Srisailam Darshan: శ్రీశైలం వెళ్లే ప్లాన్ ఉంటే ముందు ఇవి తెలుసుకోండి!
Srisailam Darshan: శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆళయంలో భక్తుల ర్దదీ పెరగడంతో ఆర్జిత సేవలో పలు మార్పులు చేశారు ఈరోజు నుంచి ఈనెల 23వ తేదీ వరకు గర్భాలయ, సామూహిక అభిషేకాలు నిలుపివేస్తున్నట్లు వివరించారు.
Srisailam Darshan: శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువ అయింది. ఈ క్రమంలోనే ఆలయ ఆర్జిత సేవల్లో పలు మార్పులు చేశారు. నేటి నుండి ఈనెల 23వ తేదీ వరకు గర్భాలయా, సామూహిక అభిషేకాలు నిలిపి వేస్తున్నట్లు వివరించారు. ఈరోజు ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులకు స్పర్శ దర్శనం కల్పిస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. స్వామి అమ్మవారి కళ్యాణం, అమ్మవారికి కుంకుమార్చన, రుద్రహోమం, చండీహోమం యధావిధిగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. శని, ఆది, సోమ వారాల్లో స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించనున్నట్లు ఆలయ అర్చకులు వివరించారు.
కార్తీక మాసం మూడో సోమవారం నుంచి పెరిగిన భక్తుల రద్దీ..
కార్తీక మాసం మూడో సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు అన్నీ భక్తులతో నిండిపోయాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న దర్శనానికి భారీగా భక్తులు తరలి వచ్చారు. తెల్లవారుజాము నుంచే పాతాళ గంగలో స్నానాలు చేసి.. స్వామి అమ్మవార్ల దర్శనాలు చేసుకుంటున్నారు. భక్తులు ఎక్కువగా ఉండడంతో క్యూలైన్లన్నీ రద్దీగా ఉన్నాయి. స్వామి వారి ఉచిత దర్శనానికి దాదాపు 5 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. అయితే కార్తీక మాసం భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని స్వామి వారి స్పర్శ దర్శనాలను రద్దు చేశారు. గర్భాలయం 5 వేల రూపాయల అభిషేకాలను కూడా రద్దు చేశారు. 10500 రూపాయల సామూహిక అభిషేకం చేసుకున్న వారికి కూడా అలంకార దర్శనం మాత్రమే కల్పించారు. అలాగే వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేశారు.
కేవలం అమ్మవారి ఆలయంలో నిర్వహించే కుంకుమ అర్చనలు, ఆశీర్వచన మండపంలో మాత్రమే నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. అయితే భక్తుల రద్దీతో శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కార్లు, ఇతర వాహనాలన్నీ రెండు గంటలపాటు రోడ్లపై నిలిచిపోయాయి. శ్రీశైలం నుంచి ముఖద్వారం వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర రోడ్లపై కార్లు పోగా.. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీశైలం టోల్ గెట్ నుంచి సాక్షి గణపతి, ముఖద్వారం వరకు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయ కల్గుతోంది. ట్రాఫిక్ అదుపు చేసేందుకు శ్రీశైలం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే రోడ్లపై వాహనాలు అడ్డదిడ్డంగా నిలిచిపోపోవడంతో పోలీసులు కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇటీవలే ఆలయం వంటగదిలో పేలిన బాయిలర్
శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం వంటగదిలో ఈరోజు ఉదయం బాయిలర్ పేలింది. దేవస్థానంలోని అన్నపూర్ణ భవన్ లో ఒక్కసారిగా బాయిలర్ పేలడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. పెద్దగా శబ్దం రావడంతో అక్కడున్న వాళ్లంతా బయటకు పరుగులు పెట్టారు. అయితే ఆ మల్లికార్జున స్వామి వారి దయ వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. చాలా సేపటి తర్వాత సిబ్బంది లోపలికి వెళ్లి చూడగా.. టిఫిన్ తయారీకి ఉపయోగించే వంట గదిలోని స్టీమ్ వాటర్ బాయిలర్ పేలింది. దీని వల్ల పెద్ద శబ్దం వచ్చిందని గుర్తించారు. నిత్య అన్నదానం బయటవైపు ఈ ఘటన జరగడంతో ప్రమాదం తప్పింది. బాయిలర్ పేలుడుకు కారణలేంటని పరిశీలిస్తున్నట్లు అధికారులు చెప్పారు.