అన్వేషించండి

Rain Impact Elections 2024: పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షం, పోలింగ్ సిబ్బందికి అవస్థలు

Andhra Pradesh Elections: ఎన్నికల వేళ వరుణుడు ఎన్నికల సిబ్బందికి అంతరాయం కలిగించాడు. కోనసీమ జిల్లాతో పాటు కడప జిల్లాలో పలు చోట్ల కురిసిన వర్షంతో ఎన్నికల ఏర్పాట్లకు అంతరాయం కలిగింది.

కొత్తపేట: మే 13న ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే వర్షాలతో పలు జిల్లాల్లో పోలింగ్ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. పోలింగ్ సామగ్రి తీసుకెళ్లేందుకు అవస్థలు పడ్డారు. డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో పోలింగ్ సిబ్బందికి సామగ్రిని అందజేశారు. కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ సిబ్బంది కొత్తపేట హైస్కూల్ గ్రౌండ్ వద్ద ఈవీఎం తదితర పరికరాలను అధికారులు అందజేశారు. 

ఆదివారం నాడు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు సిబ్బంది ఉండటానికి వేసిన టెంట్లు కూలిపోయాయి. అలాగే తమకు ఇచ్చిన సామగ్రిని తీసుకు వెళ్లేందుకు పోలింగ్ సిబ్బంది నానా ఇబ్బందులు పడ్డారు. వర్షం దాటికి మోకాళ్ళ లోతు నీరు బురద గ్రౌండ్ లోకి చేరడంతో ఇచ్చిన సామగ్రితో బయటపడడానికి అవస్థలు పడ్డారు. గ్రౌండ్ లో సిబ్బంది ఎక్కిన బస్సులు ముందుకు కదలక మొరాయించాయి. దీంతో జేసీబీల సహాయంతో వాటిని ముందుకు కదిలించారు. మరోవైపు భోజన సదుపాయాలు కూడా అంతంత మాత్రం గానే ఉన్నాయని పలువురు సిబ్బంది వాపోయారు. వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందుగానే వెల్లడించినా తగిన చర్యలు తీసుకోవడంలో సంబంధిత అధికారులు విఫలమయ్యారని విమర్శలు వస్తున్నాయి.

పులివెందులలో గాలివాన బీభత్సం 
కడప జిల్లా పులివెందులలో ఎన్నికల వేళ గాలి వాన బీభత్సం సృష్టించింది. EVM పంపిణీ కేంద్రం లో గాలి వానతో పోలింగ్ సిబ్బంది ఇబ్బందిపడ్డారు. పులివెందులలో ఈదురు గాలుల ప్రభావంతో ఎన్నికల కోసం జేఎన్టీయూ లో ఏర్పాటు చేసిన తాత్కాలిక టెంట్లు కూలిపోయాయి. కుర్చీలు కింద పడ్డాయి. వర్షం పడుతున్న సమయంలో ఎన్నికల సిబ్బంది వారి సంబంధించిన కిట్లతో బస్సులు ఎక్కారు.

తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డితో పాటు పలు జిల్లాల పరిధిలో గాలి వాన, పిడుగులు పడి సంభవించిన నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. వర్ష సూచనలు ఉన్నందున జిల్లాల్లో కలెక్టర్లు, రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఎక్కడ ఎలాంటి ఆపద వచ్చినా సంబంధిత శాఖ‌ల అధికారులు, సిబ్బంది తగిన స‌హాయ‌క చ‌ర్య‌లు చేపట్టాలని సూచించారు. 

మెదక్ జిల్లాలో పెద్ద శంకరంపేట మండలంలో పిడుగు పడి ఇద్దరు మృతి చెందిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన ఇద్దరి కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలోని  జైనథ్ మండలంలోని గిమ్మ గ్రామంలో పిడుగుపాటుకు ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారికి వైద్య సాయం అందేలా చూడాలని అక్కడి అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచిపోతే, రైతులు ఆందోళన చెందవద్దని.. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులకు ఆయన సూచించారు.

వరంగల్ నగరం లో ఈదురు గాలులతో వర్షం బీభత్సం సృష్టించింది. రెండు గంటలపాటు ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. ఈదురు గాలులతో విద్యుత్ సరఫరాకు పలు చోట్ల అంతరాయం కలిగింది. దీంతో నగరవాసులు ఇబ్బంది గురవుతున్నారు. గాలివాన బీభత్సంతో అధికారులు అలర్ట్ అయ్యారు. కొన్ని ప్రాంతాల్లో నగర రోడ్లు జలమయమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఈదురు గాలులతో వర్షం కురిసింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
75th Constitution Day Celebrations: జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP DesamAus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABPఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
75th Constitution Day Celebrations: జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
Telangana Schools: తెలంగాణలో ఈ స్కూల్స్ తర్వాతే మరేవైనా- సీఫోర్ సర్వేలో 'టాప్-5' పాఠశాలలు ఇవే
తెలంగాణలో ఈ స్కూల్స్ తర్వాతే మరేవైనా- సీఫోర్ సర్వేలో 'టాప్-5' పాఠశాలలు ఇవే
Bandi Sanjay: సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
IPL Auction 2025: ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
Asifabad News: ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ హౌస్ అరెస్ట్, విద్యార్థిని మృతితో పోలీసులు అలర్ట్
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ హౌస్ అరెస్ట్, విద్యార్థిని మృతితో పోలీసులు అలర్ట్
Embed widget