News
News
వీడియోలు ఆటలు
X

YSRCP On Rajinikanth : రజనీకాంత్‌పై వైఎస్ఆర్‌సీపీ నేతల తీవ్ర విమర్శలు - కొడాలి నాని నోటికి పని చెప్పారుగా !

రజనీకాంత్‌పై వైఎస్ఆర్‌సీపీ నేతలు ఘాటు విమర్శలు చేశారు. కొడాలి నాని ఓ అడుగు ముందుకేసి రజనీకాంత్ ఆరోగ్యంపైనా వ్యాఖ్యలు చేశారు.

FOLLOW US: 
Share:

YSRCP On Rajinikanth :   ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు హాజరై చంద్రబాబు, ఎన్టీఆర్‌లను  సూపర్ స్టార్ రజనీకాంత్‌ పొగడటం వైఎస్ఆర్‌సీపీ నేతలకు అసలు నచ్చలేదు. తమ పార్టీని విమర్శించకపోయినా .. తన మిత్రుడ్ని చంద్రబాబు పొగిడినా వారు వదిలి పెట్టలేదు. టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే కొడాలి నాని కూడా రంగంలోకి దిగారు. టీడీపీ నేతల తరహాలోనే ఆయన రజనీకాంత్ పైనా నోటికి పని చెప్పారు. 

మూడు రోజులు షూటింగ్ - నాలుగు రోజులు ఆస్పత్రిలో పడుకునే రజనీకాంత్ : కొడాలి నాని 

ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమంలో పాల్గొన్న రజనీ కాంత్ చంద్రబాబును ఉధ్దేశించి చేసిన కామెంట్స్ పై కొడాలి నాని స్పందించారు. సూపర్ స్టార్ రజినీ కాంత్ పై మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పై చెప్పులు విసురుతుండగా, వైస్రాయ్ హోటల్లో చంద్రబాబుకు మద్దతుగా ఉన్న రజినీకాంత్, సిగ్గు శరం లేకుండా ఇప్పుడు  చంద్రబాబును పొగుడుతూ, ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్నారని ఆయన మండిపడ్డారు. ఏపీలో జీరో అయిన రజినీకాంత్, మాటలను తెలుగు ప్రజలేవ్వరు విశ్వసించరని కొడాలి నాని అన్నారు. మూడు రోజులు షూటింగ్ చేస్తే నాలుగు రోజులు హాస్పటల్లో పడుకునే, రజనీకాంత్ ఏం చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ వచ్చారని ఆయన ప్రశ్నించారు. 

రజనీకాంత్ మాటల్ని ఎవరూ నమ్మరు : కొడాలి నాని 

ఎన్టీఆర్ బతికుండగా రజనీకాంత్ ఏం చేశాడో రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసన్నారు.  ఇప్పుడు చంద్రబాబుకు మద్దతు తెలుపుతూ ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలను తెలుగు ప్రజలేవ్వరు విశ్వసించరని కొడాలి నాని స్పష్టం చేశారు. రజనీ కాంత్ ఇలా కామెంట్స్ చేయటం వెనుక చంద్రబాబు హస్తం ఉందని మండిపడ్డారు.ఇలాంటి రాజకీయాలు చేయటం చంద్రబాబుకు అలవాటేనని కొడాలి వ్యాఖ్యానించారు.పవన్ కళ్యాణ్ ను బ్లాక్ మెయిల్ చేసేందుకే రజినీకాంత్ ను చంద్రబాబు రంగంలోకి దింపారని కొడాలి నాని ఆరోపించారు. ఇకనైనా పవన్ కళ్యాణ్ కళ్ళు తెరిచి, తనకు ఏది మంచో ఆ దారిలో  నడవాలని కొడాలి నాని సూచించారు. 

రజనీ కాంత్ అంటే కొశ్చన్ మార్క్...!

రజకీ కాంత్ అంటే కొశ్చన్ మార్క్ అని ,రాజ్యసభ సభ్యుడు ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి విమర్శించారు.  రజనీ కామెంట్స్ ను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు.  ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు వచ్చిన రజనీకాంత్ రాజకీయాల గురించి మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు.పక్క రాష్ట్రానికి చెందిన రజనీ కాంత్ సినిమా రంగం కుమాత్రమే పరిమితం అని,ఆయన మంచి నటుడని అన్నారు.అయితే రాజకీయాల్లో మాత్రం ఇలాంటి కామెంట్స్ సరైనదికాదని చెప్పారు.

రజనీకాంత్ ను టార్గెట్ చేసుకున్న  వైఎస్ఆర్‌సీపీ నేతలు !

ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్  స్పెషల్ అట్రాక్షన్ గా హజరయ్యారు.ఈ వేదిక పై రజనీ కాంత్ చేసిన కామెంట్స్ తో రాజకీయ పరమయిన కౌంటర్ లు మెదలయ్యాయి.ఎన్టీఆర్ నామ స్మరణ తో జరగాల్సిన కార్యక్రమం చంద్రబాబు పేరు ప్రస్తావనతో రాజకీయ రంగు పులుముకుంది.దీని పై అదికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి ,తెలుగు దేశం నేతల మద్య మాటల యుద్దం మెదలైంది.చంద్రబాబు తిరిగి అధికారంలోకి వస్తారంటూ రజనీ ఇచ్చిన కాంప్లిమెంట్ పై  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు.

Published at : 29 Apr 2023 04:22 PM (IST) Tags: AP Politics Rajinikanth Kodali Nani Kodali Nani's criticism of Rajinikanth

సంబంధిత కథనాలు

YS Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి

YS Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి

Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Chandrababu :  టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Rajahmundry MP Bharat: చంద్రబాబు ఒక ఆల్‌ ఫ్రీ బాబా, దసరా మేనిఫెస్టో అక్కడినుంచే కాపీ కొడతారు- ఎంపీ భరత్‌ జోష్యం

Rajahmundry MP Bharat: చంద్రబాబు ఒక ఆల్‌ ఫ్రీ బాబా, దసరా మేనిఫెస్టో అక్కడినుంచే కాపీ కొడతారు- ఎంపీ భరత్‌ జోష్యం

Pawan Kalyan Varahi: ఈ 14 నుంచే రోడ్లపైకి పవన్ కళ్యాణ్ వారాహి, రూట్ మ్యాప్ విడుదల చేసిన జనసేన

Pawan Kalyan Varahi: ఈ 14 నుంచే రోడ్లపైకి పవన్ కళ్యాణ్ వారాహి, రూట్ మ్యాప్ విడుదల చేసిన జనసేన

AP BJP: కేంద్ర పథకాలకు జగన్ ప్రభుత్వం స్టిక్కర్లు, గవర్నర్ కు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు

AP BJP: కేంద్ర పథకాలకు జగన్ ప్రభుత్వం స్టిక్కర్లు, గవర్నర్ కు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు

టాప్ స్టోరీస్

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

WTC 2023 Final: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో వర్షం పడితే! - పోనీ డ్రా అయితే గద ఎవరికి?

WTC 2023 Final: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో వర్షం పడితే! -  పోనీ డ్రా అయితే గద ఎవరికి?