అన్వేషించండి

Maddelacheruvu Suri Murderer Bhunukiran : మద్దెలచెరువు సూరి హంతకుడికి అదే సరైన శిక్ష - తగ్గించేందుకు హైకోర్టు నిరాకరణ

Suri Murder Case : మద్దెలచెరువు సూరి మర్డరర్ భూనుకిరణ్ కు హైకోర్టులో షాక్ తగిలింది. ఆయన శిక్షపై రివ్యూ చేయడానికి నిరాకరించంది.

Telangana News :  ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్దెలచెరువు సూరి హత్య కేసులో శిక్షపడిన భానుకిరణ్ కు హైకోర్టులో చుక్కెదురైంది.  కింద కోర్టు ఇచ్చిన యావజీవశిక్ష ను సవాల్ చేస్తూ భానుకిరణ్  హై కోర్టులో పిటిషన్ వేశారు.  భాను కిరణ్ పిటిషన్ ను కొట్టివేస్తూ యావజీవ కారాగార అమలు చేసేలా కింది కోర్టు ఆదేశాలను  హైకోర్టు సమర్థించింది. ఇక భానుకిరణ్ కు సుప్రీంకోర్టుకు వెళ్లడమే మిగిలింది. 

2018 డిసెంబర్‌లో యావజ్జీవ శిక్ష విధించిన నాంపల్లి కోర్టు                     

మద్దెలచెరువు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరి హత్యకేసులో నాంపల్లి కోర్టు  2018 డిసెంబర్‌లో తుది తీర్పు వెలువరించింది.   ప్రధాన నిందితుడు భానుకిరణ్‌‌‌‌కు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.20 వేలు జరిమానా విధించింది. మరో నిందితుడు మన్మోహన్ సింగ్‌కు ఐదేళ్ల సాధారణ జైలు శిక్షను విధించింది. మరో నలుగురు నిందితులను నిర్దోషులుగా విడిచిపెట్టింది.  ఆయుధాల చట్టం కింద మన్మోహన్‌కు అదనంగా ఐదేళ్ల శిక్ష ఖరారు చేసింది. సూరిని హత్య చేసినప్పటి నుండి భానుకిరణ్ జైల్లోనే ఉన్నాడు. 

2011 జనవరి 4న సూరిని హత్య చేసిన భానుకిరణ్                               
 
టీడీపీ నేత పరిటాల రవి హత్యకేసులో ప్రధాన నిందితునిగా ఉన్న మద్దెలచెరువు సూరి బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత కొంత మంది అనుచరులతో కలిసి సెటిల్మెంట్లు చేస్తూ ఉండేవారు. బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో ఉండేవారు. ఆయన ప్రధాన అనుచరునిగా భానుకిరణ్ అనే వ్యక్తి వ్యవహరించేవారు. ఓ విషయంపై లాయర్ తో మాట్లాడేందుకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో   2011 జనవరి 4న త యూసుఫ్‌గూడ ప్రాంతంలో నాటు తుపాకీతో మద్దెలచెర్వు సూరిని కాల్చి చంపాడు. ముందు సీటులో కూర్చున్న సూరిని.. వెనుక సీటులో కూర్చున్న భానుకిరణ్ కాల్చి చంపారు. తర్వాత పరారయ్యాడు.  2012 ఏప్రిల్ వరకూ ఎవరికీ దొరకకుండా పరారీలో ఉన్నాడు. మధ్య ప్రదేశ్ తో పాటు వివిధ  ప్రాంతాల్లో తలదాచుకున్నారు. చివరికి 2012 ఏప్రిల్ 21v  జహీరాబాద్ వద్ద భానుకిరణ్‌ను అరెస్ట్ చేశారు. 

సూరి బినామీగా పేరు                                           

మద్దెలచెర్వు సూరి సెటిల్మెంట్లు చేసి సంపాదిచిన సొమ్మును భానుకిరణ్ పేరు మీద బినామీగా ఉంచారన్న  ప్రచారం జరిగింది. అందుకే పోలీసులకు చిక్కిన తర్వాత భానుకిరణ్ హత్య చేస్తారన్న భయంతో బయటకు వచ్చేందుకు ప్రయత్నించలేదు. చాలా కాలం పాటు బెయిల్ కోసం ప్రయత్నించలేదు.  పరిస్థితులు సద్దుమణిగాయనుకున్న తర్వాత ఆయన ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈ లోపు యావజ్జీవ శిక్ష పడింది. బయటకు వచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సాధ్యం కావడం లేదు. ఇక చివరి ఆప్షన్ గా సుప్రీంకోర్టులో ప్రయత్నించడమే మిగిలింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Lookback 2024: ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Lookback 2024: ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Embed widget