News
News
X

Niramala Comment On Jagan: మోదీకి జగన్ సొంత బిడ్డలాంటోడు, అనంతపురంలో నిర్మలా సీతారామన్ కామెంట్స్

నాసిన్ అకాడమీ ని వచ్చే సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో పని చేస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తెలపారు.ఇందుకోసం 721కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఆమె తెలిపారు.

FOLLOW US: 

నాసిన్ ఆకాడమీ (నేషనల్ ఆకాడమీ ఆప్ కస్టమ్స్,ఇండైరెక్ట్ టాక్సెస్&నార్కొటిక్స్) పనులకు భూమి పూజ చేశారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద జరిగిన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. 500 ఎకరాల్లో ఏర్పాటు కానున్న నాసిన్ ఆకాడమీ భవనాల సముదాయానికి ఆమె శంకుస్థాపన చేశారు. వచ్చే సంవత్సరం సెప్టెంబర్‌లోపు నాసిన్ ఆకాడమీ భవనాలను అందుబాటులోకి తీసుకురావలని అధికారులను ఆదేశించారు. వచ్చే సంవత్సరం నుంచే ఆకాడమీలో ట్రైనింగ్ సెంటర్ ప్రారంభిస్తామన్నారు. ఈ భవనాల నిర్మాణానికి రూ. 721కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఆమె తెలిపారు.

నార్కొటిక్స్ అధికారల ట్రైనింగ్ సెంటర్ వచ్చే సెప్టెంబర్ నుంచి అందుబాటులోకి రానున్నట్టు నిర్మల పేర్కొన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్రం నుంచి సానుకూలంగా స్పందించాలంటూ చేసిన వినతిపై ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ప్రధానమంత్రి మోదీ సొంత బిడ్డ మాదిరిగా చూసుకొంటున్నారన్నారు. ఇప్పటికే రాష్రం నుంచి ఏ వినతి వచ్చినా సానుకూలంగానే స్పందిస్తున్నట్లు ఆమె రాజేంద్రనాథ్ రెడ్‌కి తెలిపారు.

ఇప్పటికే అత్యల్ప వర్షపాతం నమోదు అవుతున్న అనంతపురం జిల్లాను ఎడారిగా మారకుండా చూస్తామన్నారు నిర్మలా సీతారామన్. మొదటగా ఆమె నాసిన్ ఆకాడమీ భవనాలకు ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరితో కలిసి భూమి పూజ చేశారు. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక ట్రైనింగ్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతంలో మౌలిక వసతులు పెరుగుతాయని, ఈ సంవత్సరంలోనే ఈ ప్రాంతంలో 721కోట్లు ఖర్చు చేయడంతో ఈ ప్రాంతం అభివృద్ది చెందుతున్నారు.

రైతుల సమస్యలపై కూడా నిర్మలా సీతారామన్ స్పందించారు. నాసిన్ ఆకాడమీ కోసం రైతుల నుంచి 500ఎకరాలు సేకరించారని వారికి ఇఫ్పటికే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద నిధులు కూడా పూర్తి స్థాయిలో అందజేశామన్నారు. భూమిపూజ కంటే ముందుగానే ఈ నిధులను వారి అకౌంట్లలోకి జమ చేసినట్లు ఆమె తెలిపారు. వారు మరింత అమౌంట్ కావాలని అడుగుతున్నారని అందుకు నిబంధనలు అంగీకరించవని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

రాష్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, కేంద్రం ఉదారంగా ఆదుకోవాలన్న బుగ్గన వినతికి ఆమె సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే చాలావరకు నిధులిచ్చామని, మరింత సహకారం అందిస్తామన్నారు నిర్మలా సీతారామన్. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ట్రైనింగ్ సెంటర్ ను కరువు జిల్లా అయిన అనంతపురానికి కేటాయించడం ద్వారా కేంద్రానికి ఈ ప్రాంతం అంటే ప్రత్యేకమైన అభిమానమో తెలుసుకోవలన్నారు నిర్మలా సీతారామన్. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే సెప్టెంబర్ నాటికి ఈ ఆకాడమీని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు నిర్మలా సీతారామన్.

Published at : 05 Mar 2022 07:41 PM (IST) Tags: AndhraPradesh India nirmala sitaraman Anantapur Buggana Rajendranath Reddy nasin

సంబంధిత కథనాలు

ఏపీ రాజకీయ వేదికపై ఇంత వరకు చూడని సీన్ ఇవాళ మీరు చూడబోతున్నారు!

ఏపీ రాజకీయ వేదికపై ఇంత వరకు చూడని సీన్ ఇవాళ మీరు చూడబోతున్నారు!

Suicide Cases: బైక్ కొనివ్వలేదని ఒకరు, మంచి జాబ్ లేదని మరో యువకుడు ఆత్మహత్య

Suicide Cases: బైక్ కొనివ్వలేదని ఒకరు, మంచి జాబ్ లేదని మరో యువకుడు ఆత్మహత్య

Independence Day 2022: 34 ఏళ్లు బ్రిటీష్ జెండా ఎగిరిన చోటే 75 ఏళ్లుగా మువ్వన్నెల జెండా సగర్వంగా రెపరెపలాడుతోంది 

Independence Day 2022: 34 ఏళ్లు బ్రిటీష్ జెండా ఎగిరిన చోటే 75 ఏళ్లుగా మువ్వన్నెల జెండా సగర్వంగా రెపరెపలాడుతోంది 

Rain Updates: వాయుగుండం ఎఫెక్ట్, వర్షాలతో తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్ - మరికొన్ని గంటల్లో ఏపీలో అక్కడ భారీ వర్షాలు: IMD

Rain Updates: వాయుగుండం ఎఫెక్ట్, వర్షాలతో తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్ - మరికొన్ని గంటల్లో ఏపీలో అక్కడ భారీ వర్షాలు: IMD

Gorantla Madhav: ఒరిజినల్ వీడియో నాదగ్గరే ఉంది! టీడీపీకి ఆ దమ్ముందా? వాళ్ల మార్ఫింగ్ వీడియోలిస్తా? - గోరంట్ల

Gorantla Madhav: ఒరిజినల్ వీడియో నాదగ్గరే ఉంది! టీడీపీకి ఆ దమ్ముందా? వాళ్ల మార్ఫింగ్ వీడియోలిస్తా? - గోరంట్ల

టాప్ స్టోరీస్

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల

Tummmala Nageswararao :  హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల

Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

Kuppam Gold Mines : కుప్పంలో బంగారు గనులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్, రూ.450 కోట్లకు ఎన్ఎండీసీ టెండర్లు!

Kuppam Gold Mines : కుప్పంలో బంగారు గనులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్, రూ.450 కోట్లకు ఎన్ఎండీసీ టెండర్లు!