఉత్తరాంధ్ర ద్రోహులేనని ధఱ్మాన తెలిపారు.  వారిని మ‌నం వ్య‌తిరేకించాలన్నారు.  మూడు రాజ‌ధానుల‌కు మ‌ద్ద‌తుగానే ఉంటాను. ఇందులో ఎటువంటి సందేహం లేదని ధర్మాన తెలిపారు.  ఈ ప్ర‌క్రియ కార‌ణంగా ఏ ప్రాంతం న‌ష్ట‌పోయేది లేదు. ఆ విధంగా విశాఖ కేంద్రంగా ప‌రిపాల‌న రాజ‌ధాని ఏర్పాటు కానుంది. అదేవిధంగా క‌ర్నూలో న్యాయ రాజ‌ధాని ఏర్పాటు కానుంది. అదేవిధంగా అమ‌రావ‌తి లో శాస‌న రాజ‌ధాని ఉండ‌నుంది. ఇందులో సందేహాలకు తావులేదు. ఇప్పుడు చంద్ర‌బాబు చెప్పిన విధంగా పెట్టుబ‌డులు అమ‌రావ‌తిలో పెట్టాల్సిన అవ‌స‌రం లేదన్నారు.  రేపు ఆ ప్రాంతం అభివృద్ధి చెందాక ఆ రోజు హైద్రాబాద్ మాదిరిగానే మ‌న‌ల్ని పంపేస్తే అప్పుడు మ‌నం ఏం కావాలని ప్రశ్నించారు. . అప్పుడు మ‌ళ్లీ మ‌నం మ‌రింత వెనుక‌బాటుకు గురి కావ‌డం త‌థ్యమన్నారు. విశాఖలో రాజధాని వస్తే ఉత్తరాంధ్ర  ప్రాంత ప్ర‌జ‌ల ఆస్తుల విలువ పెర‌గ‌ుతుందన్నారు.  త‌ద్వారా ఇక్క‌డి పేద‌రికం అన్న‌ది కూడా దూరం అవుతుందని జోస్యం చెప్పారు.  

Published at : 10 Oct 2022 03:47 PM (IST) Tags: Dharmana Prasada Rao Three Capitals Visakha Executive Capital

సంబంధిత కథనాలు

Vizag Woman Murder: విశాఖలో డ్రమ్ములో మహిళ డెడ్ బాడీ కేసు ఛేదించిన పోలీసులు, ట్విస్ట్ మామూలుగా లేదు

Vizag Woman Murder: విశాఖలో డ్రమ్ములో మహిళ డెడ్ బాడీ కేసు ఛేదించిన పోలీసులు, ట్విస్ట్ మామూలుగా లేదు

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్సీ కవితతో 11న సమావేశానికి సిబిఐ అంగీకారం, ఈమెయిల్ ద్వారా రిప్లై

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్సీ కవితతో 11న సమావేశానికి సిబిఐ అంగీకారం, ఈమెయిల్ ద్వారా రిప్లై

TDP Leader Narayana : మాజీ మంత్రి నారాయణకు రిలీఫ్ - బెయిల్ కొనసాగిస్తూ హైకోర్టు తీర్పు !

TDP Leader Narayana :  మాజీ మంత్రి నారాయణకు రిలీఫ్ -  బెయిల్ కొనసాగిస్తూ హైకోర్టు తీర్పు !

Sathya Sai District News: వాషింగ్ మెషిన్ పెట్టిన చిచ్చు - మహిళను కొట్టి చంపేసిన పక్కింటి వ్యక్తులు

Sathya Sai District News: వాషింగ్ మెషిన్ పెట్టిన చిచ్చు - మహిళను కొట్టి చంపేసిన పక్కింటి వ్యక్తులు

Chittoor District News: పలమనేరులో ఫ్యామిలీతో రోడ్డుపై మకాం వేసిన గజరాజులు, భయం గుప్పిట్లో ప్రజలు

Chittoor District News: పలమనేరులో ఫ్యామిలీతో రోడ్డుపై మకాం వేసిన గజరాజులు, భయం గుప్పిట్లో ప్రజలు

టాప్ స్టోరీస్

YS Sharmila: కేసీఆర్ అంటే కొట్టి చంపే రాజ్యాంగం, తెలంగాణలో ఇదే అమలవుతోంది: వైఎస్ షర్మిల

YS Sharmila: కేసీఆర్ అంటే కొట్టి చంపే రాజ్యాంగం, తెలంగాణలో ఇదే అమలవుతోంది: వైఎస్ షర్మిల

Jagamemaya Trailer: ‘జగమే మాయ’ ట్రైలర్ - వామ్మో, ఈ అమ్మాయ్ చాలా ‘చిత్ర’మైనది!

Jagamemaya Trailer: ‘జగమే మాయ’ ట్రైలర్ - వామ్మో, ఈ అమ్మాయ్ చాలా ‘చిత్ర’మైనది!

TS Minister Harish Rao: ‘కంటి వెలుగు’పై కీలక విషయాలు వెల్లడించిన మంత్రి హరీష్ రావు, ఈసారి 100 రోజులే

TS Minister Harish Rao: ‘కంటి వెలుగు’పై కీలక విషయాలు వెల్లడించిన మంత్రి హరీష్ రావు, ఈసారి 100 రోజులే

Most T20 Wickets 2022: మీ పెద్దోళ్లున్నారే! అంటూనే ఎక్కువ వికెట్లు పడగొట్టిన కుర్రాళ్లు - 2022 టీ20 టాప్‌ 10 బౌలర్లు వీరే!

Most T20 Wickets 2022: మీ పెద్దోళ్లున్నారే! అంటూనే ఎక్కువ వికెట్లు పడగొట్టిన కుర్రాళ్లు - 2022 టీ20 టాప్‌ 10 బౌలర్లు వీరే!