By: ABP Desam | Updated at : 08 Feb 2022 07:56 AM (IST)
ఛలో కలెక్టరేట్‌కు విద్యార్థి సంఘాల పిలుపు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరుద్యోగ యువకులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడానికి నిరసగా కర్నూలు జిల్లా పత్తికొండ నాలుగు స్తంభాల కూడలిలో కు నిరసనగా ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, తెలుగునాడు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉరితాళ్లు వేసుకొని నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు ఉద్యమబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు.
ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, కొద్ది నెలలుగా నిరుద్యోగులు చేస్తున్న డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు తరహాలో ఉద్యమబాట పట్టడం ద్వారా డిమాండ్లను సాధించుకోవాలని నిరుద్యోగ సంఘ నాయకులు కారుమంచి, మునినాయుడు అన్నారు. ఈమేరకు తమ కార్యాచరణను ప్రకటించారు. ఈనెల 10 తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద ఆందోళనకు పిలుపునిచ్చారు. 'ఛలో కలెక్టరేట్' పేరుతో చేపట్టనున్న ఆందోళనకు విద్యార్థి, యువజన, నిరుద్యోగ సంఘాలు మద్ధతు ఇవ్వాలని కోరారు.
ఒత్తిడి పెంచడమే లక్ష్యం..
నిరుద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన జాబ్ క్యాలెండర్ విడుదలతోపాటు పలు సమస్యలను పరిష్కరించాలని, ఎప్పటి నుంచో నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. అయితే నిరుద్యోగుల డిమాండ్లను పాలకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల మాదిరిగా పోరాటం చేస్తే ఫలితం ఉంటుందని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. ఇందులో భాగంగా తొలుత 'ఛలో కలెక్టరేట్'కు సిద్ధమవుతున్నాయి. అప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే.. ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామన్నారు.
ఇవీ డిమాండ్లు...
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం వల్ల నిరుద్యోగులకు తీవ్రనష్టం వాటిల్లుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలు వదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్లకు తగ్గించాలి. డీఎస్సీ, ఎస్‌ఐ, కానిస్టేబుల్, గ్రూప్-1, 2 పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలి. ఏపీపీఎస్సీ పరీక్షలకు ప్రిలిమినరీ, నెగెటివ్ మార్కులు రద్దు చేయాలి. ఇప్పటికే ప్రకటించిన పోస్టులకు పరీక్షల నిర్వహణ తేదీలను వెంటనే ప్రకటించాలి. ఇచ్చిన హామీలను సీఎం జగన్ అమలు చేయాలని ముని నాయుడు, టీఎన్‌ఎస్‌ఎఫ్ ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు
ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి.. సీఎం అయిన తరువాత విస్మరించారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే హామీ చేయాలన్నారు. ఇందుకోసం పోరాటానికి సిద్ధమవుతున్నామన్నారు. ఈనెల 10న 'ఛలో కలెక్టరేట్'కు పిలుపునిచ్చామని తెలిపారు. కార్యక్రమంలో ప్రతి ఒక్క నిరుద్యోగి పాల్గొని, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి అన్నారు.
నాడు ఇచ్చిన హామీని ఎలా మర్చిపోయారు..?
సీఎం జగన్ ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు వివిధ ప్రభుత్వ శాఖల్లో 2.35 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, అధికారంలోకి వస్తే ఆ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నది. ఇంతవరకు ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయలేదు. పైగా, నిరుద్యోగులకు అన్యాయం చేసేలా ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచారు. ఇది చాలా దారుణం. మాట తప్పం మడమ తిప్పం అని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి మాట తప్పారు అన్నారు. ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామన్నారు.
మెగస్టార్ బర్త్‌డే రోజున జనసేన కీలక భేటీ- కేడర్‌కు ఏం చెప్పబోతున్నారు?
AP 10th Supply Students: టెన్త్ సప్లిమెంటరీ విద్యార్థులకు గుడ్ న్యూస్, వారికి ఛాన్స్ ఇవ్వాలని మంత్రి మేరుగు నాగార్జున నిర్ణయం
Weather Updates: మరో అల్పపీడనం ముప్పు, ఏపీలో ఎఫెక్ట్ ఇలా - తెలంగాణలో 2 రోజులు IMD ఎల్లో అలర్ట్
Weather Updates: ఏపీలో మరో 24 గంటలు వర్షాలు - తెలంగాణలో వాతావరణం ఇలా
Onion Crop: తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుందంటారు, కానీ అది కూడా వారిని ఆగం చేసింది!
Breaking News Live Telugu Updates: టీఆర్ఎస్ లీడర్ హత్య కేసులో నిందితుల అరెస్టు
రామానాయుడు ఫ్యామిలీకి హైకోర్టు గుడ్‌న్యూస్, తెలంగాణ సర్కార్‌కు షాక్ - కీలక తీర్పు
Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!
KCR News: 21న కరీంనగర్‌కు సీఎం కేసీఆర్, ఆసక్తికరంగా ఆ ఏర్పాట్లు - గతంలో ఎప్పుడూ లేనట్లుగా