News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

చంద్రబాబు విదేశాలకు పారిపోతారేమో- అందుకే అరెస్టు చేయడానికి వచ్చాం- టీడీపీ నేతలతో పోలీసుల కామెంట్‌

మొదట చంద్రబాబును అరెస్టు చేయడానికి వచ్చామని మొదట చెప్పినట్టు టీడీపీ లీడర్లు చెబుతున్నారు. తర్వాత చంద్రబాబు విదేశాలకు పారిపోతారనే అనుమానం ఉందని అందుకే వచ్చామని తర్వాత చెప్పారట.

FOLLOW US: 
Share:

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టు చేసేందుకు పోలీసులు చేసిన ప్రయతం ఉద్రిక్తతకు దారి తీసింది. ఆయన బస చేసిన ఉన్న బస్‌తోపాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాలను పోలీసులు రౌండప్ చేశారు. దీంతో అప్పటి వరకు కూల్‌గా అక్కడ పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. 

నంద్యాలకు చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి పోలీసులను రప్పించారని టాక్ నడుస్తోంది. నిన్న సాయంత్రం నుంచే చంద్రబాబు అరెస్టుకు రంగం సిద్ధం చేశారని సమాచారం. లేదు లేదంటూనే సైలెంట్‌గా పని కానిచ్చేశారని ఈ పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతోంది. మొత్తం ఆరు బస్సుల్లో బలగాలు ఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నాయి. డీఐజీ రఘురామరెడ్డి, జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.  

నంద్యాల వ్యాప్తంగా ఎక్కడికక్కడ బారికేడ్లు, చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు పోలీసులు. అన్ని పక్కగా చేసిన తర్వాత డీఐజీ రఘురామరెడ్డి ఆధ్వర్యంలో ఐదు వందల మంది పోలీసుల టీం చంద్రబాబు  ఉంటున్న బస్ వద్దకు వచ్చింది. పోలీసులు ఇలా ఒక్కసారిగా రావడంపై టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి. అసలు అర్థరాత్రి జెడ్‌ప్లస్ కేటగిరి ఉన్న వ్యక్తిని డిస్టర్బ్ చేయడమేంటని ప్రశ్నించాయి. 

మొదట చంద్రబాబును అరెస్టు చేయడానికి వచ్చామని మొదట చెప్పినట్టు టీడీపీ లీడర్లు చెబుతున్నారు. తర్వాత చంద్రబాబు విదేశాలకు పారిపోతారనే అనుమానం ఉందని అందుకే వచ్చామని తర్వాత చెప్పారట. ఇలా పదే పదే మాట మారుస్తూ అక్కడ టీడీపీ లీడర్లతో వాగ్వాదం జరిగింది. పోలీసులు అటుగా వెళ్లకుండా తొలుత టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. వారిని బలవంతంగా నెట్టుకొని లోపలికి వెళ్లాయి. అక్కడ టీడీపీకి చెందిన జిల్లా నేతలు, మాజీ మంత్రులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబు ప్రధాన భద్రత అధికారి, ఎన్‌ఎస్‌జీ అధికారులతో పోలీసులు సంప్రదింపులు జరిపారు. ఎన్‌ఎస్‌జీ కమాండెంట్‌కి పోలీసులు సమాచారం ఇచ్చారు. 

అర్ధరాత్రి చంద్రబాబుని నిద్రలేపడం పద్ధతి కాదని... ఆయన ఎక్కడికీ పారిపోరని టీడీపీ నేతలు చెప్పారు. తప్పుడు సమాచారం ఆధారంగా వచ్చారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. పోలీసులు ఐపీఎస్‌ చదువులు మర్చిపోయి వైసీపీ చట్టాలను వంటబట్టించుకున్నారని విమర్శలు చేశారు. చంద్రబాబు విశ్రాంతి తీసుకుంటున్న బస్సు డోర్‌ కొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. 

 టీడీపీ నేతలు అడ్డుకున్నారు. అసలు అర్ధరాత్రి టైంలో జెడ్‌ప్లస్‌ కేటగిరి ఉన్న వ్యక్తి పట్ల ఇలానే ప్రవరిస్తారా అని నిలదీశారు. చంద్రబాబు వెహికల్స్‌ మూమెంట్‌ ఉన్నట్టు తమకు సమాచారం ఉందని అందుకే వచ్చామన్నారని పోలీసులు చెబుతున్నారు. 

Published at : 09 Sep 2023 04:20 AM (IST) Tags: Andhra pradesh police Nandyala CBN Chandra Babu #tdp

ఇవి కూడా చూడండి

AP ECET: సెప్టెంబరు 25 నుంచి ఈసెట్‌ ఫార్మసీ కౌన్సెలింగ్‌, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

AP ECET: సెప్టెంబరు 25 నుంచి ఈసెట్‌ ఫార్మసీ కౌన్సెలింగ్‌, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

APVVP: పశ్చిమ గోదావరి జిల్లాలో 57 మెడికల్, పారామెడికల్ పోస్టులు

APVVP: పశ్చిమ గోదావరి జిల్లాలో 57 మెడికల్, పారామెడికల్ పోస్టులు

APSRTC Special Offer: 60 ఏళ్లు దాటిన వారికి ఏపీఎస్ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్ - బస్సుల్లో 25 శాతం రాయితీ

APSRTC Special Offer: 60 ఏళ్లు దాటిన వారికి ఏపీఎస్ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్ - బస్సుల్లో 25 శాతం రాయితీ

AP DPHFW: ఏపీలో 434 స్టాఫ్ నర్సు పోస్టులు, జోన్లవారీగా ఖాళీల వివరాలు

AP DPHFW: ఏపీలో 434 స్టాఫ్ నర్సు పోస్టులు, జోన్లవారీగా ఖాళీల వివరాలు

సుప్రీంకోర్టుకు చంద్రబాబు- సీఐడీ విచారణపై క్వాష్ పిటిషన్ దాఖలు 

సుప్రీంకోర్టుకు చంద్రబాబు- సీఐడీ విచారణపై క్వాష్ పిటిషన్ దాఖలు 

టాప్ స్టోరీస్

YCP Counter To  Purandeswari: ఈ తెలివితోనే మీరు కేంద్రమంత్రిగా పనిచేశారా? - పురందేశ్వరిపై వైసీపీ సెటైర్లు

YCP Counter To  Purandeswari: ఈ తెలివితోనే మీరు కేంద్రమంత్రిగా పనిచేశారా? - పురందేశ్వరిపై వైసీపీ సెటైర్లు

TTDP Protest in Hyderabad: చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్‌లో టీడీపీ ఆందోళనలు- నేతల అరెస్ట్‌

TTDP Protest in Hyderabad: చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్‌లో టీడీపీ ఆందోళనలు- నేతల అరెస్ట్‌

IND vs AUS, 2nd ODI: సాహో శ్రేయస్‌.. జయహో శుభ్‌మన్‌! ఆసీస్‌పై కుర్రాళ్ల సెంచరీ కేక

IND vs AUS, 2nd ODI: సాహో శ్రేయస్‌.. జయహో శుభ్‌మన్‌! ఆసీస్‌పై కుర్రాళ్ల సెంచరీ కేక

మళ్ళీ ప్రభాస్ తో కలిసి నటిస్తారా? - డార్లింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్!

మళ్ళీ ప్రభాస్ తో కలిసి నటిస్తారా? - డార్లింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్!