(Source: ECI/ABP News/ABP Majha)
Nara Lokesh : కర్ణాటక లాస్ విశాఖకు గెయిన్ - నారా లోకేష్ పర్‌ఫెక్ట్ ప్లాన్
Andhra Pradesh : కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఐటీ పరిశ్రమల్ని విశాఖకు ఆహ్వానించారు లోకేష్. ఏపీ మంత్రి క్విక్ రెస్పాన్స్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Nara Lokesh invited IT industry to Visakha : విశాఖలో ఐటీ పరిశ్రమలు స్థాపించాలని వారికి కావాల్సిన భూమి, విద్యుత్, మౌలిక సదుపాయాలను ప్రభుత్వం ప్రయారిటీగా కల్పిస్తుందని ఏపీ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. సాఫ్ట్ వేర్ కంపెనీల అసోసియేషన్ నాస్కామ్ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. స్థానికులకే 75 శాతం ఉద్యోగాలివ్వాలని చట్టం చేసింది. ఐటీ ఉద్యోగాల్లో స్థానికులకే ఉద్యోగాలివ్వడం అసాధ్యమని నాస్కామ్ అభిప్రాయం. అందుకే ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నాస్కామ్ ఓ లేఖ విడుదల చేసింది. దీనిపై నారా లోకేష్ వెంటనే రియాక్ట్ అయ్యారు. ఐటీ కంపెనీలను విశాఖకు ఆహ్వానించారు.
Dear @NASSCOM members,
— Lokesh Nara (@naralokesh) July 17, 2024
We understand your disappointment. We welcome you to expand or relocate your businesses to our IT, IT services, AI and data center cluster at Vizag.
We will offer you best-in-class facilities, uninterrupted power, infrastructure and the most suitable… https://t.co/x2N0CTbnfp
కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇదీ
కర్ణాటకలోని ప్రైవేటు సంస్థల్లో గ్రూప్ సి, డి గ్రేడ్ పోస్టుల్లో కన్నడిగులకే 100 శాతం అవకాశాలు కల్పించాలని కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రైవేటు సంస్థల్లో నాన్ మేనేటిమెంట్ కోటాలో 70 శాతం, మేనేజిమెంట్ కోటాలో 50 శాతం పోస్టులను కన్నడిగులకు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. ''కర్ణాటక స్టేట్ ఎంప్లాయిమెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ది ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ అండ్ అదర్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ బిల్-2024''ను అసెంబ్లీలో పెట్టి ఆమోదించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
గురువారం సాయంత్రం 4 గంటలు - రైతుల మొబైల్స్‌లో మెసెజ్‌ల మోత ఖాయం !
కర్ణాటకకు పరిశ్రమలు రావని ఆందోళన
ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలనే క్యాబినెట్ నిర్ణయంపై పారిశ్రామిక వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నైపుణ్యం ఉన్న సిబ్బంది నియామకాల విషయంలో మినహాయింపులు ఉండాలని అంటున్నారు. టెక్ హబ్‌గా తమకు నైపుణ్యం కలిగిన సిబ్బంది అవసరమని, స్థానికులకు ఉద్యోగాల కల్పన లక్ష్యంగా తీసుకుంటే టెక్నాలజీరంగంలో లీడింగ్ పొజిషన్‌పై ప్రభావం పడుతుందని ఐటీ కంపెనీలు అంటున్నాయి. ఈ నిర్ణయాన్ని తమకు అనుకూలంగా మల్చుకోవాలని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. వారిని విశాఖకు ఆహ్వానిస్తున్నారు.