Krishna Basin: ఊపిరి పీల్చుకున్న కృష్ణమ్మ- ఈ సీజన్‌లో తొలిసారిగా మొదలైన నీటి ప్రవాహం
Krishna Basin: ఈ సీజన్ లో మొదటి సారి కృష్ణా బేసిన్‌లోని ఆల్మట్టి, తుంగభద్రలోకి నీటి ప్రవహం ప్రారంభమైంది. ఆలమట్టిలోకి 19,712 క్యూసెక్కులు, తుంగభద్రలోకి 17,383 క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది.
Krishna Basin: ప్రమాదంలో పడిన కృష్ణ బేసిన్ కాస్త ఊపిరి పీల్చుకునే సమయం వచ్చింది. ఈ సీజన్ లో మొదటిసారిగా బుధవారం కృష్ణా బేసిన్ లోని ఆలమట్టి, తుంగభద్రలోకి నీటి ప్రవాహం మొదలైంది. ఆలమట్టిలోకి 19,172 క్యూసెక్కులు, తుంగభద్రలోకి 17,383 క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. గోదావరి బేసిన్‌లో ప్రధాన గోదావరికి ప్రవాహం లేకపోయినప్పటికీ.. ప్రాణహిత నుంచి మొదటిసారి లక్షా 23 వేల 800 క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. 10,590 క్యూసెక్కుల నీటిని కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంప్ హౌస్ ద్వారా ఎత్తిపోయగా.. మేడిగడ్డ బ్యారేజీ గేట్లు ఎత్తి లక్షా 18 వేల 670 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. లక్ష్మీ పంప్ హౌస్ వద్ద 10 రోజులుగా జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. పది పైపులతో జలాలు గ్రావిటీతో ఎత్తిపోయగా.. నేరుగా అన్నారం సరస్వతీ బ్యారేజీకి చేరుతున్నాయి. కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాజెక్టులలో నీటి నిల్వ సామర్థ్యం 779.15 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 285 టీఎంసీలు ఉన్నాయి. నిండటానికి మరో 494 టీఎంసీలు అవసరం. మరోవైపు పాలేరు రిజర్వాయర్ పరిధిలో తాగునీటి అవసరాల కోసం ఐదు రోజుల పాటు ప్రతిరోజూ 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఏయే ప్రాజెక్టుల్లోకి ఎంత నీరు వస్తుందంటే?
ఆలమట్టి ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 21.08 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. 19,172 టీఎంసీల ఇన్ ఫ్లో ఉండగా.. 561 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 17.43 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ఇన్ ఫ్లో లేదు.. 50 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. జూరాల ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 6.22 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ఇన్ ఫ్లో లేదు కానీ 1238 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. తుంగభద్ర ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 100.86 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 6.89 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. 17,383 టీఎంసీల ఇన్ ఫ్లో ఉండగా.. 347 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 33.72 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. 126 టీఎంసీల ఇన్ ఫ్లో ఉండగా.. 126 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. నాగార్జు సాగర్ ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 147.46 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. 4185 టీఎంసీల ఇన్ ఫ్లో ఉండగా.. 6288 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. పులిచింతల ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 22.92 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. లేకున్నా 5083 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. సింగూరు ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 18.17టీఎంసీలు నీరు నిల్వ ఉంది. 790 టీఎంసీల ఇన్ ఫ్లో ఉండగా.. 405 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది.
నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 17.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 2.96 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. 61 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. శ్రీరామ సాగర్ ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 90.31 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 22.08 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. 4901 టీఎంసీల ఇన్ ఫ్లో ఉండగా.. 986 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. దిగువ మానేరు ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 24.0 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.44 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. 250 టీఎంసీల ఇన్ ఫ్లో ఉండగా.. 226 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. కడెం ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 7.60 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.61 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. 1906 టీఎంసీల ఇన్ ఫ్లో ఉండగా.. 89 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 13.78 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. 8829 టీఎంసీల ఇన్ ఫ్లో ఉండగా. 3404 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది.