KL Rahul Emotional Words About His Daughter | ఎమోషనల్ అయిన కె ఎల్ రాహుల్
ఇండియా - ఇంగ్లాండ్ టూర్‌లో క్లాస్ పర్ఫామెన్స్ తో అందర్నీ అక్కటుకునాడు కె.ఎల్. రాహుల్. ఓపెనర్ గా వచ్చి టీంకు మంచి బేస్ ని క్రియేట్ చేసేవాడు. అయితే క్రికెట్ కోసం తను చేసిన త్యాగాలు గుర్తు చేసుకుంటూ రాహుల్ ఎమోషనల్ అయ్యారు. ఐపీఎల్ 2025 సీజన్‌కి ముందు రాహుల్ దంపతులు పాపకు జన్మనిచ్చారు. దాదాపు ఐదు నెలల పాటు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చిందని అన్నారు.
‘పాప పుట్టిన రెండు రోజులకే ఐపీఎల్ గేమ్ ఆడడం కోసం వెళ్లాల్సి వచ్చింది. ఐపీఎల్ లో రెండు రోజుల బ్రేక్ దొరికినా.. తన దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నించేవాడిని. ఐపీఎల్ అవగానే భారత A తరపున ఆడాలని అనుకున్నాను. ఓ తండ్రిగా కూతురితో ఉండకుండా అలా వెళ్లిపోవాలని అనుకోవడం చాలా కష్టం. రెండు నెలల పాటు నా కూతుర్ని చూడలేదు. అది ఎంత బాధగా ఉంటుందో మాటల్లో చెప్పలేను. అయినా కూడా టీం కోసం... క్రికెట్ కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పలేదు అంటూ చెప్పుకొచ్చాడు క్రికెటర్ కెఎల్ రాహుల్.





















