అన్వేషించండి

Minister Buggana : చివరి ఎన్నికలంటూ చంద్రబాబు పచ్చి అబద్దాలు - మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

Minister Buggana : చంద్రబాబు పచ్చి అబద్దాలు ఆడుతున్నారని మంత్రి బుగ్గన విమర్శించారు. ఇవే చివరి ఎన్నికలు అని ఎవర్ని మభ్యపెడుతున్నారని ప్రశ్నించారు.

Minister Buggana : ఎన్నికల్లో  గెలిపిస్తేనే  రాజకీయాల్లో  ఉంటానని  చంద్రబాబు ఎవర్ని  బెదిరిస్తారని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  ప్రశ్నించారు. చంద్రబాబు పచ్చి అబద్దాలు   మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజల్లో ఏమి మాట్లాడినా నడుస్తుందనే అహకారంతో చంద్రబాబు ఉన్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం విద్య, వైద్యంపై శ్రద్ధ చూపుతుందన్నారు.  చంద్రబాబు కర్నూల్ పర్యటనలో అవాస్తవాలు చెబుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఎన్ని పరిశ్రమలు తెచ్చారో చెప్పాలన్నారు.  కోవిడ్ ఉన్నా కూడా రూ.13,200 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు.  2014 లో ఇంటికో ఉద్యోగం అని చెప్పిన బాబు ప్రజల్ని మోసం చేశారన్నారు.  

చంద్రబాబు ఎన్ని పరిశ్రమలు తెచ్చారు? 

"కర్నూల్  లో ఎన్ని పరిశ్రమలు ఇచ్చారో చంద్రబాబు ఆలోచించుకోవాలి. సోలార్, విండ్ పవర్ లో పెద్ద ప్రాజెక్ట్ ఈ ప్రభుత్వంలో  జరుగుతోంది. ఓర్వకల్ ఎయిర్ పోర్టు   ఈ ప్రభుత్వం నిర్మిస్తుంది. అసలు రాయలసీమకు చంద్రబాబు ఏంచేశారు. రాయలసీమ ప్రజలు విజ్ఞులు కాబట్టి బాబు పర్యటనను అడ్డుకోలేదు. రాయలసీమ వెనకబడ్డ ప్రాంతం కాబట్టి హైకోర్టు ఉండాలంటే వద్దంటారు. మూడు రాజధానులకు ఎందుకు వ్యతిరేకమో చంద్రబాబు చెప్పాలి. రాయలసీమ ఏం పాపం చేసింది. కోర్టును  కూడా  అడ్డుకుంటున్నారు." - మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 

అప్పుడో మాట ఇప్పుడో మాట- బొత్స

 వచ్చే ఎన్నికలే తన చివరి ఎన్నికలు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రులు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు స్పందించారు.  చంద్రబాబుకు ఇవే చివరికి ఎన్నికలు తథాస్తు అదే జరుగుతోందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఏపీ బాగుపడాలంటే చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాకూడదన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే కరవు కాటకాలు వస్తాయని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట...లేనప్పుడు మరోమాట మాట్లాడతారని చంద్రబాబును విమర్శించారు. చంద్రబాబును హిట్లర్ తో, ఈస్ట్ ఇండియా కంపెనీతో పోల్చారన్నారు. మరోమారు చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకూడదని స్పష్టం చేశారు.

"మహిళలను కించపరుస్తూ మాట్లాడితే ఎవరూ హర్షించడం. ఫ్యామిలీ మెంబర్స్ పేరుతో లబ్ది పొందుతున్నారు చంద్రబాబు. చంద్రబాబు ఏం మాట్లాడినా మాకు ఆశీస్సులే. చంద్రబాబును ఈస్ట్ ఇండియా కంపెనీతో పోల్చిన సందర్భం ఉంది. ఆయన చెప్పినట్లు ఇవే చివరి ఎన్నికలు తథాస్తు"- మంత్రి బొత్స 

దిగజారుడు రాజకీయాలు 

2024 ఎన్నికలు చంద్రబాబుకి చివరి ఎన్నికలే  అని మంత్రి సీదిరి అప్పల రాజు ఉన్నారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ తుడిచిపెట్టుకు పోతుందని జోస్యం చెప్పారు. 2024 టీడీపీకి సమాధి కట్టే ఎన్నికలు అన్నారు. వచ్చే ఎన్నికలలో చంద్రబాబు గుండెల్లో గునపం దిగడం ఖాయమన్నారు. సానుభూతి కోసం మళ్లీ భార్యను లాగుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు మళ్లీ సానుభూతి డ్రామాలు మొదలుపెట్టారని విమర్శించారు. భార్యను అడ్డుపెట్టుకుని ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా? అని మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు. అనని మాటలు అనట్టు ఎందుకు ప్రచారం చేస్తున్నారన్నారు. 

"చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉంటే ఆయన సామాజిక వర్గం తప్ప ఎవరైనా బాగుపడ్డారా? ఆయన సీఎంగా ఉంటే ఎవరికి ఉపయోగం? ప్రజలకు ఏం చేశావ్. కర్నూల్ లో హైకోర్టుకు చంద్రబాబు వ్యతిరేకం కాదని చెప్పగలరా? సీఎం జగన్ వెంట్రుక కూడా చంద్రబాబు పీకలేరు. చంద్రబాబు పుట్టుకే 420.. చేసే పనులన్నీ 420 పనులే. నాకు చివరి ఎన్నికలు అని బీజేపీకి అస్త్రం ఇచ్చారు. ఏపీలో బలోపేతం అవ్వడానికి బీజేపీ కాచుకుని కూర్చుంది. చంద్రబాబు తప్పుకుంటే ప్రతిపక్ష పాత్ర పోషించడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. బహుశా మొన్న పవన్ తో మోదీ ఇదే చెప్పి ఉంటారు. షెడ్యుల్ ప్రకారమే మేము ఎన్నికలకు వెళ్తాం. 16 నెలల్లో ఎన్నికలు అని రెండు రోజుల క్రితమే సీఎం జగన్ చెప్పారు."- మంత్రి సీదిరి అప్పలరాజు 

 

టాప్ హెడ్ లైన్స్

India Census 2027: జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
Embed widget