అన్వేషించండి

Vivekananda reddy Case: వివేకా హత్య కేసులో కీలక పరిణామం- సునీత పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు

YS Sunitha Reddy: తనపై పులివెందుల పోలీసులు నమోదు చేసిన కేసుపై హైకోర్టును వైఎస్ సునీత ఆశ్రయించారు. దీనిపై తదుపరి విచారణను శుక్రవారానికి న్యాయస్థానం వాయిదా వేసింది.

Sunitha Petition: దివంగత మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పులివెందుల పోలీసులు తనపై నమోదు చేసిన కేసుపై వైఎస్ వివేకా (YS Viveka) కూతురు వైఎస్ సునీతారెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై పులివెందుల పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది.  ఈ సందర్బంగా పిటిషన్‌లో మార్పులు చేయాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. దిగువ కోర్టు ఆదేశాలను తొలుత సవాల్ చేయాలని, పిటిషన్‌లో సవరణలు చేసి తమను ఆశ్రయించాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై తదుపరి విచారణను శుక్రవారానికి హైకోర్టు వాయిదా వేసింది.

ముగ్గురిపై కేసులు

వివేకా హత్య కేసు విషయంకు సంబంధించి సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్ తనను బెదిరిస్తున్నారంటూ వివేకా పీఏ కృష్ణారెడ్డి పులివెందుల కోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశాడు. వారి ముగ్గురిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరాడు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన పులివెందుల కోర్టు.. దీనిపై విచారణ జరిపి కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కోర్టు ఆదేశాల ప్రకారం వారి ముగ్గురిపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఈ కేసు కొట్టివేయాలని సునీత హైకోర్టును ఆశ్రయించగా..  సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ కూడా కేసును కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రామ్ సింగ్ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు.. సునీత పిటిషన్‌తో కలిపి విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

పోలీసులకు ఫిర్యాదు చేసినా నో రెస్పాన్స్

తనను సునీత, రాజశేఖర్ రెడ్డి, రాంసింగ్ బెదిరిస్తున్నారంటూ తొలుత పులివెందుల పోలీసులకు వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశాడు. కొందరి పేర్లను విచారణ అధికారులకు చెప్పాలని తనను బెదిరిస్తున్నట్లు ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయలేదు. పోలీసులు పట్టించుకోకపోవడంతో కోర్టును కృష్ణారెడ్డిని ఆశ్రయించాడు. తనను ఆ ముగ్గురు బెదిరిస్తున్నారని, పోలీసులను కలిసి రక్షణ కల్పించాలని కోరినా పట్టించుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అందుకే తాను కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని పిటిషన్‌లో తెలిపాడు. సీబీఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే చంపేస్తామని బెదిరించారని కోర్టుకు చెప్పాడు. గత కొద్దికాలంగా ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే వారి ముగ్గురిపై కేసు నమోదు చేయాలని కోర్టు కొద్దిరోజుల క్రితం ఆదేశాలు ఇచ్చింది.  దీంతో సునీత, రాజశేఖర్ రెడ్డి, రాంసింగ్‌పై ఐపీసీ సెక్షన్ 156(3) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

కేసును కొట్టేయాలని హైకోర్టును రాంసింగ్, సునీత ఆశ్రయించడంతో.. ఏం జరుగుతుందనేది చర్చనీయాంశంగా మారింది. వివేకా కేసులో ఎప్పుడే ఏదోక పరిణామం చోటుచేసుకుంటూనే ఉంది.  కేసులో ఉన్న నిందితులు కోర్టుల్లో అనేక పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. అలాగే ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇరుక్కోవడం పెద్ద సంచలనమైంది. గత ఎన్నికలకు ముందు నుంచి ఇప్పటివరకు ఈ కేసు జరుగుతూనే ఉంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం: భక్తులకు తలంబ్రాలు, ప్రసాదాల పంపిణీ ఏర్పాట్లు పూర్తి, పార్కింగ్ వివరాలు ఇవిగో!
ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం: భక్తులకు తలంబ్రాలు, ప్రసాదాల పంపిణీ ఏర్పాట్లు పూర్తి, పార్కింగ్ వివరాలు ఇవిగో!
YS Jagan on Amaravati Legal Status: రాజధాని అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, చట్టబద్ధత కల్పించినా ప్రయోజనం ఉంటుందా? : వైఎస్ జగన్
రాజధాని అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, చట్టబద్ధత కల్పించినా ప్రయోజనం ఉంటుందా? : వైఎస్ జగన్
YSRCP Supports Amaravati Bill: అమరావతి బిల్లుకు వైసీపీ వ్యతిరేకం కాదు.. ఎంపీ మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
అమరావతి బిల్లుకు వైసీపీ వ్యతిరేకం కాదు.. ఎంపీ మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Polavaram Project: ఏపీకి గుడ్‌న్యూస్.. పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.1,301 కోట్ల నిధులు విడుదల, రైతులకు ప్రయోజనం
ఏపీకి గుడ్‌న్యూస్.. పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.1,301 కోట్ల నిధులు విడుదల, రైతులకు ప్రయోజనం

వీడియోలు

CSK Plays Without Dhoni in 17 Years IPL 2026 | ధోనీ, రైనా, జడేజా లేకుండా CSK మ్యాచ్ | ABP Desam
Jadeja Destroys CSK vs RR IPL 2026 | ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన జడేజా | ABP Desam
IPL 2026 RR VS CSK Highlights | చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ | ABP Desam
Vaibhav Suryavanshi RR vs CSK IPL 2026 | వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్ | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Anirudh Reddy: డ్రగ్స్‌ ఆరోపణల్లో కొత్త ట్విస్ట్... అనిరుధ్ రెడ్డికి రాహుల్ రామకృష్ణ ఛాలెంజ్, విష్ణు మంచు కూడా!
డ్రగ్స్‌ ఆరోపణల్లో కొత్త ట్విస్ట్... అనిరుధ్ రెడ్డికి రాహుల్ రామకృష్ణ ఛాలెంజ్, విష్ణు మంచు కూడా!
Polavaram Project: ఏపీకి గుడ్‌న్యూస్.. పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.1,301 కోట్ల నిధులు విడుదల, రైతులకు ప్రయోజనం
ఏపీకి గుడ్‌న్యూస్.. పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.1,301 కోట్ల నిధులు విడుదల, రైతులకు ప్రయోజనం
LPG Cylinder Price Hike: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే..
భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే..
Karimnagar Jeevan Reddy: బీఆర్ఎస్‌లో కేకే పదవి జీవన్ రెడ్డికి - కోడలికి టిక్కెట్ కూడా - సీనియర్‌కు తగ్గ డీలేనా?
బీఆర్ఎస్‌లో కేకే పదవి జీవన్ రెడ్డికి - కోడలికి టిక్కెట్ కూడా - సీనియర్‌కు తగ్గ డీలేనా?
Rules From 1 April 2026: ఏటీఎం విత్‌డ్రాల నుంచి ITR ఫైలింగ్ వరకు నేటి నుంచి అమల్లోకి 5 కొత్త రూల్స్
ఏటీఎం విత్‌డ్రాల నుంచి ITR ఫైలింగ్ వరకు నేటి నుంచి అమల్లోకి 5 కొత్త రూల్స్
NTR Vaidya Seva: ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
Property Rights: భార్య పుట్టింటి ఆస్తిపై భర్తకు ఏ హక్కు ఉండదు: ఏపీ హైకోర్టు
భార్య పుట్టింటి ఆస్తిపై భర్తకు ఏ హక్కు ఉండదు: ఏపీ హైకోర్టు
YSRCP Supports Amaravati Bill: అమరావతి బిల్లుకు వైసీపీ వ్యతిరేకం కాదు.. ఎంపీ మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
అమరావతి బిల్లుకు వైసీపీ వ్యతిరేకం కాదు.. ఎంపీ మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Embed widget