Hindupur Municipal Meeting: వేడెక్కిన హిందూపురం మున్సిపల్ రాజకీయం, టీడీపీ కంచుకోటలో ఉత్కంఠ రేపుతోన్న వైస్ ఛైర్మన్ పదవి
Nandamuri Balakrishna | బాలకృష్ణ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టిన నియోజకవర్గం, టీడీపీ కంచుకోట అయిన హిందూపురం మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది.

హిందూపురం : కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం రాష్ట్రంలోని మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టిని సాధించింది. గత ప్రభుత్వంలో మున్సిపాలిటీలు అన్నీ కూడా వైఎస్ఆర్సిపి ఖాతాలో ఉండటం, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. ప్రస్తుతం శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లోని హిందూపురం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ జబీవుల్లా పదవీకాలం పూర్తి కావడంతో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు.
నేడు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం :
నందమూరి బాలకృష్ణ ప్రాతినిత్యం వహిస్తున్న హిందూపురం మున్సిపాలిటీలో గతంలో చైర్మన్ పదవిని వైస్ చైర్మన్ పదవిని వైఎస్ఆర్సిపి కైవసం చేసుకుంది కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం హిందూపురం మున్సిపాలిటీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకున్నారు. ప్రస్తుతం వైస్ చైర్మన్ జబీవుల్లా పదవి కాలం ముగియడంతో టిడిపికి ఉన్న 21 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు.
హిందూపురం మున్సిపాలిటీలో మొత్తం ఎంపీ ఎమ్మెల్యేలతో కలుపుకొని 40 ఓట్లు ఉండగా టిడిపికి 21 వైఎస్ఆర్ సీపీకి 17 ఎంపీ ఒకటి ఎమ్మెల్యే ఒక ఓటు ఉండగా వైస్ చైర్మన్ పదవి దక్కాలంటే 27 ఓట్ల మెజార్టీ కావాలి. ఇందులో టిడిపి కౌన్సిలర్లు 21 మంది ఎంపీ ఎమ్మెల్యేలు కలుపుకొని 23 ఓట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో ఈరోజు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌన్సిల్ సమావేశానికి వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు రాకపోవచ్చని సమాచారం. ఇప్పటికే వైఎస్ఆర్సిపి కి ఉన్న 17 మంది కౌన్సిలర్లను వైసిపి నాయకత్వం క్యాంపుకు తరలించినట్లు తెలుస్తోంది.
వైస్ చైర్మన్ పీఠం మాదే అంటున్న టిడిపి :
హిందూపురం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పదవి కాలం పూర్తి అవటంతో వైస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు టిడిపి పౌలు కలుగుతుంది సంఖ్యాబలం లేకపోయినప్పటికీ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకుంటామని టిడిపి ధీమా వ్యక్తం చేయడంతో వైసిపి నాయకులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే కౌన్సిల్ సమావేశానికి హాజరవ్వకుండా వైసిపి కౌన్సిలర్ను క్యాంపునకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీకి 21 మంది కౌన్సిలర్లు వైయస్ఆర్సీపీకి 17 మంది కౌన్సిలర్లు ఎంపీ ఎమ్మెల్యే ఓట్లు కలుపుకుంటే టీడీపీకి 23 ఓట్ల సంఖ్య బలం అవుతుంది. వైస్ చైర్మన్ పదవి చేపట్టాలంటే 27 ఓట్లు మెజార్టీ రావాలి టిడిపి పార్టీకి నాలుగు ఓట్లు తక్కువ ఉండటంతో వైసిపి క్యాంపు రాజకీయాన్ని మొదలుపెట్టింది. చూడాలి మరి చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్నట్లే వైస్ చైర్మన్ పీఠాన్ని కూడా బాలకృష్ణ దక్కించుకుంటారో లేదో నేడు తేలనుంది.





















