అన్వేషించండి

Dwarampudi On Lokesh : కొవ్వు కరిగించుకునేందుకు లోకేశ్ పాదయాత్ర, వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి తీవ్ర వ్యాఖ్యలు

Dwarampudi On Lokesh Padayatra : లోకేశ్ పాదయాత్రపై వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ స్లిమ్ అయ్యేందుకే పాదయాత్ర చేస్తు్న్నారని ఆరోపించారు.


  Dwarampudi On Lokesh Padayatra :టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై కాకినాడ పట్టణ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో మాట్లాడిన ఆయన... లోకేశ్ పాదయాత్ర ప్రజల కోసం కాదని, కొవ్వు పెరిగిపోయి ఒళ్లు కరిగించుకోవడం కోసం పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. పాదయాత్ర చేయడం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇవాళ  ప్రజలకు ఏ కష్టం ఉందని లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. వైసీపీ మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం 97%  అమలు చేసిందన్నారు. ఆనాడు చంద్రబాబు పాలనలో కరవు పై వైఎస్ఆర్, ఇచ్చిన హామీలు అమలు చేయలేదని వైఎస్ జగన్ పాదయాత్రలు చేశారని తెలిపారు. 

కొవ్వు కరిగించుకునేందుకే పాదయాత్ర 

"లోకేశ్ పాదయాత్ర ప్రజల కోసం కాదు కొవ్వు కరిగించుకునేందుకు చేస్తున్నారు. నేను వైఎస్ఆర్, సీఎం జగన్, చంద్రబాబు, షర్మిల పాదయాత్ర చూశాను. అందరూ కూడా సన్నగా ఉంటారు. లోకేశ్ పాదయాత్ర కేవలం స్లిమ్ అయ్యేందుకే. ఈ రోజు ప్రజలకు ఏ కష్టం ఉందని లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారు. ఆ రోజు జగన్ పాదయాత్ర చేశారంటే... చంద్రబాబు హామీలు నెరవేర్చలేదనే కారణం ఉంది. ఇవాళ వైసీపీ ప్రభుత్వం మ్యానిఫెస్టో ఇచ్చినా 97 శాతం హామీలు నెరవేర్చాం. మేం ఏదైతే హామీ ఇచ్చామో అన్నీ చేశాం. పాదయాత్ర ఒక ఫ్యాషన్ అయిపోయింది. లోకేశ్ చేసే పాదయాత్ర కేవలం సీటు తగ్గించుకోవడం కోసమే. పవన్ కల్యాణ్ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. నేను రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాను. 1988 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. పవన్ కల్యాణ్ గురించి అవసరం నాకు లేదు. వైఎస్ఆర్ పాదయాత్ర చేసినప్పుడు రాష్ట్రంలో విపరీతమైన కరవు ఉంది. ప్రజలు వైఎస్ఆర్ ను నమ్మి గెలిపించారు. జగన్ పాదయాత్ర కూడా చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చేశారు. ఆయన్ని ప్రజలు గెలిపించారు. నా వ్యక్తి గత అభిప్రాయం ప్రకారం లోకేశ్ కేవలం కొవ్వు తగ్గించుకునేందుకు పాదయాత్ర చేస్తున్నారు."- ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి

టీడీపీతో తిరిగిన వాళ్లు ప్రభుత్వ పథకాలు వదిలేసుకోండి 

"కిరాయి వాళ్లను పెట్టుకుని కొందరు కాకినాడ పట్టణ వార్డుల్లో ప్రచారం చేస్తున్నారు. నా నియోజకవర్గంలో పింఛన్ రావడంలేదని ఎవరూ ఫిర్యాదు చేయడంలేదు. ట్యాక్స్ కట్టో, అర్బన్ ప్రాపర్టీ ఎక్కువ ఉండో, కరెంట్ బిల్లు ఎక్కువ, ఫోర్ వీల్స్ ఇతర కారణాల వల్ల కొందరు ప్రభుత్వ పథకాలకు అర్హులు కాలేదు. అంతే తప్ప అందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తున్నాం. ఇదేం కర్మ అని టీడీపీ నేతలు కాకినాడలో తిరుగుతున్నారు. ఈ కార్యక్రమం పూర్తిగా ఫెయిల్ అయింది. టీడీపీ నేతలు కిరాయి వాళ్లతో ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నేతలతో తిరిగి వాళ్లు ప్రభుత్వ పథకాలు వదిలేసుకోండి. నేను గ్రావెల్ మాఫియా చేస్తున్నారని కలెక్టర్ ఆఫీస్ వద్ద రాద్ధాంతం చేశారు. అసలు పెద్దాపురం నియోజకవర్గంలో గ్రావెల్ దోపిడీ చేసిందే చినరాజప్ప. టీడీపీ నేతలంటే అబద్ధాలు, మోసాలు. మీ నాయకుడే పెద్ద మోసగాడు." - ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Brahmamudi Maanas Nagulapalli: కొడుక్కి రామ్ చరణ్ మూవీ పేరు పెట్టిన 'బ్రహ్మముడి' మానస్.. ఫొటోస్ చూశారా!
కొడుక్కి రామ్ చరణ్ మూవీ పేరు పెట్టిన 'బ్రహ్మముడి' మానస్.. ఫొటోస్ చూశారా!
Narayanpet News Today: నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
Ram Gopal Varma Video: నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
Streambox QLED TV: ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కొంటే టీవీ ఫ్రీ! - ఇదెక్కడి మాస్ ఆఫర్ అయ్యా!
ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కొంటే టీవీ ఫ్రీ! - ఇదెక్కడి మాస్ ఆఫర్ అయ్యా!
Embed widget