అన్వేషించండి

AP News: యువకుల్ని కర్రతో కొడుతున్న డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, అసలేం జరిగింది

Done MLA | డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇద్దరు యువకుల్ని కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఏం జరిగిందో బాధితులు స్వయంగా వివరాలు విల్లడించారు.

డోన్: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ చిన్న ఘటన జరిగినా సరే వెంటనే వీడియోలు, ఫొటోలు అందులో పోస్ట్ చేస్తున్నారు. ఇంటర్నెట్ ప్యాక్ లు ఎలాగూ ఉన్నాయి. దాంతో తమకు అనుకూలమైన విషయాన్ని అయినా, తమకు గిట్టని వారి వీడియోలు అయినా సరే సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతుంటాయి. ఏపీలో ఓ ఎమ్మెల్యేకు సంబంధించిన వీడియో ట్రెండింగ్ అయింది. కర్నూలు జిల్లా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ఇద్దరు యువకులను బెత్తంతో కొడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 
బడుగు బలహీన వర్గాల యువకులను పెత్తం దారుల్లాగా అగ్రవర్ణాల వారు ఎలా అణచివేస్తున్నారు చూడండి అంటూ కొందరు ఆ వీడియోపై విమర్శలు వచ్చాయి. కొందరేమో ఎమ్మెల్యే సూర్య ప్రకాష్ రెడ్డిని ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త ప్రతిపక్ష పార్టీ నేతలకు కనిపించగా, రాజకీయ రంగు పులుముకుంది. ఆ వీడియో పై ప్రస్తుతం అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇది పాత వీడియో అని కొందరు చెబుతంటే, లేదు తాజాగా జరిగిందని మరికొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి యువకుల్ని బెదిరించిన వీడియో మాత్రం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఆ వీడియోలో ఏం ఉందంటే..
డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఒక కుర్చీలో కూర్చొని కనిపించారు. ఇద్దరు యువకులను నేలపైన తన ఎదురుగా కూర్చోబెట్టుకొని చుట్టూ, జనం చూస్తూ ఉండగా ఆ ఇద్దరు యువకులను మందలిస్తూ కనిపించారు. అనంతరం ఒక బెత్తంతో ఆ ఇద్దరు యువకులను రెండుసార్లు కొట్టినట్లు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అసలు ఎమ్మెల్యే సూర్యప్రకాశ్ రెడ్డి ఆ యువకులను ఎందుకు అలా కొడుతున్నారు. అసలు ఏం జరిగిందని జోరుగా చర్చ జరుగుతోంది.

ఆ యువకులు చేసిన తప్పు ఏంటి?
గత నాలుగు నెలల కిందట కోడుమూరు నియోజకవర్గం లోని కొండాపురం గ్రామంలో ఇంటర్మీడియట్ చదివిన ఒక యువకుడు అదే గ్రామానికి చెందిన మరొకరితో కలిసి గ్రామంలోని గొర్రెల మందపై కన్నేశాడు. ఊరి చివర ఉన్న గొర్రెల మందపై వెళ్లి ఆ మందలోని మూడు గొర్రెలను దొంగలించారు. వీరు దొంగతనం చేస్తున్న విషయం గొర్రెల యజమాలకు తెలియడంతో ఆ ఇద్దరు యువకులను పట్టుకున్నారు. ఈ యువకుల పైన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే చిన్న వయసులో ఉన్నారు, అసలే యువకులు కావడంతో ఇబ్బందులు పడతారని గ్రహించిన గ్రామస్తులు న్యాయం చేస్తారని డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. దీంతో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇద్దరు యువకుల్ని మందలించారు. అయితే భవిష్యత్తులో చోరీలు, ఏ తప్పు చేయకుండా గట్టిగా మందలించాలని, భయం చెప్పాలని గ్రామస్తులు ఎమ్మెల్యేని కోరారు. దాంతో ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి ఆ యువకులకు కొంచెం గట్టిగా భయం ఉండేలా కర్రతో రెండు దెబ్బలు కొట్టారు. ఇంకోసారి తప్పు చేయకూడదని, దానివల్ల కేసుల్లో ఇరుక్కుంటారని యువకుల్ని గట్టిగానే మందలించారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. అందుకే ఆ యువకులను బెత్తంతో రెండు దెబ్బలు వేసినట్లు తెలిపారు. 

గ్రామస్తులు ఏం చెబుతున్నారు..
డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి యువకులను దండించే వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయింది. అయితే అధికారం ఉందని ఎమ్మెల్యే ఎవర్నీ కొట్టడం లేదని, గతంలో జరిగిన ఘటన అని బాధితులు వివరణ ఇచ్చారు. పాత వీడియో ఇప్పుడు వైరల్ అవుతోందని స్పష్టం చేశారు. తమ పిల్లలలను భయం ఉడేందుకు  ఏమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి దగ్గరికి వెళ్లినట్లు చెప్పారు. దీనిపై కొందరు కావాలని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తామే పెద్దాయన దగ్గరకు వెళ్లి తమ పిల్లలను భయపెట్టాలని, తప్పులు చేయకుండా మందలించాలని కోరినట్లు వివరించారు. అంతేకానీ ఎవరూ ఎవర్నీ దండించడం లేదని, దౌర్జన్యం చేయడం లేదని స్పష్టం చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget