YS Sharmila: ఇదేనా వైఎస్ఆర్ వారసత్వం? వైసీపీకి ఓటేస్తే బూడిదలోపోసిన పన్నీరే - షర్మిల
Kurnool News: కర్నూలు జిల్లాలో వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్ వారసుడు అయితే గుండ్రెవుల ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదని అన్నారు? ఇదేనా వైఎస్ఆర్ వారసత్వం? అని ప్రశ్నించారు.
YS Sharmila Comments: ఏపీలో అధికార వైఎస్ఆర్ సీపీకి ఓటు వేయడం.. బూడిదలో పోసిన పన్నీరుతో సమానమని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఈ 10 ఏళ్లలో కర్నూల్ లో జరిగిన అభివృద్ధి శూన్యం అని అన్నారు. కనీసం మంచినీళ్ళు ఇవ్వలేని దుస్థితి ఉందని.. కర్నూల్ న్యాయ రాజధాని అని మోసం చేశారని అన్నారు. ఇటుకపెళ్ళ కూడా కట్టలేదని.. అటు గుండ్రేవుల ప్రాజెక్ట్ వైఎస్ఆర్ కట్టాలని అనుకున్న ప్రాజెక్ట్ అని అన్నారు. అది పూర్తయి ఉంటే 2 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేదని అన్నారు. కర్నూల్ లో 6 లక్షల మంది ప్రజలకు తాగునీరు కూడా వచ్చేదని అన్నారు. వైఎస్ఆర్ వారసుడు అయితే గుండ్రెవుల ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదని అన్నారు? ఇదేనా వైఎస్ఆర్ వారసత్వం? అని ప్రశ్నించారు. కర్నూలు జిల్లాలో వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
‘‘నాన్న వదిలి పెట్టిన ప్రాజెక్ట్ లను 6 నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎందుకు పూర్తి చేయలేదు అని అడుగుతున్నాం. జగన్ ఇచ్చిన ఒక్క హామీ అమలు కాలేదు. ప్రతి ఏడాది జ్యాబ్ క్యాలెండర్ అని ఒక్క క్యాలెండర్ వేశారా? 2.25 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్ని నోటిఫికేషన్ లు ఇచ్చారు? మద్య నిషేధం అని మోసం చేశారు. నిషేధం పేరు చెప్పి సర్కార్ మద్యం అమ్ముతుంది. క్వాటర్ బాటిల్ 60 రూపాయలు ఉంటే 250 అమ్ముతున్నారట.
ఆర్టీసీ చార్జీలు పెంచారు. కరెంట్ చార్జీలు పెంచారు. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగుతున్నారు. చేసిన మోసం చాలదని ఇప్పుడు సిద్ధం అని బయలుదేరారు. ఎందుకు సిద్ధం అని మేము అడుగుతున్నాం. ప్రత్యేక హోదా అని మోసం చేసినందుకు సిద్ధమా? గుండ్రెవుల, హంద్రీనీవా పూర్తి చేస్తామని మోసం చేసినందుకు సిద్ధమా? ఉద్యోగాలు ఇస్తామని మోసం చేయడానికి సిద్ధమా? రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది కాంగ్రెస్ మాత్రమే. రాష్ట్రానికి హోదా ఇచ్చేది కాంగ్రెస్ మాత్రమే. 10 ఏళ్లు హోదా ఇస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టింది. ఆ మాట పట్టుకొని YSR బిడ్డ ఇక్కడకు వచ్చింది. హోదా నే మన ఊపిరి. హోదానే మనకు సంజీవని. హోదా ఇచ్చే కాంగ్రెస్ కావాలా? మోసం చేసిన బాబు, జగన్ కావాలా తేల్చుకోవాలి’’ అని షర్మిల అన్నారు.