By: ABP Desam | Updated at : 16 Apr 2022 07:52 AM (IST)
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
AP CM YS Jagan Mohan Reddy to Visit Kurnool District today: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్, కర్నూలు జిల్లాలో రెండు రోజుల పర్యటన కొనసాగుతోంది. నిన్న గన్నవరం నుంచి బయలుదేరి కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం అక్కడి నుంచి ఒంటిమిట్టకు వెళ్లి, శ్రీ సీతారాముల వారిని దర్శించుకున్నారు. ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల కల్యాణం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున శుక్రవారం రాత్రి స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. సీఎం జగన్ రాత్రి కడపలోనే బస చేశారు.
వివాహ వేడుకలకు హాజరుకానున్న సీఎం జగన్..
నేడు (శనివారం) ఉదయం అక్కడ రెండు వివాహ వేడుకల్లో పాల్గొననున్నారు. ఎన్‌జీఓ కాలనీలో ఐఏఎస్ అధికారి మౌర్య వివాహానికి సీఎం జగన్ హాజరుకానున్నారు. అనంతరం ఆదిత్య కల్యాణ మండపానికి చేరుకుని మేయర్ సురేష్ బాబు కుమార్తె ముందస్తు వివాహ వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్న అనంతరం కడప ఎయిర్‌పోర్టుకు చేరుకొని, అక్కడ నుంచి కర్నూలుకు ముఖ్యమంత్రి జగన్ పయనం కానున్నారని అధికారులు తెలిపారు. అక్కడ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శ్రీదేవి కుమారుడి ముందస్తు వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. ఈ మేరకు అధికారులు సీఎం జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు.
నేడు కర్నూలుకు సీఎం జగన్..
సీఎం జగన్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు తెలిపారు. వైఎస్సార్‌సీపీ మహిళా నేత, పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కుమారుడి వివాహం, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్ కుమార్ రెడ్డి వివాహం ఏప్రిల్ 17న నిర్వహించడానికి ముహూర్తం నిర్ణయించారు. కర్నూలు జిల్లాకు వచ్చాక కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం క్రిష్ణానగర్‌లోని ఎమ్మెల్యే నివాసానికి సీఎం వైఎస్ జగన్ వెళ్లనున్నారు. కాబోయే వధూవరులను సీఎం జగన్ ఆశీర్వదించనున్నారు. సీఎం కర్నూలు పర్యటనకు సంబంధించి ఏర్పాట్ల కోసం జాయింట్ కలెక్టర్ ఎస్ రామ సుందర్ రెడ్డి, డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. అన్ని ఏర్పాట్లు చేయడంపై చర్చించారు. సీఎం జగన్ భద్రత విషయంపై జిల్లా పోలీసులను అప్రమత్తం చేశారు. సీఎం జగన్ కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా గ్రీన్ ఛానల్ నిర్వహించాలని, అధికారులు సైతం అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
CM Jagan In Ontimitta : ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల కల్యాణం సందర్భంగా సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరపున శుక్రవారం రాత్రి స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న సీఎం జగన్ కు టీటీడీ చైర్మన్ వైవి. సుబ్బారెడ్డి, ఈవో కెఎస్. జవహర్ రెడ్డి, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అర్చకులు ముఖ్యమంత్రికి తలపాగా కట్టి పళ్లెంలో పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఉంచారు. సీఎం వీటిని ఊరేగింపుగా తీసుకుని వెళ్లి ఆలయంలో అర్చకులకు అందించి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం సీఎం జగన్ కు శేషవస్త్రం అందించి వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సీఎంకు స్వామివారి తీర్థప్రసాదాలు, ఒంటిమిట్ట రాములవారి చిత్రపటం అందజేశారు. సీఎం జగన్ వెంట మంత్రి రోజా, ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఆకేపాటి అమరనాథ రెడ్డి, ఎమ్మెల్యేలు మేడా మల్లిఖార్జున రెడ్డి, అధికారులు ఉన్నారు.
Also Read: Weather Updates: బీ అలర్ట్ - తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరిక
Also Read: CM Jagan In Ontimitta : ఒంటిమిట్టలో వైభవంగా సీతారాముల కల్యాణం, పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
Raptadu Politics: ప్రకాష్ రెడ్డి దొంగ ఓట్ల ఆరోపణలు! మాట్లాడేందుకు సిగ్గుండాలంటూ పరిటాల సునీత కౌంటర్
Diploma in Pharmacy: ఫార్మసీ డిప్లొమా కోర్సుల ప్రవేశాల షెడ్యూలు విడుదల, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
Polytechnic Branches: పాలిటెక్నిక్ కళాశాలల్లో 16 బ్రాంచిలకు ఎన్‌బీఏ గుర్తింపు, త్వరలో మరిన్ని కాలేజీలకు అక్రిడియేషన్
SI Recruitment: ఎస్ఐ పోస్టుల భర్తీలో కీలక పరిణామం - కోర్టులోనే 'ఎత్తు' కొలవండి, హైకోర్టు ఆదేశం
AP ICET: ఏపీ ఐసెట్ రెండో విడత సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదల, కళాశాలలవారీగా సీట్ల వివరాలు ఇలా
Lets Vote : ఓటేద్దాం రండి - ఓటు మన హక్కే కాదు బాధ్యత కూడా !
Telangana Elections 2023 : ఎన్నికల సమరానికి సర్వం సిద్ధం - 7 గంటల నుంచి పోలింగ్ !
Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో ప్రముఖ నేతలు ఓటు వేసేది ఈ బూత్‌లలోనే
Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం
/body>