అన్వేషించండి

Nara Lokesh : కరువుపై సమీక్షించేంత తీరిక లేదా ? - తక్షణం రైతుల్ని ఆదుకోవాలనిసీఎం జగన్‌కు లోకేష్ లేఖ !

కరువు బారిన పడిన రైతులను ఆదుకోవాలని లోకేష్ సీఎం జగన్ కు లేఖ రాశారు. రైతులకు తక్షణం నష్టపరిహారం ప్రకటించాలని కోరారు.


Nara Lokesh :   కరువు బారిన పడిన రైతుల్ని ఆదుకోవాలని నాా లోకేష్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు.  ఎండిన పంట‌లు చూస్తే గుండె త‌రుక్కుపోతోందన్నారు.  పంట‌ల్ని రైతులు త‌గ‌ల‌బెడుతుంటే క‌ళ్లలో నీళ్లు తిరుగుతున్నాయని..  వ‌రి వేసిన పొలాల్లో ఉరి వేసుకుంటోన్న రైతుల్ని చూస్తే హృద‌యం ద్రవించిపోతోందని లేఖలో తెలిపారు.  నీరు వ‌దిలి పంట‌ల్ని కాపాడాలంటూ అధికారుల కాళ్లపై ప‌డి ప్రాధేయ ప‌డుతున్న అన్నదాత‌లు, సాగు నీటి కోసం రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్న రైతులే రాష్ట్రమంతా క‌నిపిస్తున్నారు.  ప్రభుత్వం త‌క్షణ‌మే స్పందించ‌క‌పోతే ఆంధ్రప్రదేశ్‌ రైతుల్లేని రాష్ట్రం అయ్యే ప్రమాదం పొంచి వుందమని హెచ్చరించారు. 

ఏపీలో వందేళ్లలో లేనటువంటి కరువు పరిస్థితులు                 

రాష్ట్రంలో గత వందేళ్లలో ఇంతటి కరవు పరిస్థితులు ఎన్నడూ లేవన్నారు.  తొలిసారి అతి తక్కువ వర్షపాతం మీ పాలనలో నమోదైంది. రైతు ఆత్మహ‌త్యల్లో ఏపీ దేశంలోనే 3వ స్థానంలో ఉంది. అనేక మండలాల్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులను కేంద్రానికి నివేదించడంలో విఫలమైంది మీ ప్రభుత్వం. ఖరీఫ్ పంటలే నీటికి కటకటలాడుతుంటే, రబీ సాగు ప్రశ్నార్థకమే. కొన్ని ప్రాజెక్టులలో నీటి నిల్వ లేదు, మరికొన్ని ప్రాజెక్టుల్లో నీరున్నా.. పంటలు ఎండిపోతున్నా వ‌ద‌ల‌రు. ఈ అస్తవ్యస్థ పరిస్థితుల్ని ప్రజలకి వివరించేందుకు వ‌చ్చిన చంద్రబాబు గొంతు నొక్కేందుకు తప్పుడు కేసులు పెట్టి జైలులో బంధించారు. వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ఆయ‌న‌ని జైలులో నిర్బంధించే కుట్రల‌పై స‌మీక్షించే స‌మ‌యం ఉంది కానీ, క‌రువుపై సమీక్షించే తీరిక లేని సీఎం ఉండడం ప్రజల దురదృష్టమని  మండిపడ్డారు. 

రైతులకు పంట నష్టపరిహారం తక్షణం ఇవ్వాలి        

పెన్నా, తుంగభద్ర కాలువల కింద, కృష్ణా డెల్టాలోనూ సాగునీటి కోసం అన్నదాతలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. వరి, మిర్చి, పత్తి, వేరుశనగ పూర్తిగా దెబ్బతిన్నాయి. బోర్లు, బావుల నుంచి నీరందించి పంటలు కాపాడుకుందామంటే కరెంటు కోతలతో సాధ్యం కావడంలేదు. రైతులని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి.  యుద్ధప్రాతిప‌దిక‌న‌ కరువు మండలాలని గుర్తించి కేంద్రానికి నివేదిక పంపాలి. వ్యవసాయ రుణాలు రద్దు చేయాలి. పంట‌ నష్టం అంచనా వేసి రైతుల‌కు నష్ట పరిహారం తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. 

వర్షాలు పడకపోవడంతో ఏపీలో దుర్బిక్ష పరిస్థితులు                 

ఈ ఏడాది వర్షాకాలం వచ్చిందనే పేరే కానీ .. ఒకటి రెండు వర్షాలు మాత్రమే పడ్డాయి. రిజర్వాయర్లలోకి నీళ్లు రాలేదు. చెరువుల్లో తడి లేదు. ఎండలు మాత్రం ఎండా కాలం మాదిరిగా ఉన్నాయి. ఏపీలో పంటలు నాశనమవుతున్నాయి. ఇప్పటివరకు 50 శాతం విస్తీర్ణంలోనే సాగులో ఉంది. అందులోనూ నీరు లేక.. కరెంట్ ఇవ్వక పంటలు ఎక్కువగా ఎండిపోతున్నాయి. వర్షాభావం వల్ల గుంటూరు, ప్రకాశం నెల్లూరు, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతో పాటు రాయలసీమలోసాగు రంగంపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో విపక్ష పార్టీల నేతలు.. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly: 'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
Today Headlines: రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
KTR Letter: అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly: 'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
Today Headlines: రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
KTR Letter: అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana News: ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
BJP MP Pratap Sarangi Injured: రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Amit Shah: అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
Embed widget