Srisailam Dam: శ్రీశైలం డ్యామ్ సందర్శించిన కృష్ణా బోర్డు సభ్యులు, వేసవిలో తాగునీరు ఓకే!
Srisailam Dam: నూతనంగా నియమితులైన కృష్ణా రివర్ బోర్డు కమిటీ సభ్యుడు, కేఆర్ఎంబీ ఎస్పీ ఆశోక్ కుమార్ శ్రీశైలం జలాశయాన్ని సందర్శించారు.
KRMB team Visits Srisailam Dam: నూతనంగా నియమితులైన కృష్ణా రివర్ బోర్డు కమిటీ సభ్యుడు, అధికారులు శ్రీశైలం జలాశయాన్ని సందర్శించారు. కృష్ణా బోర్డు సభ్యులు అజయ్ కుమార్ గుప్తాతో పాటు కేఆర్ఎంబీ ఎస్సీ అశోక్ కుమార్ ఈఈ శంకరయ్యలు డ్యామ్ ను పరిశీలించి... జలాశయానికి సంబంధించిన ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో వివరాలను డ్యామ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జలాశయానికి సంబంధించిన గేట్స్, గ్యాలరీ, రోప్స్ ను పరిశీలించి వాటి పనితీరు తదితర వివరాలను గురించి పూర్తిగా అడిగి తెలుసుకున్నారు.
డ్యామ్ ను పరిశీలించిన అనంతరం ఏపీ కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శించి అక్కడి జెన్ కో అధికారులతో కాసేపు ముచ్చటించారు. అన్ని వివరాలు అడుగుతూ చాలా సేపు చర్చించారు. పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీశైలం డ్యాం నీటి నిల్వలు ఆంధ్ర, తెలంగాణ నీటి వాటలాపై అధికారులతో చర్చించమని సూచించారు. జలాశయంలోని అడుగు భాగంలో ఉన్న గ్యాలరీ డ్యాం గేట్లుకు ఉన్న రోప్ లను.. స్పిల్ వే వాటి పటిష్ఠతపై డ్యాం అధికారులను అడిగి తెలుసుకున్నామన్నారు.
వేసవిలో తాగు నీటి కోసం ఓకే
రానున్న ఎండాకాలం సీజన్ కు తాగునీటి కోసం తెలంగాణకు ఒక టీఎంసీ, ఆంధ్రాకు ఒక టీఎంసీ నీరు కావాలని అన్నారు. అయితే డ్యాంలో ఇప్పుడున్న నీరు సరిపోతుందని కృష్ణ రివర్ కమిటి ఎస్సీ అశోక్ కమార్ తెలిపారు. అలానే శ్రీశైలం డ్యాం ప్లంజ్ ఫూల్ కు భారీ గొయ్యి పడిన విషయం రెండు రాష్ట్రాల యాజమాన్య చూస్తుందోని వివరించారు. త్వరలోనే ఈ సమస్యను గుర్తిస్తామన్నారు.
811 టీఎంసీలకు మైనర్ ఇరిగేషన్ కాకుండానే.. 1000 టీఎంసీలు వాడుకున్నామని తెలిపారు. 'తెలంగాణ ప్రభుత్వం 40 టీఎంసీల కోసం ఆర్జీ పెట్టుకుంది. మే నుండి ఆగష్టు వరకు తాగు నీటి కోసం పెట్టుకున్నవి కూడా వర్షం ద్వారా ఇంకా ఎక్కువే కలుస్తున్నాయి. తాగు నీటికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు' అని కృష్ణ రివర్ బోర్డు ఎస్సీ అశోక్ కుమార్ తెలిపారు.
శ్రీశైలం వెళ్లే భక్తులకు బస్సుల్లోనే దర్శనం టికెట్లు
తిరుమలకు వెల్లే ప్రయాణికులకు బస్సుల్లోనే శ్రీవారి శీఘ్ర దర్శనం టిక్కెట్లు ఇస్తున్న విధానాన్ని ఏపీఎస్ ఆర్టీసీ ఇతర పుణ్యక్షేత్రాలకు కూడా విస్తరించింది. ఇకపై శ్రీశైలం వెళ్లే భక్తులకు ఈ తరహా విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఈనెల 9వ తేదీ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సుల్లో శ్రీశైలం వెళ్లే భక్తులకు మల్లికార్జున స్వామి భ్రమిరాంబిక అమ్మవార్ల స్పర్శ, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనానికి టికెట్లు జారీ చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. ప్రతిరోజూ 1075 దర్శన టికెట్లు కేటాయించేందుకు దేవాదాయ శాఖ కమిషనర్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ముందస్తు రిజర్వేషన్ టికెట్లతో పాటు దర్శన టికెట్లు జారీ చేయనున్నట్లు వివరించారు. దేవాదాయ శాఖ సమన్వయంతో ఆర్టీసీ ప్రయాణికులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ తెలిపారు.