అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Srisailam Mallanna Temple: నేటి నుంచి శ్రీశైలం మల్లన్న సర్వ దర్శనం నిలిపివేత, ఎప్పటి వరకంటే?

Srisailam Mallanna Temple: శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో నేటి నుండి ఈనెల 23వ తేదీ వరకు సర్వ దర్శనాన్ని నిలిపి వేశారు. అలాగే గర్భాలయ, సామూహిక అభిషేకాలు నిలిపి వేస్తున్నట్లు వివరించారు. 

Srisailam Mallanna Temple: శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువ అయింది. ఈ క్రమంలోనే నేటి నుంచి ఈనెల 23వ తేదీ వరకు శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనాన్ని నిలిపి వేశారు. కార్తీక మాసం భక్తుల రద్దీ దృష్ట్యా స్వామి వారి స్పర్శదర్శనాన్ని నిలిపి వేసినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తుల అందరికి సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఆర్జిత సేవ, స్పర్శ దర్శనాలు నిలివేస్తున్నట్లు వివరించింది. ముందస్తుగా ఆన్ లైన్ లో టికెట్ తీసుకున్న భక్తులకు రేపు స్పర్శ దర్శనం, గర్భాలయ అభిషేకాలు నిర్వహించబోతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటికే గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు ఆలయ అధికారులు నిలిపివేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కార్తీకమాసం ముగిసే వరకు భక్తులందరికి స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో లవన్న తెలిపారు. 

గురువారం ఉదయం నుంచి అదే రోజు రాత్రి 9 గంటల వరకు భక్తులకు స్పర్శ దర్శనం కల్పించారు. స్వామి అమ్మవారి కళ్యాణం, అమ్మవారికి కుంకుమార్చన, రుద్రహోమం, చండీహోమం యధావిధిగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. శని, ఆది, సోమ వారాల్లో స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించనున్నట్లు ఆలయ అర్చకులు వివరించారు. 

కార్తీక మాసం మూడో సోమవారం నుంచి పెరిగిన భక్తుల రద్దీ..

కార్తీక మాసం మూడో సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు అన్నీ భక్తులతో నిండిపోయాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న దర్శనానికి భారీగా భక్తులు తరలి వచ్చారు. తెల్లవారుజాము నుంచే పాతాళ గంగలో స్నానాలు చేసి.. స్వామి అమ్మవార్ల దర్శనాలు చేసుకుంటున్నారు. భక్తులు ఎక్కువగా ఉండడంతో క్యూలైన్లన్నీ రద్దీగా ఉన్నాయి. స్వామి వారి ఉచిత దర్శనానికి దాదాపు 5 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. అయితే కార్తీక మాసం భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని స్వామి వారి స్పర్శ దర్శనాలను రద్దు చేశారు. గర్భాలయం 5 వేల రూపాయల అభిషేకాలను కూడా రద్దు చేశారు. 10500 రూపాయల సామూహిక అభిషేకం చేసుకున్న వారికి కూడా అలంకార దర్శనం మాత్రమే కల్పించారు. అలాగే వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేశారు.

కేవలం అమ్మవారి ఆలయంలో నిర్వహించే కుంకుమ అర్చనలు, ఆశీర్వచన మండపంలో మాత్రమే నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. అయితే భక్తుల రద్దీతో శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కార్లు, ఇతర వాహనాలన్నీ రెండు గంటలపాటు రోడ్లపై నిలిచిపోయాయి. శ్రీశైలం నుంచి ముఖద్వారం వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర రోడ్లపై కార్లు పోగా.. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీశైలం టోల్ గెట్ నుంచి సాక్షి గణపతి, ముఖద్వారం వరకు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయ కల్గుతోంది. ట్రాఫిక్ అదుపు చేసేందుకు శ్రీశైలం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే రోడ్లపై వాహనాలు అడ్డదిడ్డంగా నిలిచిపోపోవడంతో పోలీసులు కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Embed widget