Manickam Tagore: ప్రత్యేక హోదాకు 15 సార్లు అవకాశం వచ్చినా వైసీపీ చేజార్చింది: మాణికం ఠాగూర్
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy)పై మాణికం ఠాగూర్ రాజ్యసభ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. రాజ్యసభలో విజయసాయిరెడ్డి సోమవారం మాట్లాడుతూ.. తనపై అసత్య ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
![Manickam Tagore: ప్రత్యేక హోదాకు 15 సార్లు అవకాశం వచ్చినా వైసీపీ చేజార్చింది: మాణికం ఠాగూర్ Manickam Tagore sensational comments against YS Jagan and Vijayasai Reddy Manickam Tagore: ప్రత్యేక హోదాకు 15 సార్లు అవకాశం వచ్చినా వైసీపీ చేజార్చింది: మాణికం ఠాగూర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/06/69b072a18f69ba80223488536641ee5a1707243141864233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Manickam Tagore comments against YS Jagan and Vijayasai Reddy న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేసుల భయంతోనే బీజేపీకి లొంగారని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్ సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై మాణికం ఠాగూర్ రాజ్యసభ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. రాజ్యసభలో విజయసాయిరెడ్డి సోమవారం మాట్లాడుతూ.. తనపై అసత్య ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లోక్‌సభ సభ్యుడి గురించి రాజ్యసభలో మాట్లాడటం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చింది భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అని... ఆ హామీని అమలు చేయనందుకు మోదీని ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. 2019 నుంచి దాదాపు అన్ని బిల్లులు ఏపీ సీఎం జగన్ (YS Jagan) మద్దతుతోనే పార్లమెంట్‌లో ఆమోదం పొందాయి. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విపక్షాలన్నీ బహిష్కరిస్తే ఆయన మాత్రం హాజరయ్యారు. అన్ని ప్రజా వ్యతిరేక బిల్లుల ఆమోదానికి మద్దతుగా నిలిచారు.
15 సార్లు అవకాశం వచ్చినా వైసీపీ చేజార్చింది..
ప్రత్యేక హోదా సాధనకు 15 సార్లు అవకాశం వచ్చినా వైసీపీ చేజార్చుకుందని మాణికం ఠాగూర్ అన్నారు. పార్లమెంట్ ఉభయ సభలో బిల్లులకు మద్దతు ఇస్తారు. బయటికి వచ్చి వ్యతిరేకంగా మాట్లాడుతారు.. ఇదేనా రాష్ట్ర ప్రయోజనాలపై జగన్ కు ఉన్న చిత్తశుద్ధి అని ప్రశ్నించారు. సీఎం జగన్ బీజేపీ కి ఏటీఎంలా మారారని.. వీటన్నింటికి కారణం విజయసాయిరెడ్డి అని వ్యాఖ్యానించారు. కేంద్రానికి వైఎస్సార్ సీపీ మద్దతుగా నిలవడం వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. కేవలం వారిద్దరి వ్యక్తిగత అవసరాలు, సీబీఐ కేసుల నుంచి మినహాయింపు కోసం మాత్రమే బీజేపీకి లొంగిపోయారని మాణికం ఠాగూర్ ఆరోపించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)