అన్వేషించండి

Jagan Yemmiganur Meeting : చంద్రబాబు పాలనంతా కుంభకోణాలమయం- ఎమ్మిగనూరులో విరుచుకుపడ్డ జగన్

Jagan Yemmiganur Meeting :014 ఎన్నికలకు ముందు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారని గుర్తు చేశారు జగన్. గెలిచిన తర్వాత మేనిఫెస్టోను చెత్త బుట్టలో పడేశారన్నారు.

చంద్రబాబు(Chandra Babu) పాలన మొత్తం అవినీతి కుంభకోణాల మయం అని విరుచుకుపడ్డారు సీఎం(Andhra Pradesh CM) జగన్(Jagan Mohan Reddty). కర్నూలు(Kurnool) జిల్లా ఎమ్మిగనూరు(Yemiganur)లో జగనన్న చేదోడు(Jagananna Chethodu) నిధుల విడుదల కార్యక్రమంలో జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్‌(Skill Development Case) నుంచి ఫైబర్ గ్రిడ్(Fiber Grid Case), అమరావతి(Amaravathi ), విద్యుత్ కొనుగోలు అన్నింటిలో కూడా అడ్డగోలుగా దోచేశారని ఆరోపించారు.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కుప్పం నియోజకవర్గానికి కూడా న్యాయం చేయలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు. వాళ్లు కూడా చంద్రబాబు మావాడు అని చెప్పుకోవడం లేదని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. గెలిచిన తర్వాత మేనిఫెస్టోను చెత్త బుట్టలో పడేశారన్నారు. రైతులకు రుణమాఫీ చేయలేదని గుర్తు చేశారు. వాళ్లకు రావాల్సిన సున్నా వడ్డి వెసులుబాటును కూడా లేకుండా చేశారన్నారు. పొదుపు సంఘాలను డీఫాల్టర్‌లను చేశారని విమర్శించారు. నేడు వారిని లక్షాధికారులు చేస్తున్నామని చెప్పారు జగన్. బటన్‌ నొక్కి 2 లక్షల కోట్లకుపైగా నగుదను వారి ఖాతాల్లో వేస్తున్నామని వివరించారు. 31 లక్షల ఇళ్ల పట్టాలను మహిళలకు ఇచ్చామని చెప్పారు. 

చంద్రబాబు హయాంలో రాష్ట్రం ఎందుకు అభివృద్ధి చెందలేదని ప్రశ్నించారు జగన్. అప్పుడూ ఇప్పుడు ఒకటే బడ్జెట్‌ అని కానీ మారింది ముఖ్యమంత్రేనన్నారు. అప్పట్లో గజదొంగల ముఠా రాష్ట్రాన్ని దోచుకుందని ఆరోపించారు. ఇప్పుడు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నగదు పడుతోందని చెప్పారు. జాబు రావాలంటే బాబు రావాలంటూ చెప్పి ఓట్లు వేయించుకొని నిరుద్యోగులను మోసం చేశారన్నారు. తమ హయంలో భారీగా ఉద్యోగాలను ఎస్సీ, ఎస్టీ బీసీలకు కల్పించామని తెలిపారు. 

పది కాదు, వంద కాదు, లక్ష కాదు, కోటి కాదు.. ఏకంగా రూ.2.38 లక్షల కోట్లు నేరుగా   బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పోతోందని జగన్ తెలిపారు.   పొదుపు సంఘాలను నా అక్కచెల్లెమ్మలను చంద్రబాబు మోసం చేశారన్నారు.  అప్పటి దాకా సున్నా వడ్డీ పథకం పథకం కూడా పూర్తిగా ఎత్తేశాడని..  అక్కచెల్లెమ్మలను ఇబ్బందుల పాలు చేస్తే వారికి తోడుగా ఒక మంచి అన్నయ్య, మంచి తమ్ముడు మళ్లీ మీ బిడ్డ రూపంలో ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చాడని తెలిపారు.  చంద్రబాబు వల్ల నష్టపోయిన పొదపు సంఘాలకు వైయస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, అమ్మ ఒడి ద్వారా ఆదుకోగలిగాడు. 
 అక్కచెల్లెమ్మలంతా ఏ గ్రేడ్, బీ గ్రేడ్ గా చెలామణీ అవుతున్నాయిమన్నారు. 

 బ్యాంకు మేనేజర్లు అక్కచెల్లెమ్మలకు సెల్యూట్ కొట్టి లోన్లు ఇచ్చే కార్యక్రమాలు మీ బిడ్డ హయాంలో జరుగుతోందని జగన్ తెలిపారు.  కనీసం పేద వాడికి ఇంటి స్థలం కూడా ఒక్క సెంటైనా ఇచ్చిన పాపాన పోలేదు.  మళ్లీ అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ 31 లక్షల ఇంటి పట్టాలు నేరుగా నా అక్కచెల్లెమ్మలకు ఇవ్వడం జరిగిందన్నారు.  10 వేలు కాదు, 20 వేలు కాదు, లక్ష కాదు.. ఏకంగా 31 లక్షల ఇంటి పట్టాలు ఇచ్చామన్నారు.  కనీసం ఇంట్లో ముగ్గురు ఉన్నారనుకుంటే కోటి మంది ప్రజలకు ఇంటి పట్టాలు అందాయన్నారు.  అందులో 22 లక్షల ఇళ్లు నిర్మాణంలో వేగంగా కడుతున్నామని సీఎం తెలిపారు. 

 జాబు రావాలాంటే బాబు రావాలి అన్న మాటలు అప్పట్లో మాట్లాడారు.   జాబు ఇవ్వకపోతే ఇంటింటికీ రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఊదరగొట్టారు. కానీ ఏమీ ఇవ్వలేదన్నారు.  స్వాతంత్ర్యం వచ్చాక మొత్తం 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలంటే నాలుగేళ్ల పాలనలో 2.07 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు.  గతంలో ఏ పౌర సేవ కావాలన్నా పెన్షన్, రేషన్, ఏ పని కావాలన్నా జన్మభూమి కమిటీల చుట్టూ లంచాలు ఇచ్చుకుంటూ చెప్పులరిగేలా తిరుగుతూ అవస్థలు పడుతున్న రోజులు గుర్తుకొస్తున్నాయా? అని ప్రజల్ని సీఎం ప ్రశ్నించారు.  

- అప్పట్లో ఆరోగ్యశ్రీని ఎలా వదిలించుకోవాలని పరిపాలన సాగిందని.. ఇప్పుడు  1600 కొత్త వాహనాలు 104, 108 వాహనాలను కొనుగోలు చేసి ప్రతి పేదవాడికీ తోడుగా ఉండేట్లుగా ఏర్పాటు చేశామన్నారు.  అప్పట్లో కేవలం 1000 రోగాలకు పరిమితమైన ఆరోగ్యశ్రీని 3,300 రోగాలకు విస్తరించామన్నారు.  నెలకు రూ.5 వేల చొప్పున రెస్ట్ కోసం ఆరోగ్య ఆసరా కింద ఇస్తున్నామన్నారు.  విలేజ్ క్లినిక్లు కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కనిపిస్తోంది.   జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో జల్లెడ పడుతూ మందులు, టెస్టులు,  చికిత్సలు ఉచితంగా చేయడం కోసం చేస్తున్న పాలన ఈ ప్రభుత్వంలోనే జరుగుతోందన్నారు.  

బైజూస్ కంటెంట్ తీసుకొచ్చాం. ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ ఈ తీసుకొచ్చాం. ఐబీ సిలబస్ దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు.   చంద్రబాబు రాజధాని నగరం అని పేరు పెట్టుకున్నాడో, అక్కడ ఇళ్ల స్థలాలను ఇస్తే అడ్డు తగులుతూ కోర్టులకు వెళ్లి డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ వస్తుందని నిస్సిగ్గుగా పేద వాడికి ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని కోర్టులకు వెళ్లారని ఆరోపించారు.  పేద వాడు ఒకవైపు, పెత్తందారు మరొకవైపున ఉండి యుద్ధం జరగబోతోందన్నారు.  మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే అండగా ఉండాలని కోరారు.  

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: సాటి మహిళా విలేకరి ఇబ్బంది పడుతుంటే మీరేం చేస్తున్నారు? - జర్నలిస్టులకు డిప్యూటీ సీఎం పవన్ క్లాస్
సాటి మహిళా విలేకరి ఇబ్బంది పడుతుంటే మీరేం చేస్తున్నారు? - జర్నలిస్టులకు డిప్యూటీ సీఎం పవన్ క్లాస్
KTR: 'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
Maruti Suzuki Alto K10: ఆల్టోపై అదిరిపోయే ఆఫర్ - రూ.1.2 లక్షలు కట్టేసి!
ఆల్టోపై అదిరిపోయే ఆఫర్ - రూ.1.2 లక్షలు కట్టేసి!
WhatsApp Alerts: వాట్సాప్‌లో వీటిని షేర్ చేస్తే ఇక జైలుకే - రూల్స్‌ను టైట్ చేసిన గవర్నమెంట్!
వాట్సాప్‌లో వీటిని షేర్ చేస్తే ఇక జైలుకే - రూల్స్‌ను టైట్ చేసిన గవర్నమెంట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బన్నీకి బాలయ్య సర్‌ప్రైజ్, అస్సలు ఊహించలేదట!అమ్మో! ఇళ్ల పక్కనే పెద్దపులి! గజగజ వణికిపోతున్న జనంనడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: సాటి మహిళా విలేకరి ఇబ్బంది పడుతుంటే మీరేం చేస్తున్నారు? - జర్నలిస్టులకు డిప్యూటీ సీఎం పవన్ క్లాస్
సాటి మహిళా విలేకరి ఇబ్బంది పడుతుంటే మీరేం చేస్తున్నారు? - జర్నలిస్టులకు డిప్యూటీ సీఎం పవన్ క్లాస్
KTR: 'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
Maruti Suzuki Alto K10: ఆల్టోపై అదిరిపోయే ఆఫర్ - రూ.1.2 లక్షలు కట్టేసి!
ఆల్టోపై అదిరిపోయే ఆఫర్ - రూ.1.2 లక్షలు కట్టేసి!
WhatsApp Alerts: వాట్సాప్‌లో వీటిని షేర్ చేస్తే ఇక జైలుకే - రూల్స్‌ను టైట్ చేసిన గవర్నమెంట్!
వాట్సాప్‌లో వీటిని షేర్ చేస్తే ఇక జైలుకే - రూల్స్‌ను టైట్ చేసిన గవర్నమెంట్!
Pawan Kalyan: ఐఏఎస్, ఐపీఎస్‌లకు వార్నింగ్ ఇస్తే సుమోటో కేసులు - డిప్యూటీ సీఎం పవన్ స్ట్రాంగ్ వార్నింగ్, షర్మిలకు భద్రతపైనా కీలక వ్యాఖ్యలు
ఐఏఎస్, ఐపీఎస్‌లకు వార్నింగ్ ఇస్తే సుమోటో కేసులు - డిప్యూటీ సీఎం పవన్ స్ట్రాంగ్ వార్నింగ్, షర్మిలకు భద్రతపైనా కీలక వ్యాఖ్యలు
Revanth Reddy: ఆరు దశాబ్దాల తరువాత పాలమూరు బిడ్డ సీఎం అయ్యాడు - కురుమూర్తి సభలో రేవంత్ రెడ్డి
ఆరు దశాబ్దాల తరువాత పాలమూరు బిడ్డ సీఎం అయ్యాడు - కురుమూర్తి సభలో రేవంత్ రెడ్డి
NBK Allu Arjun: ‘పుష్ప 3’లో బాలయ్య, ‘అఖండ 3’లో బన్నీ - అన్‌స్టాపబుల్‌కు అల్లు అర్జున్ - ప్రోమో వచ్చేసింది!
‘పుష్ప 3’లో బాలయ్య, ‘అఖండ 3’లో బన్నీ - అన్‌స్టాపబుల్‌కు అల్లు అర్జున్ - ప్రోమో వచ్చేసింది!
Hyderabad News: ప్రేమ వివాహానికి అడ్డొస్తున్నాడని ప్రియురాలి తండ్రిపై కాల్పులు - హైదరాబాద్‌లో ఘటన
ప్రేమ వివాహానికి అడ్డొస్తున్నాడని ప్రియురాలి తండ్రిపై కాల్పులు - హైదరాబాద్‌లో ఘటన
Embed widget