Kuppam Lokesh 2nd Day : బీసీలు ఆర్థికంగా బలపడేలా సాయం - జగన్‌లా నెరవేర్చలేని హామీలు ఇవ్వలేనన్న లోకేష్ !
బీసీ కులాలను జగన్ మోసం చేశారని తాము అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు. రెండో రోజు పాదయాత్రలో బీసీ కులాల ప్రజలతో సమావేశం అయ్యారు.
Kuppam Lokesh 2nd Day : బీసీలు ఆర్థికంగా రాజకీయంగా ఎదిగేలా ప్రోత్సాహం ఇస్తామని యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ భరోసా ఇచ్చారు. కుప్పం నియోజకవర్గం రెండో రోజు పాదయాత్రలో ఆయన బీసీలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత బీసీలు పడుతున్న ఇబ్బందులు లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు వివిధ కులాల ప్రతినిధులు. ప్రభుత్వం వచ్చిన వెంటనే వాల్మీకి, బోయలను ఎస్టీల్లో చేరుస్తా అని జగన్ హామీ ఇచ్చాడని ఆ హామీ ఏమి అయ్యిందని లోకేష్ ప్రశ్నించారు. రిజర్వేషన్లు తగ్గించి సుమారు 16,500 మంది బీసీలను పదవులకి దూరం చేశారని.. బీసిల్లో 140కి పైగా కులాలు ఉంటే కేవలం 4 కులాలకి మాత్రమే అరకొర ఆర్ధిక సహాయం అందిస్తున్నారని మండిపడ్డారు. వైసిపి పాలనలో 26 మంది బీసీలను దారుణంగా చంపేశారని గుర్తు చేశారు.
ఉప కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు కానీ ఒక్క లోన్ ఇచ్చారా? ఒక్కరికైనా సబ్సిడీ ఇచ్చారా?... అని ప్రశ్నించారు. వడ్డెర్ల చేతిలో ఎన్నో ఏళ్లుగా ఉన్న పనులను వైసిపి నాయకులు బలవంతంగా లాక్కున్నాని.. ఉన్న ఆదరణ పథకం ఎత్తేసారు. టిడిపి హయాంలో కొన్న పనిముట్లు కూడా ఇవ్వని సైకో జగన్ అని విమర్శించారు. వైసీపీ రంగులు వేసుకుని అయినా పనిముట్లు ఇవ్వాలని జగన్‌కు సహా ఇచ్చారు. కనీసం కట్టిన 10 శాతం సొమ్ము కూడా తిరిగి ఇవ్వలేదన్నారు. కుల వృత్తులను దెబ్బ తీసి.. ఉపాధి లేకుండా చేశారని విమర్శించారు.టిడిపి హయాంలో రజక సోదరులకు వాషింగ్ మెషీన్ లు, ఇస్త్రీ పెట్టెలు ఇచ్చామని గుర్తు చేశారు.
రెండో రోజు యువగళం పాదయాత్రలో భాగంగా పీఈఎస్ మెడికల్ కాలేజీ సమీపంలో నిర్మాణం ఆగిపోయిన వాల్మీకి, కురుబ కమ్యూనిటీ హాల్స్ ని పరిశీలించాను.
— Lokesh Nara (@naralokesh) January 28, 2023
తెలుగుదేశం హయాంలో రూ.10 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఈ నిర్మాణాలను వైసిపి ప్రభుత్వం కక్ష పూరితంగా అపేసిందని బీసీ ఆవేదనతో చెప్పారు(2/7) pic.twitter.com/YY50y7jYTI
-
అధికారంలోకి వచ్చాకా దామాషా ప్రకారం నిధులు, ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందిస్తామని.. మ్యూనిటీ హాల్స్ కట్టడానికి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు గుడుల నిర్మాణం కోసం సహకారం అందిస్తామని.. జగన్ లా తప్పుడు హామీలు ఇవ్వను. ఇచ్చిన హామీ ఖచ్చితంగా నెరవేరుస్తానని ప్రకటించారు. ఉప కులాల వారీగా సమస్యలు తెలుసుకొని అందరికీ సమ న్యాయం చెయ్యడానికే టిడిపి లో సాధికారసమితి ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. నిర్మాణాలు ఆగిపోయిన బీసీ కులాల భవనాలను లోకేష్ పరిశీలించారు.
పాదయాత్ర కడవల్లి గ్రామంలో జరుగుతున్న సమయంలో కడపల్లి లో పొలంలో పని చేసుకుంటున్న రైతు దంపతులు రాజమ్మ, ముని రత్నం ని నారా లోకేష్ కలిశారు. మొక్క జొన్న, టొమాటో పంటలు వేసి నష్ట పోయాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి పెరిగిపోతుంది, పండిన పంటకు కనీస ధర రాక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. 3 వేల కోట్ల తో ప్రత్యేక నిధి పెట్టి గిట్టు బాటు ధర కల్పిస్తాం అన్న జగన్ రెడ్డి ఎక్కడ? అని లోకేష్ ప్రశ్నించారు. వ్యవసాయం చేసే రైతుకి సాయం అందడం లేదు...ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు...రైతుల మెడలో మీటర్లు ఉరి తాళ్ళు కాబోతున్నాయి...వైసిపి ప్రభుత్వ విధానాల వలన రైతులు క్రాప్ హాలిడే ఇచ్చే దుస్థితి వచ్చిందని విమర్శించారు.
పిఈఎస్ మెడికల్ కాలేజీ ప్రాంగణానికి వడ్డిపల్లి గ్రామానికి చెందిన మద్దేటి రిషికేష్, అశ్వని దంపతులు తమ 3 నెలల పసిబిడ్డను తీసుకుని వచ్చి పేరు పెట్టాలని కోరారు. లోకేష్ ఆ పాపకు శాన్విత అని పేరు పెట్టారు. [
మొదటి రోజు పాదయాత్ర అనంతరం నేను బస చేసిన పిఈఎస్ మెడికల్ కాలేజీ ప్రాంగణానికి వడ్డిపల్లి గ్రామానికి చెందిన మద్దేటి రిషికేష్, అశ్వని దంపతులు తమ 3 నెలల పసిబిడ్డను తీసుకుని వచ్చి పేరు పెట్టాలని కోరారు. వారి అభిమానం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. పాపకు శాన్విత అని నామకరణం చేశాను.(1/7) pic.twitter.com/Kkt26AEvoQ
— Lokesh Nara (@naralokesh) January 28, 2023