జర్నలిస్ట్ కృష్ణంరాజు అరెస్ట్, అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసు
Amaravati case | అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో ప్రధాన నిందితుడు, జర్నలిస్టు కృష్ణరాజును పోలీసులు బుధవారం అరెస్టు చేశారు

Amaravati Women Abusive comment Case |విశాఖ: అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణరాజును పోలీసులు విశాఖలో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అనభ్యకర వ్యాఖ్యలు కేసులో కృష్ణరాజు ఎ1 నిందితుడుగా ఉన్నారు.
ఈ కేసులో ఇదివరకే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు హైదరాబాదులో అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి విజయవాడ కు తరలించారు. మరుసటి రోజు మంగళగిరిలోని కోర్టులో కొమ్మినేనిని ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు.
రాజధాని మహిళల మీద నీచ వ్యాఖ్యలు
'అమరావతి దేవతల రాజధాని కానే కాదు.. అది వేశ్యల రాజధాని' అంటూ మహిళలను తీవ్ర అవమానాలకు గురిచేసేలా ఇటీవల ఒక టీవీ ఛానల్లో అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజు ఎట్టకేలకు చిక్కాడు. అమరావతి మహిళలపై నీచమైన వ్యాఖ్యలు చేసిన ఆయన కొన్ని రోజులుగా పరారీలో ఉన్నారు. సెల్ టవర్ లోకేషన్ ఆధారంగా జర్నలిస్ట్ కృష్ణంరాజు పోలీసులు బుధవారం రాత్రి భీమిలి గోస్తనీనది సమీపంలో అరెస్ట్ చేశారు. కృష్ణంరాజు వెంట మరో ఇద్దరు వ్యక్తులు ఉండగా, పోలీసులు వారిని సైతం అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురినీ విశాఖపట్నం నుంచి తుళ్లూరు పోలీసులు గుంటూరుకు తరలించనున్నారు.
మంగళగిరి కోర్టులో నిందితులను గురువారం హాజరు పరిచే అవకాశం ఉందని సమాచారం. టీవీ డిబేట్ లో కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చిచ్చురేపాయి. మహిళల మీద ఈయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ రంగు పులుముకున్నాయి. ఏపీ వ్యాప్తంగా సాక్షి ఆఫీసులను మహిళలు, మహిళా సంఘాలు ముట్టడిస్తున్నాయి.






















