News
News
X

Mekapati Capital : పులివెందులైనా.. విజయవాడైనా... జగన్ ఎక్కడ ఉంటే అదే రాజధానిగా తేల్చేసిన మంత్రి మేకపాటి

రాజ్యాంగంలో రాజధాని అనేది లేదని జగన్ ఎక్కడి నుంచి పరిపాలిస్తే అదే రాజధాని అని మంత్రి మేకపాటి గౌతం రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలోనే సీఎం జగన్ కూడా రాజ్యాంగంలో రాజధాని అనేదే లేదన్నారు.

FOLLOW US: 

ఆంధ్రప్రదేశ్ మంత్రులు రాజధాని అంశంఫై భిన్నమైన ప్రకటనలు చేస్తూ గందరోగళం సృష్టిస్తున్నారు. ఇప్పటి వరకూ రాజధాని అంశంపై ఎక్కువగా  మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఉంటారు.  ఇటీవల రైతులతో మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్ అని ప్రకటించి కలకలం రేపారు.  అమరావతి మొత్తం 20 గ్రామాలదేనని...  అక్కడంతా ఓ వర్గమే ఉంటుందని.. ఓ వర్గం ప్రయోజనాల కోసం రాజధాని ఉండాలా అని ప్రశ్నిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేసినా పట్టించుకోవడం లేదు. తాజాగా మరో మంత్రి మేకపాటి గౌతం రెడ్డి కూడా భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నిస్తున్నారు.

తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అని స్పష్టం చేశారు. అది పులివెందుల అయినా కావొచ్చు .. విజయవాడ కావొచ్చు.. మరో ప్రాంతం కావొచ్చన్నారు. సీఎం ఎక్కడ ఉంటే అక్కడే సెక్రటేరియట్ ఉంటుందని.. అదే రాజధాని అని తేల్చేశారు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం సీఎం జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేశారని స్పష్టం చేశారు. నిజానికి మంత్రి మేకపాటి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు అసెంబ్లీలో సీఎం జగన్ చెప్పిన మాటలే.  గతంలో మూడు రాజధానుల బిల్లులు అసెంబ్లీలో ప్రవేశ పెట్టినప్పుడు మాట్లాడిన సందర్భంలో అసలు రాజ్యాంగంలో రాజధాని అనే ప్రస్తావన లేదన్నారు. సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని అని తేల్చేశారు.

అయితే అలాంటి దానికి మరి బిల్లులుఎందుకు ప్రవేశ పెట్టారని మూడు రాజధానులు అని ఎందుకు చెబుతున్నారని విపక్షాలు విమర్శించాయి అది వేరే విషయం. ఇటీవలి కాలంలోపలువరుు మంత్రులు కూడా ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అనే వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల బిల్లులు న్యాయవివాదాల్లో చిక్కుకోవడంతో కార్యాలయాల తరలింపు సాధ్యం కావడం లేదు. దీంతో సీఎం క్యాంప్ ఆఫీస్‌ను మాత్రం విశాఖకు తరలిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అందుకే పలువురు మంత్రులు ఇటీవలి కాలంలో సీఎం  ఎక్కడ ఉంటే అదే రాజధాని అన్న వాదన వినిపిస్తున్నారన్న అభిప్రాయం ఉంది. సీఎం ఎక్కడ ఉండాలన్న అంశాన్ని కోర్టులు కూడా నిర్దేశించలేవు.

అయితే కార్యాలయాలను మాత్రం తరలించడానికి సాధ్య పడదు. మరి సీఎం విశాఖ వెళ్లిపోయి.. కార్యాలయాలు అమరావతిలో ఉంటే పాలన ఇబ్బందుల్లో పడుతుంది. అయితే నిజంగా సీఎం జగన్‌కు  అమరావతి అంశంలో న్యాయపరమైన సమస్యలు పరిష్కారం కాకుండా విశాఖకు వెళ్లాలని ఉందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు . కానీ రాజధాని అంశంపై మాట్లాడాల్సి వచ్చినప్పుడల్లా మంత్రులు మాత్రం వివాదాస్పద రీతిలో స్పందిస్తూనే ఉన్నారు. 

Published at : 31 Aug 2021 03:41 PM (IST) Tags: cm jagan amaravati andhra capital minister mekapati no capital in constitution

సంబంధిత కథనాలు

Chittoor Crime : కన్న కూతురిపై అత్యాచారం కేసులో తల్లిదండ్రులకు జీవిత ఖైదు, ఫోక్సో కోర్టు సంచలన తీర్పు

Chittoor Crime : కన్న కూతురిపై అత్యాచారం కేసులో తల్లిదండ్రులకు జీవిత ఖైదు, ఫోక్సో కోర్టు సంచలన తీర్పు

Nagarjuna No Politics : విజయవాడ ఎంపీగా పోటీపై నాగార్జున క్లారిటీ - అంటే వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా ?

Nagarjuna No Politics :  విజయవాడ ఎంపీగా పోటీపై నాగార్జున క్లారిటీ - అంటే వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా ?

Minister Jogi Ramesh : సత్య కుమార్ ఒళ్లు దగ్గర పెట్టుకో, నీ వెనకాల ఎవరున్నారో మాకు తెలుసు- మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh : సత్య కుమార్ ఒళ్లు దగ్గర పెట్టుకో, నీ వెనకాల ఎవరున్నారో మాకు తెలుసు- మంత్రి జోగి రమేష్

Kurnool News : రోజంతా మేత పెట్టలేదు, కర్నూలు మున్సిపల్ ఆఫీసులో గాడిదలతో నిరసన

Kurnool News : రోజంతా మేత పెట్టలేదు, కర్నూలు మున్సిపల్ ఆఫీసులో గాడిదలతో నిరసన

YSR Kalyanamasthu : రేపటి నుంచి అమల్లోకి వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా- వెబ్ సైట్ ప్రారంభించిన సీఎం జగన్

YSR Kalyanamasthu : రేపటి నుంచి అమల్లోకి వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా- వెబ్ సైట్ ప్రారంభించిన సీఎం జగన్

టాప్ స్టోరీస్

68th National Film Awards: జాతీయ అవార్డుల ప్రధానోత్సవం - ఐదు అవార్డులతో ఓ మెరుపు మెరిసిన సూర్య, జ్యోతిక, ప్రత్యేక ఆకర్షణగా తమన్!

68th National Film Awards: జాతీయ అవార్డుల ప్రధానోత్సవం - ఐదు అవార్డులతో ఓ మెరుపు మెరిసిన సూర్య, జ్యోతిక, ప్రత్యేక ఆకర్షణగా తమన్!

JioPhone 5G Launch: రూ.8 వేలలోపే జియో 5జీ ఫోన్! - ఫీచర్లు కూడా లీక్!

JioPhone 5G Launch: రూ.8 వేలలోపే జియో 5జీ ఫోన్! - ఫీచర్లు కూడా లీక్!

Nanjiyamma: ఎవరీ నంజియమ్మ - మొదటి ప్రొఫెషనల్ సినిమాతోనే నేషనల్ అవార్డు!

Nanjiyamma: ఎవరీ నంజియమ్మ - మొదటి ప్రొఫెషనల్ సినిమాతోనే నేషనల్ అవార్డు!

Vivo X Fold Plus: రూ.లక్షకు పైగా రేటుతో వివో కొత్త ఫోన్ - మొబైల్ మడిచి జేబులో పెట్టుకోవడమే!

Vivo X Fold Plus: రూ.లక్షకు పైగా రేటుతో వివో కొత్త ఫోన్ - మొబైల్ మడిచి జేబులో పెట్టుకోవడమే!