Amit Shah: మంత్రాలయంలో శ్రీరాముడి విగ్రహానికి అమిత్ షా శంకుస్థాపన, 108 అడుగుల ఎత్తున నిర్మాణం
కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో ఏర్పాటు చేయనున్న 108 అడుగుల శ్రీరాముని విగ్రహానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా శంకుస్థాపన చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో 108 అడుగుల ఎత్తైన శ్రీరాముడి విగ్రహానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా శంకుస్థాపన చేశారు. ఆదివారం (జూలై 23) వర్చువల్ గా హోం మంత్రి ఈ విగ్రహ నిర్మాణానికి పునాది రాయి వేశారు. కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో ఏర్పాటు చేయనున్న 108 అడుగుల శ్రీరాముని విగ్రహం మన సనాతన ధర్మ సందేశాన్ని యావత్ ప్రపంచానికి అందించడమే కాకుండా దేశంలోనూ, ప్రపంచంలోనూ వైష్ణవ సంప్రదాయాన్ని బలోపేతం చేస్తుందని అమిత్ షా అన్నారు.
తుంగభద్ర నది ఒడ్డున ఉన్న మంత్రాలయం గ్రామంలో 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు ఉంటుందని, రెండున్నరేళ్లలో పూర్తి చేస్తామని కేంద్ర హోంమంత్రి మంత్రి తెలిపినట్లుగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఓ ప్రకటనలో తెలిపింది. మంత్రాలయం గ్రామం రాఘవేంద్ర స్వామి దేవాలయానికి ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ ప్రదేశానికి చారిత్రక ప్రాధాన్యం ఉంది. ఈ గొప్ప విజయనగర సామ్రాజ్యం తుంగభద్ర నది ఒడ్డున ఉద్భవించింది. ఇది మొత్తం దక్షిణాది నుండి ఆక్రమణదారులను తరిమికొట్టడం ద్వారా స్వదేశ్, స్వధర్మాన్ని ఏర్పాటు చేసింది. మంత్రాలయం దాస్ సాహిత్య ప్రకల్పం కింద గృహనిర్మాణం, అన్నదానం, ప్రాణదానం, విద్యాదానం, తాగునీరు, గోసంరక్షణ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టామని అమిత్ షా తెలిపారు.
మరోవైపు, ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న శ్రీరామ మందిర నిర్మాణానికి రెండేళ్ల క్రితం ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. త్వరలో శ్రీరామ మందిరంలో రాంలాలా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. వందేళ్ల తర్వాత మరోసారి శ్రీరాముడు తన సొంత స్థలంలో కొలువుదీరనున్నాడు.
Laid the foundation stone for a 108-foot-tall statue of Prabhu Shri Ramachandra Ji, to be built by Shri Raghavendra Swami Mutt at Kurnool, Andhra Pradesh.
— Amit Shah (@AmitShah) July 23, 2023
The colossal statue of Prabhu Ram, which will be the tallest in India, will immerse the city with the emotion of devotion… pic.twitter.com/J45qwGQJvm
ఈ విషయాన్ని కూడా అమిత్ షా గుర్తు చేశారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారని అమిత్ షా అన్నారు. ఇప్పుడు, త్వరలో శ్రీరామ మందిరంలో రామ్‌లాలా విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారుని, వందల సంవత్సరాల తర్వాత మరోసారి శ్రీరాముడు తన సొంత స్థలంలో ఉంటాడని అన్నారు. మంత్రాలయంలో శ్రీరాముడి బృహత్ విగ్రహానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా మఠంలోని మఠాధీశుడు, అత్యంత గౌరవనీయమైన సన్యాసి మధ్వాచార్యజీ, సన్యాసి రాఘవేంద్ర స్వామిజీ, దక్షిణాదిలోని అత్యంత గొప్ప వైష్ణవ సంప్రదాయం ఆచరిస్తున్న సాధువులందరికీ నివాళులర్పించారు.