News
News
X

Kuppam Gold Mines : కుప్పంలో బంగారు గనులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్, రూ.450 కోట్లకు ఎన్ఎండీసీ టెండర్లు!

Kuppam Gold Mines : కుప్పం సరిహద్దులోని బంగారు గనులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.450 కోట్లతో ఎన్ఎండీసీ సంస్థ టెండర్లు దక్కించుకోవడంతో స్థానికంగా ఉపాధి లభిస్తుందని కార్మికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

FOLLOW US: 

Kuppam Gold Mines : దేశంలోనే పేరుగాంచిన చిగురుకుంట బంగారు గనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్‌‌ ఇచ్చింది. సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయంతో మహర్దశ రానుంది. మూడు దశాబ్దాల చరిత్ర కలిగిన బంగారు గనులు మూతపడ్డాయి. ఈ నెల 4న కుప్పం ప్రతినిధులతో సమావేశమైన ముఖ్యమంత్రి ఏడాదిలోపు చిగురుకుంట బంగారు గనులను పునః ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ప్రతిపక్ష నాయకుడి నియోజకవర్గంలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంతో కార్మికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వందల మంది కార్మికులకు నేరుగా ఉపాధి దొరికే మహానిధి కావడంతో చుట్టు పక్కల ప్రజల్లో ఆనందం వ్యక్తమౌతోంది.

రూ.450 కోట్లతో టెండర్లు 

కుప్పం‌ నియోజకవర్గం గుడుపల్లె మండలం రెండు ప్రాంతాలలో బంగారు గనులున్నాయని గుర్తించారు. అందులో బిసానత్తం గ్రామంలోని గనిని 1968లో ప్రారంభించగా, చిగురుకుంట గ్రామంలోని గనిని 1978లో ప్రారంభించారు. ఎంఈసీఎల్‌ సంస్థ సారథ్యంలో తవ్వకాలు మొదలుపెట్టారు. ఇక్కడ క్వార్ట్జ్ రాయిని తీసి ముడి సరుకును విక్రయిస్తూ వచ్చారు. సుమారు పదేళ్ల పాటు క్వార్ట్జ్ (బంగారు ముడి పదార్థం) వెలికి తీసి కేజీఎఫ్‌ (కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్‌)లోని బీజీఎంఎల్‌ (భారత్‌ గోల్డ్‌ మైనింగ్‌ లిమిటెడ్‌)కు అందజేస్తూ వచ్చింది. కాలక్రమేణా ఎంఈసీఎల్‌ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. దీంతో గనుల‌ నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. మరో మార్గం‌ లేక గనులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీజీఎంఎల్‌ కు విక్రయించింది. 1982లో కొనుగోలు చేసిన బీజీఎంఎల్ అప్పటి నుంచి 19 సంవత్సరాల పాటు 2001 జనవరి 15 వరకు బంగారు ముడి ఖనిజం వెలికి తీస్తూ వచ్చింది. కొంత కాలం గనులు లాభాల బాటలో నడిచినా కేజీఎఫ్‌లో బీజీఎంఎల్‌ నిర్వహిస్తున్న చాంపియన్‌ గని నష్టాల్లో పడటంతో దాని ప్రభావం చిగురుకుంట, బిసానత్తం గనులపై కూడా పడింది. దీంతో కంపెనీ లాకౌట్ ప్రకటించింది. దీంతో గనులు మూతపడ్డాయి. మరో పని తెలియక గనుల్లో పనులు గ్యారంటీ అనుకుని జీవించే వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మళ్ళీ ఇప్పుడు వారి ఆశలు చిగురిస్తున్నాయి. రూ.450 కోట్లతో ఎన్ఎండీసీ సంస్థ  టెండర్లు దక్కించుకోవడంతో పనులు ప్రారంభమౌతాయన్న నమ్మకం కలుగుతోంది. 

టెండర్లు దక్కించుకున్న ఎన్ఎండీసీ

మూతపడ్డ గనులను తిరిగి ప్రారంభించాలని 2011వ సంవత్సరంలో ఓ ప్రయత్నం చేసింది ప్రభుత్వం. మైసూరుకు చెందిన జియో సంస్థ ద్వారా సర్వే చేయించింది. జియో సంస్థ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మల్లప్పకొండ, బిసానత్తం, చిగురుకుంటలోని 19 కి.మీ. మేర పరిశోధనలు చేసి 263 హెక్టార్లను ఎంపిక చేసింది. 150 బోర్లు డ్రిల్‌ చేసి బంగారం లభ్యతపై అన్వేషణ చేపట్టింది. ఇక్కడ దొరికిన సల్ఫేట్‌ మట్టిని బెంగళూరుకు తరలించి ల్యాబ్‌లో పరీక్షించారు. పరీక్షల్లో చిగురుకుంట, బిసానత్తం ప్రాంతాల్లో ఇంకా బంగారం ఉన్నట్లు నిర్ధారణకు వచ్చి, ఆ నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి అందజేశారు. నివేదికల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం బిడ్‌లను పిలిచింది. ఈ బిడ్‌లకు అదానీ, వేదాంత వంటి బడా కంపెనీలు పోటీ పడ్డాయి. పోటీలో ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ టెండర్లను దక్కించుకుంది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ తరుణంలో ముఖ్యమంత్రి  మరో సంవత్సరంలో గనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలంలో ఉన్న బంగారు ఖనిజాన్ని వెలికి తీయాలన్న ముఖ్యమంత్రి నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మరో ఏడాదిలో చిగురుకుంట బంగారు గనులకు మోక్షం లభించనుంది. వందల కుటుంబాలకు ఉపాధి దొరకనుందని స్థానికులు అంటున్నారు. 

18 లక్షల టన్నుల బంగారం 

263 హెక్టార్లలో విస్తరించిన చిగురుకుంట, బిసానత్తం గనుల్లో ఇప్పటికీ 18 లక్షల టన్నుల బంగారం ముడి ఖనిజం ఉండొచ్చని ఎన్‌ఎండీసీ అధికారుల అంచనా వేశారు. ఒక టన్ను ముడి పదార్థం నుంచి 5.5 గ్రాముల బంగారం లభిస్తుంది. మొత్తం  8.5 టన్నుల బంగారం ఉత్పత్తిని లక్ష్యంగా నిర్ణయించుకుని, రూ.450 కోట్ల వరకు సంస్థ ఖర్చు పెట్టనుంది. గనుల ప్రదేశంలోనే బంగారు శుద్ధి ప్లాంటుకు ఎన్‌ఎండీసీ సంస్థ సన్నాహాలు ప్రారంభించింది. ఇవన్నీ జరగాలంటే అక్కడ ఉన్న 8 సొరంగ మార్గాల ద్వారా పనిచేసే టెక్నికల్ నామ్ టెక్నికల్ సిబ్బంది కావాల్సి ఉంటుంది. గనులు లాక్‌ అవుట్‌ చేసే నాటికి 1500 మంది పనిచేసేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిగురుకుంట, బిసానత్తం ప్రాంతాల్లో గనులు సాగాలంటే 3 వేల మంది సిబ్బంది అవసరమవుతారు. వీరిలో 1500 గనికార్మికులు మరో 1500 నిపుణులు, ఉద్యోగులు కావాల్సి ఉంటుంది. దీంతో స్థానికులకు ఉద్యోగాలు భారీగా వచ్చే అవకాశం ఉంది. తద్వారా ఆ ప్రాంతాలు కూడా అభివృద్ది చెందడానికి అవకాశం ఉంటుంది. కుప్పం నియోజకవర్గం నుంచి పది వేల మంది యువకులు ఉపాధి కోసం నిత్యం బెంగళూరుకు రాకపోకలు సాగిస్తున్నారు. గనులు ప్రారంభమైతే స్థానికంగానే చాలా మందికి ఉపాధి లభించనుంది. అంతే కాకుండా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోందని స్థానికులు అంటున్నారు.  పంచాయతీలకు ఆదాయంతో పాటు గనులు ప్రారంభమైతే చుట్టు పక్కల 20 గ్రామాల ప్రజలకు ఉపాధి దొరుకుతుందని ఆశపడుతున్నారు. 

Published at : 15 Aug 2022 10:18 PM (IST) Tags: cm jagan ap govt AP News Kuppam Chigurukunta gold mines NMDC

సంబంధిత కథనాలు

తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

BJP Vishnu : అమిత్ షాను కలిసినందుకే విమర్శిస్తారా ? జూ.ఎన్టీఆర్‌కు 18 కోట్ల బీజేపీ సభ్యుల మద్దతు ఉంటుందన్న ఏపీ బీజేపీ !

BJP Vishnu :  అమిత్ షాను కలిసినందుకే విమర్శిస్తారా ? జూ.ఎన్టీఆర్‌కు 18 కోట్ల బీజేపీ సభ్యుల మద్దతు ఉంటుందన్న  ఏపీ బీజేపీ !

Breaking News Live Telugu Updates: తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

Breaking News Live Telugu Updates: తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

తిరుమలలో సీఎం జగన్ టూర్- ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభం

తిరుమలలో సీఎం జగన్ టూర్- ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభం

KVP Letter To Jagan : జగన్‌కు కేవీపీ సీరియస్ లెటర్ - కేంద్రంపై ఒత్తిడి చేయాలని సలహా !

KVP Letter To Jagan :  జగన్‌కు కేవీపీ సీరియస్ లెటర్ - కేంద్రంపై ఒత్తిడి చేయాలని సలహా !

టాప్ స్టోరీస్

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కిషన్ రెడ్డివి అవగాహన లేని మాటలు: మంత్రి సత్యవతి రాథోడ్

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కిషన్ రెడ్డివి అవగాహన లేని మాటలు: మంత్రి సత్యవతి రాథోడ్

Sandeep Lamichane: ఇంటర్నేషనల్ క్రికెటర్‌పై రేప్ ఆరోపణలు, అరెస్ట్ వారెంట్ జారీ - రంగంలోకి దిగిన ఇంటర్ పోల్

Sandeep Lamichane: ఇంటర్నేషనల్ క్రికెటర్‌పై రేప్ ఆరోపణలు, అరెస్ట్ వారెంట్ జారీ - రంగంలోకి దిగిన ఇంటర్ పోల్

Ponniyin Selvan Characters: మణిరత్నం కలల ప్రాజెక్టులో పాత్రల నేపథ్యాలు ఇవే..! | ABP Desam

Ponniyin Selvan Characters: మణిరత్నం కలల ప్రాజెక్టులో పాత్రల నేపథ్యాలు ఇవే..!  | ABP Desam

Arvind Swamy: చైతు సినిమాలో అరవింద్ స్వామి - విలన్‌గా మెప్పిస్తారా?

Arvind Swamy: చైతు సినిమాలో అరవింద్ స్వామి - విలన్‌గా మెప్పిస్తారా?