అన్వేషించండి

Kitex Group : కిటెక్స్ పరిశ్రమకు కేటీఆర్ శంకుస్థాపన - యువతకు భారీగా ఉద్యోగావకాశాలు

రంగారెడ్డి జిల్లాలో కిటెక్స్ పరిశ్రమకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. యువతకు ఉద్యోగాల కల్పన దిశగా తెలంగాణ దూసుకుపోతోందన్నారు.

Kitex Group :   రంగారెడ్డి జిల్లాలో  సీతారాంపూర్‌లో రూ.1,200 కోట్ల పెట్టుబడితో కిటిక్స్‌ గ్రూప్‌ తమ రెండో యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంట్ భూమిపూజను కేటీఆర్ చేతుల మీదుగా నిర్వహించారు.   దుస్తుల తయారీలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన కిటెక్స్ గ్రూప్‌ వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో మొదటి యూనిట్‌ను ఏర్పాటు చేయగా.. ఇప్పుడు రెండో యూనిట్‌ను 250 ఎకరాల్లో రూ.1,200 కోట్ల వ్యయంతో షాబాద్ మండలం సీతారాంపూర్‌లో ఏర్పాటు చేస్తున్నారు.  ఈ యూనిట్‌ ద్వారా ఏకంగా 11వేల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఇందులో 80 శాతం ఉద్యోగాలను మహిళలకే ఇవ్వనున్నట్టు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

జడ్జి హిమబిందుపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్, అతనెవరంటే?

 సింటెక్స్ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టనుంది.  సింటెక్స్‌ సంస్థ ఇప్పటికే రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలంలోని చందనవెల్లిలో వెల్‌స్పన్‌ ఫ్లోరింగ్‌ లిమిటెడ్‌, వెల్‌స్పన్‌ అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్స్‌ పేరిట రెండు యూనిట్లను నెలకొల్పింది. వెల్‌స్పన్‌ గ్రూప్‌ కంపెనీ భాగస్వామిగా ఉన్న సింటెక్స్‌.. రూ.1,200 కోట్ల పెట్టుబడితో ఈ రెండు యూనిట్లను ఏర్పాటు చేసింది. శంకుస్థాపన చేసిన 14 నెలలకే 2019 సెప్టెంబర్‌లో ఉత్పత్తులను ప్రారంభించింది. ప్లాస్టిక్‌ పైపులు, ఆటో కంపోనెంట్స్‌, వాటర్‌ ట్యాంకుల తయారీలో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ.. ఇదే ప్రాంతంలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు నిర్ణయించుకున్నది. 

జమిలి ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠ, ఇంకా ఫైనల్ కాని లా కమిషన్ రిపోర్ట్

ఇందులో భాగంగానే రూ.272 కోట్లతో ఇప్పుడు మూడో యూనిట్‌కు శ్రీకారం చుడుతున్నది. 50 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్‌ ద్వారా మరో 650 మందికి ఉద్యోగావకాశాలను సంస్థ కల్పించనున్నది. ఇక దుస్తుల తయారీ సంస్థ కిటెక్స్‌ గ్రూప్‌.. ఇప్పటికే వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్స్‌ పార్కులో మొదటి యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు రెండో యూనిట్‌ను 250 ఎకరాల్లో రూ.1,200 కోట్లతో షాబాద్‌ మండలం సీతారాంపూర్‌లో భారీ స్థాయిలో తీసుకువస్తున్నది. ఈ యూనిట్‌ ద్వారా ఏకంగా 11వేల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఇందులో 80 శాతం ఉద్యోగాలను మహిళలకే ఇవ్వనున్నట్టు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.                                                     

 పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. టీఎస్‌ ఐపాస్‌తో సులభంగా అనుమతులను మంజూరు చేస్తున్నది. భారీగా స్థలాల కేటాయింపుతోపాటు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నది. నిరంతర విద్యుత్తు, వాటర్‌గ్రిడ్‌ పైపుల ద్వారా నీటిని అందిస్తున్నది. ఈ నేపథ్యంలోనే పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. ముఖ్యంగా ఇది రంగారెడ్డి జిల్లాకు కలిసొస్తున్నది. ఇప్పటిదాకా జిల్లాలో రూ.47,062 కోట్ల పెట్టుబడులతో 1,252 పరిశ్రమలు ఏర్పాటైయ్యాయి. 5,15,851 మందికి ఉద్యోగ-ఉపాధి అవకాశాలు దక్కాయి.                                           

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Markapuram Road Accident: మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం! టిప్పర్‌, ప్రైవేట్ బస్‌ ఢీకొని పది మంది సజీవదహనం !
మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం! టిప్పర్‌, ప్రైవేట్ బస్‌ ఢీకొని పది మంది సజీవదహనం !
Women Reservation Effect: రాబోయేది మహిళా నాయకురాళ్ల విప్లవమే - రాజకీయాల దారి మారుతుందా?
రాబోయేది మహిళా నాయకురాళ్ల విప్లవమే - రాజకీయాల దారి మారుతుందా?
Steel Plant Credit Game: మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

వీడియోలు

Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam
Ashwin Comments on MI Captain | హార్దిక్ పాండ్యాపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Shreyas Iyer as captain of Team India? | టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్? | ABP Desam
SRH Spends 10 Crores for Uppal Stadium | 10 కోట్లతో ఉప్పల్ స్టేడియం రినోవేషన్ | ABP Desam
RCB Sold to Aditya Birla Group IPL 2026 | భారీ ధరకు అమ్ముడైన RCB | ABP Desam Bangalore

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Women Reservation Effect: రాబోయేది మహిళా నాయకురాళ్ల విప్లవమే - రాజకీయాల దారి మారుతుందా?
రాబోయేది మహిళా నాయకురాళ్ల విప్లవమే - రాజకీయాల దారి మారుతుందా?
Iran War 2026: 'మేమే తేలుస్తాం.. ట్రంప్ చెప్పడానికి లేదు'; యుద్ధంపై అమెరికా ప్రతిపాదనలు తిరస్కరించిన ఇరాన్
'మేమే తేలుస్తాం.. ట్రంప్ చెప్పడానికి లేదు'; యుద్ధంపై అమెరికా ప్రతిపాదనలు తిరస్కరించిన ఇరాన్
Social Media Addiction: సోషల్ మీడియాను వ్యసనంగా మారుస్తున్న మెటా, యూట్యూబ్‌! కాలిఫోర్నియా జ్యూరీ సంచలన నిర్ణయం! బాధితురాలికి భారీ పరిహారం!
సోషల్ మీడియాను వ్యసనంగా మారుస్తున్న మెటా, యూట్యూబ్‌! కాలిఫోర్నియా జ్యూరీ సంచలన నిర్ణయం! బాధితురాలికి భారీ పరిహారం!
Daily 10-Minute Yoga : రోజుకు 10 నిమిషాలు చాలు.. ఈ సింపుల్ యోగాసనాలు చేస్తే బాడీ ఫిట్, మైండ్ కూల్ అవుతుంది
రోజుకు 10 నిమిషాలు చాలు.. ఈ సింపుల్ యోగాసనాలు చేస్తే బాడీ ఫిట్, మైండ్ కూల్ అవుతుంది
Gas Crisis: అంగారకుడి దృష్టి యుద్ధంపై, శుక్రుడి దృష్టి చమురు, గ్యాస్‌పై !ఈ సంక్షోభం మరింత తీవ్రమవుతుందా?
అంగారకుడి దృష్టి యుద్ధంపై, శుక్రుడి దృష్టి చమురు, గ్యాస్‌పై !ఈ సంక్షోభం మరింత తీవ్రమవుతుందా?
Affordable Safe Cars Under 10 Lakhs: 10 లక్షల రూపాయల కన్నా తక్కువ ధరకే లభించే 5 సురక్షితమైన కార్లు! వాటి రేటింగ్‌లను తెలుసుకోండి
10 లక్షల రూపాయల కన్నా తక్కువ ధరకే లభించే 5 సురక్షితమైన కార్లు! వాటి రేటింగ్‌లను తెలుసుకోండి
Vishnupriyaa Bhimeneni: బుల్లితెరపై విష్ణుప్రియ అందాల ధూమ్ ధామ్... లేటెస్ట్ ఫోటోలు చూశారా?
బుల్లితెరపై విష్ణుప్రియ అందాల ధూమ్ ధామ్... లేటెస్ట్ ఫోటోలు చూశారా?
Sri Rama Navami Wishes In Telugu 2026: శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ శ్లోకాలతో చెప్పేయండి!
2026 శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ శ్లోకాలతో చెప్పేయండి!
Embed widget