అన్వేషించండి

YSR Matsyakara Bharosa : మత్స్యకారులకు గుడ్ న్యూస్, రేపు ఖాతాల్లో రూ. 10 వేలు జమ!

YSR Matsyakara Bharosa :రాష్ట్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించే ఆర్థిక సాయాన్ని శుక్రవారం లబ్ధికారులను ఖాతాల్లో ప్రభుత్వం జమచేయనుంది. మే 13న సీఎం జగన్ నాలుగో ఏడాది మత్స్యకార భరోసా అందించనున్నారు.

YSR Matsyakara Bharosa : వేట నిషేధం సమయంలో మత్య్సకారులకు అండగా ఉండేందుకు ప్రభుత్వం వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద ఆర్థికసాయం అందిస్తుంది. శుక్రవారం ఈ పథకం కింద మత్య్సకారుల ఖాతాల్లో నగదు జమకానుంది. రాష్ట్రవ్యాప్తంగా సముద్రంపై వేటకు వెళ్లే 1,08,755 మత్స్యకార కుటుంబాలకు వేట నిషేద సమయం ఏప్రిల్‌ 15 – జూన్‌ 14 కాలంలో రూ. 10 వేల ఆర్థికసాయం అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు రూ. 109 కోట్ల ఆర్థిక సాయం, దీంతో పాటు ఓఎన్‌జీసీ సంస్థ పైప్ లైన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన  23,458 మత్స్యకార కుటుంబాలకు రూ. 108 కోట్ల ఆర్థిక సాయంతో కలిపి మొత్తం రూ. 217 కోట్లు శుక్రవారం(మే 13 , 2022)కోనసీమ జిల్లా మురమళ్ళ గ్రామంలో మత్స్యకారులకు సీఎం వైఎస్‌ జగన్‌ అందజేయనున్నారు. 

మత్య్సకారులకు రూ. 10 వేల భృతి 

2012లో జీఎస్‌పీసీ తవ్వకాలతో అప్పట్లో జీవనోపాధి కోల్పోయిన 14,824 మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ. 70.04 కోట్ల పరిహారం చెల్లించింది. శుక్రవారం అందించే ఆర్ధికసాయంతో కలిపి ఇప్పటి వరకు వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకం కింద మొత్తం సాయం రూ. 418 కోట్లు ప్రభుత్వం అందించింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకం ద్వారా సముద్రంలో చేపల వేట నిషేద సమయంలో ఇచ్చే భృతిని రూ. 10 వేలకు పెంచి మర, యాంత్రిక పడవలతో పాటు సంప్రదాయ పడవలపై వేట జరిపే మత్స్యకార కుటుంబాలను కూడా చేర్చి చెల్లిస్తోంది.

డీజిల్ సబ్సిడీ రూ.9  

గతంలో డీజిల్‌ ఆయిల్‌పై సబ్సిడీ లీటర్‌కు రూ. 6.03 ఉంటే వైసీపీ ప్రభుత్వం రూ. 9కి పెంచింది. స్మార్ట్ కార్డులు జారీ చేసి డీజిల్‌ పోయించుకునేటప్పుడే సబ్సిడీ లబ్ధిదారులకు నేరుగా అందేలా ఏర్పాటుచేసింది. వేట చేస్తూ మరణించిన మత్స్యకార కుటుంబాలకు చెల్లించే పరిహారం రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 3,606 కోట్ల వ్యయంతో 9 ఫిషింగ్‌ హర్బర్లు, 4 ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రాల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. గత ప్రభుత్వం సముద్రంపై చేపల వేట నిషేద కాలంలో మత్స్యకార కుటుంబాలకు కేవలం రూ. 4 వేలు చెల్లించేది. 

రేపటి షెడ్యూల్ 

రేపు(13వ తేదీ)న కోనసీమ జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్లలో వైఎస్సార్‌ మత్య్సకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సీఎం జగన్ శుక్రవారం ఉదయం 9.40 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.20 గంటలకు ఐ.పోలవరం మండలం కొమరగిరి చేరుకుంటారు. 10.45 గంటలకు మురమళ్ళలో వేదిక వద్దకు చేరుకుని వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం సీఎం జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 12.15 గంటలకు మురమళ్ళ నుంచి బయలుదేరి 1.20 గంటలకు తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ చేరుకుంటారు. 

టాప్ హెడ్ లైన్స్

Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
AP Local Body Polls: ఏపీ స్థానిక పోరులో రణరంగం.. దాడులపై ఎస్‌ఈసీకి టీడీపీ ఫిర్యాదు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు!
స్థానిక పోరులో మొదలైన రచ్చ.. దాడులపై ఎస్‌ఈసీకి టీడీపీ ఫిర్యాదు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు!
Vijayawada Woman Arrest: ప్రేమ మత్తుతో దారి తప్పిన యువతి.. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికింది!
ప్రేమ మత్తుతో దారి తప్పిన యువతి.. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికింది!
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget