
Chandrababu Arrest Live Updates: విజయవాడ కోర్టులో చంద్రబాబు, కొనసాగుతున్న వాదనలు - కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ
నంద్యాలో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. చంద్రబాబు బస చేసిన ఫంక్షన్ హాల్ చుట్టూ పోలీసులు మోహరించారు
LIVE

Background
Chandrababu News: రిమాండ్ రిపోర్టు వాదనలకు అవకాశం కల్పించిన జడ్జి
చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లుత్రా వాదనలు వినిపిస్తూ.. రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలని కోర్టును కోరారు. ఈ మేరకు నోటీసు ఇచ్చారు. 409 సెక్షన్ ఈ కేసులో పెట్టడం సబబు కాదని లుథ్రా వాదించారు. 409 సెక్షన్ పెట్టాలంటే ముందు సరైన సాక్ష్యం చూపాలని లుథ్రా వివరించారు. రిమాండ్ రిపోర్టు తిరస్కరణ వాదనలకు న్యాయమూర్తి అవకాశం కల్పించారు.
Chandrababu Latest News: కోర్టులో వాదన వినిపించిన చంద్రబాబు
విజయవాడ ఏసీబీ కోర్టులో గత మూడు గంటల నుంచి వాదనలు జరుగుతున్నాయి. సీఐడీ రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించి సంస్థ తరపు న్యాయవాది పి.సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లుత్రా వాదనలు వినిపించారు. అనంతరం కోర్టులో స్వయంగా చంద్రబాబు వాదనలు వినిపించారు. తన అరెస్టు అక్రమమని చంద్రబాబు కోర్టుకు చెప్పారు. స్కిల్ డెవలప్ మెండ్ స్కామ్‌తో తనకెలాంటి సంబంధం లేదని చెప్పారు. రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారని చంద్రబాబు పేర్కొన్నారు.
Chandrababu Arrest: ఏసీబీ కోర్టుకు ఏపీ సీఐడీ రిమాండ్ రిపోర్టు
విజయవాడ ఏసీబీ కోర్టుకు ఏపీ సీఐడీ రిమాండ్ రిపోర్టును సమర్పించింది. 2021 ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేకపోయినప్పటికీ, తాజా ఎఫ్ఐఆర్ రిపోర్టులో చంద్రబాబు పేరు చేర్చి రిమాండ్ రిపోర్టును కోర్టుకు ఇచ్చారు.
Chandrababu in Vijayawada Court: విజయవాడ కోర్టులో చంద్రబాబును హాజరుపర్చిన ఏపీ సీఐడీ
విజయవాడ కోర్టులో చంద్రబాబును సీఐడీ అధికారులు హాజరు పరిచారు. చంద్రబాబు తరఫున సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లుత్రా వాదనలు వినిపిస్తున్నారు. సీఐడీ తరపున ఏఏజీ పి.సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ఇరు పక్షాల వాదనల తర్వాత కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుదన్న అంశంపై ఆసక్తి నెలకొంది.
కాన్వాయ్‌ను అడ్డుకోబోయిన కార్యకర్తలు
చంద్రబాబును ఆస్పత్రికి తరలింపు సమయంలో పెద్దఎత్తున కార్యకర్తల నినాదాలు - ఒక దశలో చంద్రబాబు కాన్వాయ్‍ను అడ్డుకున్న టీడీపీ నేతలు - కార్యకర్తలు చేతులు జోడించి నమస్కరిస్తూ వెళ్ళిన చంద్రబాబు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
