News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Minister Adimulapu Suresh: మంత్రి ఆదిమాలపు సురేష్ కు అరుదైన గౌరవం, ఐఈటీఈ ఫెలోగా ఎన్నిక

Minister Adimulapu Suresh: మంత్రి ఆదిమూలపు సురేష్ కు అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్టాత్మక ఇన్ స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ ఫెలోగా ఎన్నికయ్యారు. 

FOLLOW US: 
Share:

Minister Adimulapu Suresh: ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కు అరుదైన గౌరవం లభించింది. న్యూఢిల్లీలోని ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్ (ఐఈటీఈ) ఫెలోగా మంత్రి ఆదిమూలపు సురేష్ ఎన్నికయ్యారు. కర్ణాటకలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి సివిల్ ఇంజినీరింగ్ చదివి, భారతీయ రైల్వేలో చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేశారు. ఆ తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఓ వైపు రాజకీయాల్లో ఉంటూనే మరోవైపు తన పరిశోధనను కొనసాగించి ఇటీవలే కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీని పొందారు ఏపీ మంత్రి. 

ఐఈటీఈ అనేది ఎలక్ట్రానిక్స్ మరియు టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ మరియు ఐటీ నిపుణుల యొక్క జాతీయ అపెక్స్ ప్రొఫెషనల్ బాడీ. దేశం, విదేశాలలో విస్తరించి ఉన్న ఈ సంస్థ 63 కేంద్రాల ద్వారా 1.25 లక్షల మందికి పైగా సభ్యులకు సేవలు అందిస్తోంది. మంత్రి డాక్టర్ సురేష్ ను విజయవాడ కేంద్రం నిర్వహించే కార్యకలాపాల్లో పాల్గొనాలని ఐఈటీఈ కోరింది. చురుకుగా పాల్గొని సంస్థ అభివృద్ధికి సహకరించాలని అభ్యర్థించింది. 

ఐఈటీఈ అంటే ఏమిటి?

ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్ (ఐఈటీఈ) అనేది సైన్స్, టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించిన ప్రొఫెషనల్ సొసైటీ. దీన్ని 1953లో స్థాపించారు. ఇది ప్రధానంగా భారతదేశంతో పాటు మరో మూడు దేశాల్లో విస్తరించి ఉంది. 63 కేంద్రాల ద్వారా 1.25 లక్షల మందికి పైగా సభ్యులకు సేవలు అందిస్తోంది. భారత ప్రభుత్వం ఐఈటీఈని సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎస్ఐఆర్ఓ)గా గుర్తించింది. అలాగే జాతీయ ఖ్యాతి గల విద్యా సంస్థగా కూడా గుర్తించబడింది. ఐఈటీఈ ఎలక్ట్రానిక్స్ మరియు టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ అభివృద్ధిపై దృష్టి పెడుతుంది. ఈ సంస్థ భారతదేశం అంతటా సాంకేతిక సమావేశాలు, సింపోజియం, ప్రదర్శనలను నిర్వహిస్తుంది. అలాగే సాంకేతిక మరియు పరిశోధన పత్రికలను ప్రచురిస్తుంది.  అలాగే సంస్థ సభ్యులకు నిరంతర విద్యతో పాటు కెరీర్ పురోగతి అవకాశాలను అందిస్తుంది.

ఐఈటీఈ నేడు భారతదేశంలో పని చేసే నిపుణులకు విద్యను అందించే ప్రముఖ సాంకేతిక సంస్థల్లో ఒకటి. ఈ సంస్ధ దేశ, విదేశాల్లో వేగంగా విస్తరిస్తోంది. 1953 నుండి ఐఈటీఈ తన విద్యా కార్యకలాపాలను ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలలో విస్తరించింది. ఈ సంస్థ పరీక్షల ద్వారా ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తుంది, ఇది డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్‌కి సమానమైన డీఐపీ ఐఈటీఈకి, బీటెక్ కు సమానమైన ఏఎంఐఈటీఈకి, ఎంటెక్ కు సమానమైన ఏఎల్ సీసీఎస్ కు దారి తీస్తుంది. ఐఈటీఈ డ్యూయల్ డిగ్రీ, డ్యూయల్ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌లను డిసెంబర్ 2011లో ప్రారంభించింది. డీఐపీ ఐఈటీఈ అనేది మూడు సంవత్సరాల ఆరు సెమిస్టర్ కోర్సు. అయితే ఏఎంఐఈటీఈ అనేది నాలుగు సంవత్సరాల ఎనిమిది సెమిస్టర్ కోర్సు. ఐఈటీఈ పైన పేర్కొన్న కోర్సులకు సంవత్సరానికి రెండు సార్లు జూన్ మరియు డిసెంబర్‌లో పరీక్షను నిర్వహిస్తుంది. 

Published at : 09 Oct 2022 10:58 AM (IST) Tags: AP News minister adimulapu suresh AP Minister IETE Fellow Minister Suresh Minister Suresh Latest News

ఇవి కూడా చూడండి

Andhra News: మిగ్ జాం తుపాను ప్రభావం - జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం

Andhra News: మిగ్ జాం తుపాను ప్రభావం - జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం

Andhra News: మిగ్ జాం తుపాను ఎఫెక్ట్ - లోకేశ్ యువగళం వాయిదా

Andhra News: మిగ్ జాం తుపాను ఎఫెక్ట్ - లోకేశ్ యువగళం వాయిదా

Top Headlines Today: ఏపీని భయపెడుతున్న మిగ్‌జాం తుపాను! తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరు?

Top Headlines Today: ఏపీని భయపెడుతున్న మిగ్‌జాం తుపాను! తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరు?

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు - తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరు.?

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు - తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరు.?

తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!

తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!

టాప్ స్టోరీస్

Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం

Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం

BRS Party News: ఇక తెలంగాణ భవన్ కేంద్రంగా బీఆర్ఎస్ పాలిటిక్స్: ఎమ్మెల్యేలకు కేటీఆర్ సూచనలు

BRS Party News: ఇక తెలంగాణ భవన్ కేంద్రంగా బీఆర్ఎస్ పాలిటిక్స్: ఎమ్మెల్యేలకు కేటీఆర్ సూచనలు

Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్

Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్

Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష- ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన

Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష-  ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన
×