By: ABP Desam | Updated at : 22 Feb 2023 09:39 PM (IST)
చంద్రబాబు కనుసైగ చేస్తే ఎవర్నీ వదలం - వైఎస్ఆర్‌సీపీ నేతలకు లోకేష్ హెచ్చరిక !
Nara Lokesh : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కనుసైగ చేస్తే చాలు వంద వైసీపీ ఆఫీసులు తగులబెడతామని తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ హెచ్చరించారు. గన్నవరం పరిణామాలపై చిత్తూరు జిల్లా పాదయాత్రలో ఆయన మాట్లాడారు. గన్నవరం టిడిపి ఆఫీసు తగలబెడితో నో కేస్ ..లోకేష్ స్టూలు ఎక్కి మాట్లాడితే కేస్... నాపై దాడికి వైసీపీ కత్తులు, కర్రలతో వస్తే నో కేస్.. నేను మాట్లాడితే కేస్ అని మండిపడ్డారు. ఒక్క టీడీపీ ఆఫీసుపై దాడి చేస్తే వంద వైసీపీ ఆఫీసులు తగులబెడతామన్నారు. టీడీపీ ఆఫీసులపై దాడి చేసిన వాళ్లను డ్రాయర్లతో నడి రోడ్డుపై ఊరేగిస్తామని హెచ్చరించారు.
మీసం మెలేసి సవాల్ విసిరిన లోకేష్
గన్నవరం టిడిపి ఆఫీసు తగలబెడితో నో కేస్
లోకేష్ స్టూలు ఎక్కి మాట్లాడితే కేస్
నాపై దాడికి వైసీపీ కత్తులు, కర్రలతో వస్తే నో కేస్
నేను మాట్లాడితే కేస్@ncbn గారు ఒక్క చిటికేస్తే చాలు.
మీసం మెలేసి చెబుతున్నా..ఒక్కొక్కడికీ పగిలిపోద్ది pic.twitter.com/7FFWmTfvvl— Telugu Desam Party (@JaiTDP) February 22, 2023
లోకేష్ పాదయాత్ర యేర్పేడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్దకు చేరుకున్న సమయంలో ఉద్రిక్తత ఏర్పడింది. లోకేష్పై దాడి చేసేందుకు వైసీపీ మూకల ఏర్పాట్లు చేసుకున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ ఫిర్యాదుతో వైసీపీ నేతలతో పోలీసులు మాట్లాడి వచ్చారు. వైసీపీ నేతలతో మాట్లాడామని ఎలాంటి ప్రమాదం లేదని పోలీసులు చెప్పారు. పాఠశాలలో వైసీపీ నేతలకు ఏం పని అని టీడీపీ నేతలు ప్రశ్నించారు. లోకేష్ పర్యటనకు రక్షణగా వచ్చారా?.. వైసీపీ నేతలకు కాపలాగా వచ్చారా? అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
డీఎస్పీ గారు మొన్న వైసిపి వాళ్ళు రాళ్లు వేయడానికి వచ్చారు మీరు కేసులు పెట్టలేదు.. ఇవ్వాళ కత్తులు,రాళ్లు తీసుకొచ్చారు..
— Telugu Desam Party (@JaiTDP) February 22, 2023
డీఎస్పీ గారు రౌడీలకి కాపలా కాయొద్దు... #YuvaGalamPadayatra#YuvaGalam#LokeshPadayatra #NaraLokesh#yuvagalamlokesh #IdhemKarmaManaRashtraniki pic.twitter.com/aeMWwSXpcW
లోకేష్ పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు కూడా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. వజ్ర వాహనాన్ని కూడా పాదయాత్రలో ఉంచుతున్నారు. అయితే దాడులు చేయాలనుకున్న వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలపై పోలీసులు చర్యలు తీసుకుంటే ఎవరూ దాడులకు చేయడానికి ముందుకు రారని టీడీపీ కార్యకర్తలంటున్నారు.
మరో వైపు నారా లోకేష్ పాదయాత్ర ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర విమర్శలు బెల్టు షాపులు లేవన్న సీఎం జగన్ ప్రకటనలు అబద్దమని చెబుతూ.. ఓ బెల్ట్ షాప్ వద్ద సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Wanted to share some liquor facts from AP…
— Lokesh Nara (@naralokesh) February 22, 2023
Liquor Ban Promise: Gone
Liquor Sold by: Jagan & Co
Liquor Money Goes To: Tadepalli Palace
Liquor Prices: Highest in the Country
Liquor Quality: Lowest in the Country. Dangerous.
Who collects money at palace: _ _ _ _ _ _ _ _ pic.twitter.com/l58xHIA1oE
Visakha G20 Summit : ఈ నెల 28, 29న విశాఖలో జీ20 సదస్సు, హాజరుకానున్న 69 మంది విదేశీ ప్రతినిధులు
Covid19 Cases: కొవిడ్ కేసుల పెరుగుదలతో ఏపీ అలర్ట్ - తెలంగాణను భయపెడుతున్న H3N2 కేసులు
Mlc Dokka Vara Prasad : సస్పెండ్ చేయగానే టీడీపీ నినాదం, ఇంతకన్నా ఫ్రూప్ ఏంకావాలి- ఉండవల్లి శ్రీదేవికి డొక్కా కౌంటర్
MLA Maddali Giridhar: "క్రాస్ ఓటింగ్ కోసం టీడీపీ నేతలు నన్నూ సంప్రదించారు, కావాలంటే కాల్ డేటా చూడండి"
Divya Darshan Tickets : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, కాలినడకన వచ్చే వారికి దివ్యదర్శనం టోకెన్లు జారీ!
Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!
Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!