అన్వేషించండి

Topudurthi Mahesh Reddy Murder: తోపుదుర్తి మహేష్ రెడ్డిది ఆత్మహత్య కాదు, హత్యే - దర్యాప్తు జరపాలన్న పరిటాల శ్రీరామ్

గత కొన్ని రోజులుగా ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజారెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నాడని, తోపుదుర్తి మహేష్ రెడ్డి మరణం వెనుక చాలా అనుమానాలు ఉన్నాయని పరిటాల శ్రీరామ్ అన్నారు.

Paritala Sriram about Topudurthi Mahesh Reddy | ధర్మవరం: ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామానికి చెందిన తోపుదుర్తి మహేష్ రెడ్డి మరణం వెనుక చాలా అనుమానాలు ఉన్నాయని ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. సోమలదొడ్డి-నాగిరెడ్డిపల్లి మార్గంలో ఉన్న రైల్వే పట్టాలపై తోపుదుర్తి మహేష్ రెడ్డి శవమై  కనిపించడం తీవ్ర సంచలనం రేపింది. విషయం తెలుసుకున్న పరిటాల శ్రీరామ్ అనంతపురం ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ వద్దకు చేరుకొని. మహేష్ రెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మహేష్ రెడ్డి తల్లిదండ్రులను ఓదార్చారు. యువకుడు, ధైర్యవంతుడైన మహేష్ రెడ్డి మరణం చాలా బాధాకరమని ఈ సందర్భంగా శ్రీరామ్ అన్నారు.

ప్రకాష్ రెడ్డి సోదరులు మహేష్‌ రెడ్డిని టార్గెట్ చేశారు

2019 తర్వాత తోపుదుర్తి మహేష్ రెడ్డి తనను కలిశాడని.. అప్పటినుంచి మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆయన సోదరులు అతన్ని టార్గెట్ చేశారన్నారు. వారి భూములు విషయంలో లేని సమస్యలు సృష్టించి ఇబ్బందులు పెట్టారన్నారు. అక్రమంగా కేసులు పెట్టి చాలాసార్లు కొట్టారన్నారు. ఆ క్రమంలో తన పేరు చెప్పాలని ఎన్ని సార్లు ఒత్తిడి తెచ్చినా మహేష్ రెడ్డి ధైర్యంగా నిలబడ్డారన్నారు. గత కొన్ని రోజులుగా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజారెడ్డి మహేష్ రెడ్డితో అతని తండ్రికి ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడన్నారు. ఇందుకు ఫేస్ బుక్ లో ఉన్న కొన్ని పోస్టులే సాక్ష్యం అన్నారు. ఈ క్రమంలోనే అతను రైలు పట్టాలపై శవమై కనిపించడం చాలా అనుమానాలకు తావిస్తోందన్నారు. అయితే దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించి పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

Topudurthi Mahesh Reddy Murder: తోపుదుర్తి మహేష్ రెడ్డిది ఆత్మహత్య కాదు, హత్యే - దర్యాప్తు జరపాలన్న పరిటాల శ్రీరామ్

విచారణ చేయాలని పరిటాల శ్రీరామ్ విజ్ఞప్తి 

మహేష్ రెడ్డి మరణానికి వేరే కారణాలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారన్నారు. కానీ పోలీసులు దీనిపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలని పరిటాల శ్రీరామ్ విజ్ఞప్తి చేశారు. మహేష్ రెడ్డి మరణంతో తోపుదుర్తి గ్రామం తో పాటు నియోజకవర్గంలో ప్రతి ఒక్కర్నీ  కలచివేసిందన్నారు. ప్రకాష్ రెడ్డి సోదరులు తమ సొంత గ్రామానికి చెందిన యువకునిపై ఇలా కక్ష గట్టడం దుర్మార్గమన్నారు. మహేష్ రెడ్డికి కూడా వారి పిల్లలకు ఉన్న వయసు ఉంటుందని.. వారి కళ్ల ముందే పుట్టి పెరిగాడని.. అలాంటి వ్యక్తి విషయంలో కక్ష కట్టి  వేధించడం సరైనది కాదన్నారు. ఈ విషయంలో ఎస్పీని కలుస్తామని అవసరమైతే.. ఉన్నత స్థాయిలో ఫిర్యాదు కూడా చేస్తామని శ్రీరామ్ స్పష్టం చేశారు.

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram: పిఠాపురం మల్లంలో దళితుల సాంఘిక బహిష్కరణ దేని కోసం? ఇప్పుడు గ్రామంలో ఏం జరుగుతోంది?
పిఠాపురం మల్లంలో దళితుల సాంఘిక బహిష్కరణ దేని కోసం? ఇప్పుడు గ్రామంలో ఏం జరుగుతోంది?
AP SSC Results 2025: జిల్లాలవారీగా ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్, అమ్మాయిలే టాప్.. 1680 స్కూళ్లలో వంద శాతం పాస్.. పూర్తి వివరాలు
జిల్లాలవారీగా ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్, అమ్మాయిలే టాప్.. 1680 స్కూళ్లలో వంద శాతం పాస్.. పూర్తి వివరాలు
SRH vs MI: నేడు సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై మ్యాచ్.. ఉగ్రదాడితో బీసీసీఐ కీలక నిర్ణయం
నేడు సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై మ్యాచ్.. ఉగ్రదాడితో బీసీసీఐ కీలక నిర్ణయం
Pahalgam Attack Terrorists Sketch: పహల్గాంలో కాల్పులు జరిపిన ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల
పహల్గాంలో కాల్పులు జరిపిన ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SRH vs MI Match Preview IPL 2025 | సన్ రైజర్స్  హైదరాబాద్ కోమాలో నుంచి మేల్కొంటుందా.?Axar Patel Batting IPL 2025 | కీలక సమయాల్లో ఆదుకుంటున్న కెప్టెన్ ఆల్ రౌండర్KL Rahul vs Rishabh Pant | సంజీవ్ Goenka అనుకున్నది ఒకటి..అయినది ఒకటిKL Rahul Ignored LSG Owner Goenka | రాహుల్ కి ఇంకా కోపం లేదు..తిట్టారనే కసి మీదే ఉన్నట్లున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram: పిఠాపురం మల్లంలో దళితుల సాంఘిక బహిష్కరణ దేని కోసం? ఇప్పుడు గ్రామంలో ఏం జరుగుతోంది?
పిఠాపురం మల్లంలో దళితుల సాంఘిక బహిష్కరణ దేని కోసం? ఇప్పుడు గ్రామంలో ఏం జరుగుతోంది?
AP SSC Results 2025: జిల్లాలవారీగా ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్, అమ్మాయిలే టాప్.. 1680 స్కూళ్లలో వంద శాతం పాస్.. పూర్తి వివరాలు
జిల్లాలవారీగా ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్, అమ్మాయిలే టాప్.. 1680 స్కూళ్లలో వంద శాతం పాస్.. పూర్తి వివరాలు
SRH vs MI: నేడు సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై మ్యాచ్.. ఉగ్రదాడితో బీసీసీఐ కీలక నిర్ణయం
నేడు సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై మ్యాచ్.. ఉగ్రదాడితో బీసీసీఐ కీలక నిర్ణయం
Pahalgam Attack Terrorists Sketch: పహల్గాంలో కాల్పులు జరిపిన ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల
పహల్గాంలో కాల్పులు జరిపిన ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల
Pahalgam Baisaran Valley: బైసరన్ లోయ మినీ స్విట్జర్లాండ్ -  వాహనాలు కూడా వెళ్లవు - అందుకే టెర్రరిస్టుల ప్లాన్ ?
బైసరన్ లోయ మినీ స్విట్జర్లాండ్ - వాహనాలు కూడా వెళ్లవు - అందుకే టెర్రరిస్టుల ప్లాన్ ?
Saeed Hussain Shah killed: హిందువుల కోసం ప్రాణం ఇచ్చిన ముస్లిం -  పెహల్గాం దాడి ఘటనలో మరో కోణం
హిందువుల కోసం ప్రాణం ఇచ్చిన ముస్లిం - పెహల్గాం దాడి ఘటనలో మరో కోణం
Karshmir Terror Attack: ఉగ్రవాదుల దాడిలో పెద్దల్ని కోల్పోయిన రెండు తెలుగు కుటుంబాలు - వీరి కన్నీళ్లకు సమాధానం ఎలా?
ఉగ్రవాదుల దాడిలో పెద్దల్ని కోల్పోయిన రెండు తెలుగు కుటుంబాలు - వీరి కన్నీళ్లకు సమాధానం ఎలా?
Pahalgam Terror Attack Viral Photo: ఆ ఫోటో మనల్ని ఎప్పటికీ వెన్నాడుతూనే ఉంటుంది… పహల్‌గామ్ దాడిలో చనిపోయిన  వ్యక్తి ఫోటో వైరల్
ఆ ఫోటో మనల్ని ఎప్పటికీ వెన్నాడుతూనే ఉంటుంది… పహల్‌గామ్ దాడిలో చనిపోయిన  వ్యక్తి ఫోటో వైరల్
Embed widget