అన్వేషించండి

Mobile Phone Recovery: మొబైల్స్ రికవరీలో అనంతపురం పోలీసులు రికార్డు, వీటి విలువ అన్ని కోట్ల రూపాయలా!

Anantapur News | అనంతపురం పోలీసులు మొబైల్స్ రికవరీలో సరికొత్త రికార్డు సృష్టించారు. పది వేలకు పైగా సెల్ ఫోన్లను రికవరీ చేసి, వాటి యజమానులకు అందజేశారు. ఫోన్ చోరీ అయితే ఏం చేయాలో వివరించారు.

Anantapur police create record in mobile phone recovery | అనంతపురం: స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక భాగం అయిపోయింది. ఒక్క పూట అన్నం లేకపోయినా ఉంటారేమో కానీ ఒక్క క్షణం ఫోన్ లేకుంటే ఉండలేని పరిస్థితి ప్రస్తుత కాలంలో నెలకొంది. అలాంటి సెల్ఫోన్ చోరీకి గురైతే మనం పడే టెన్షన్ చెప్పలేనిది. ఎందుకంటే సెల్ ఫోన్ కన్నా అందులో ఉన్న మన డేటా అంత ఇంపార్టెంట్ అయిపోయింది. ప్రస్తుత కాలంలో మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి సెల్ఫోన్లో భద్రపరుచుకునే స్థాయికి వచ్చేసాం. అందుకే సెల్ఫోన్ చోరీకి గురైందంటే చాలు మనకి ఎక్కడా లేని టెన్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ టెన్షన్ అక్కర్లేదు అంటున్నారు అనంతపురం జిల్లా పోలీసులు. మీ ఫోన్ పోయిందా ఆన్లైన్లో మీ ఫోన్ కు సంబంధించిన వివరాలతో కంప్లైంట్ ఇస్తే మీ ఫోను మీ చెంతకే చేరుస్తున్నారు. 

 10 వేల సెల్ ఫోన్ల రికవరీ 

ప్రజల మొబైల్ ఫోన్లు చోరీకు గురై అవి ఇతర రాష్ట్రాలకు చేరినా రికవరీలో రాజీపడకుండా వాటిని  పోలీసులు రికవరీ చేస్తున్నారు. ఇప్పటి వరకు అనంతపురం జిల్లా పోలీసుశాఖ అందజేసిన మొబైల్ ఫోన్లు 10,195... వీటన్నింటి విలువ సుమారు రూ 18.85 కోట్లు. ఈరోజు అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో రికవరీ మొబైల్ ఫోన్ల మేళా నిర్వహించి... రూ.3.45 కోట్ల విలువ చేసే 1309 మొబైల్ ఫోన్లు బాధితులకు జిల్లా ఎస్పీ జగదీష్ అంచించారు. చొరికి గురై దొరకవని ఆశలు వదలిన సెల్ ఫోన్లను పోలీసుల ద్వారా అందుకుని జిల్లా పోలీసుశాఖ పట్ల హర్షం వ్యక్తం చేసిన బాధితులు హర్షం వ్యక్తం చేశారు. 

 ఇతర రాష్ట్ర వాసుల ఫోన్ లు కూడా రికవరీ. ఏ జిల్లా ఎన్ని ఫోన్లు రికవరీ ? 

ఇప్పటి వరకు అందజేసిన 10,195 మొబైల్ ఫోన్లలో అనంతపురం జిల్లావాసులకు- 6504, శ్రీ సత్య సాయి -1012, కర్నూలు- 589, కడప-401, చిత్తూరు-92, గుంటూరు-81, తిరుపతి-55, నెల్లూరు-53, తూర్పు గోదావరి-38, ప్రకాశం-36, కృష్ణ-35, పశ్చిమ గోదావరి-33, విజయవాడ-28, విజయనగరం-21, కాకినాడ-18, శ్రీకాకుళం-15, ఏలూరు-12, ఒంగోలు-09, విశాఖపట్నం-07

కర్నాటక -415, తెలంగాణ-385, కేరళ-93, తమిళనాడు-71, మహరాష్ట్ర-60, పశ్చిమ బెంగాల్ - 39, ఉత్తరప్రదేశ్ - 19, బీహార్-15, అస్సాం-13, రాజస్థాన్-11, ఒడిస్సా-09, గుజరాత్-08, మధ్యప్రదేశ్-05, హర్యాన-03, జమ్ము కాశ్మీర్-03, ఛత్తీస్ ఘడ్-02, జార్కండ్-02, డెహ్రాడూన్-01, డిల్లీ-01, పంజాబ్ -01.

 సెకండ్ హ్యాండ్ ఫోన్ ల కొనుగోలు విషయాల్లో జాగ్రత్త పడాలి : 

వినియోగదారులు సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆ ఫోన్ కు సరైన బిల్ ఉంటేనే కొనుగోలు చేయాలని తక్కువ ధరకు వస్తుందని సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్లను కొనుగోలు చేస్తే మీరు మీ డబ్బుతో పాటు ఫోన్ కూడా కోల్పోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు.  సెల్ ఫోన్ దుకాణం నిర్వాహకులైనా, వ్యక్తులైనా ఎవరైనా సరే అపరిచితులు అమ్మే ఫోన్లను కొనుగోలు చేయొద్దని అమ్మేవారు పరిచయస్తులైనా సరే బిల్లులు, సంబంధిత మొబైల్ ఫోన్ వివరాలు కల్గిన బాక్సు ఉంటేనే కొనాలని సూచించారు. 

 చాట్ భాట్ లేదా CEIR లో ఎలా నమోదు చేసుకోవాలి : 

సెల్ఫోన్ చోరీకి గురైతే చాట్ భాట్ లేదా CEIR లో కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఈ చాట్ బాట్ సేవల ద్వారా బాధితులకు న్యాయం జరుగుతుందని అనంత పోలీసులు వెల్లడించారు.

ఫోన్ చోరీకి గురైనా మిస్ అయినా చాట్ బాట్ లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న CEIR ద్వారా నమోదు చేసుకోవాలి.
CEIR లో ఎలా నమోదు చేసుకోవచ్చో చాట్ బాట్ లో సూచనలు కూడా చేసినట్లు తెలిపారు. దీంతో వెంటనే సిమ్, IMEI నంబర్లను బ్లాక్ చేస్తారు. దీనివల్ల సదరు మొబైల్ నంబర్ , మొబైల్ ఫోన్ లో ఉన్న విలువైన సమాచారం దుర్వినియోగం కాకుండా ఉండే వీలుంటుంది. 

Also Read: Festival Smartphone Offers: సగం ధరలోనే ప్రీమియం ఫోన్లు - దీపావళి మొబైల్ బ్రాండ్ల బంపర్ ఆఫర్లు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Anurag Kulkarni - Ramya Behara Wedding: సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
Mike Tyson vs Jake Paul Boxing Result: మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Anurag Kulkarni - Ramya Behara Wedding: సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
Mike Tyson vs Jake Paul Boxing Result: మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Chandrababu: చంద్రబాబు అన్ని కార్యక్రమాలు రద్దు, ఢిల్లీ నుంచి హుటాహుటీన హైదరాబాద్‌కు పయనం
చంద్రబాబు అన్ని కార్యక్రమాలు రద్దు, ఢిల్లీ నుంచి హుటాహుటీన హైదరాబాద్‌కు పయనం
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
Pawan Kalyan - Rana Daggubati: పవన్ కల్యాణ్ రారు... అభిమానులకు షాక్ ఇచ్చిన రానా దగ్గుబాటి స్టేట్మెంట్
పవన్ కల్యాణ్ రారు... అభిమానులకు షాక్ ఇచ్చిన రానా దగ్గుబాటి స్టేట్మెంట్
India vs Canada: కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
Embed widget