అన్వేషించండి

Kadiri BJP RDO Office Protest: కదిరిలో గర్జించిన కమలదళం - భవన నిర్మాణ కార్మికుల స్థలాల కబ్జాపై బీజేపీ భారీ నిరసన.. ఆర్డీవో కార్యాలయం ముట్టడి!

Vishnuvardhan Reddy Kadiri Land Grab Row: కదిరిలో భవన నిర్మాణ కార్మికుల స్థలాలను కబ్జా చేయడంపై బీజేపీ సమరం ప్రారంభించింది. ఆర్డీవో కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించింది.

Construction Workers Plot Encroachment Kadiri:   శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో భూమాఫియా అక్రమాలకు, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉధృతమైన ఆందోళన వ్యక్తమైంది. కమ్మరవాండ్లపల్లి పరిధిలోని సర్వే నంబర్ 1769, 1770 లలో గతంలో నిరుపేద భవన నిర్మాణ కార్మికులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను దళారులు, భూమాఫియా కబ్జా చేయడాన్ని నిరసిస్తూ కదిరి ఆర్డీవో  కార్యాలయం ముందు బీజేపీ శ్రేణులు భారీ ధర్నా చేపట్టాయి. ఈ నిరసన ప్రదర్శనకు ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, సీనియర్ నేత యస్. విష్ణువర్ధన్ రెడ్డి.. బాధితులతో కలిసి కార్యాలయాన్ని ముట్టడించి, రెవెన్యూ యంత్రాంగంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

 దళారుల దౌర్జన్యం.. 500 మంది కార్మికులకు ఘోర అన్యాయం!  

 కదిరిలో దశాబ్ద కాలంగా నివసిస్తున్న 500 మంది నిరుపేద భవన నిర్మాణ కార్మికులకు చెందిన విలువైన భూములను స్థానిక దళారులు నకిలీ పట్టాలు సృష్టించి యథేచ్ఛగా కబ్జా చేశారని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. సొంత ఇల్లు నిర్మించుకోవాలనే ఆశతో ఉంటూ.. ఇప్పటికే కాలం చేసిన సుమారు 40 మంది మరణించిన కార్మికుల కుటుంబాల పట్టాలను సైతం భూమాఫియా లాక్కోవడం అత్యంత అమానుషమని ఆరోపించారు. గతంలో జరిగిన అధికారిక విచారణలోనే ఈ భూముల కేటాయింపుల్లో, రికార్డుల తారుమారులో భారీ అక్రమాలు జరిగినట్లు తేలినా.. ఇప్పటివరకు బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక రెవెన్యూ అధికారుల కొమ్ముకాయడం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన ఆరోపించారు.

 అధికారుల సస్పెన్షన్.. క్రిమినల్ కేసులకు డిమాండ్ 

నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన దళారులతో పాటు, వారికి సహకరించి ప్రభుత్వ భూములను, పేదల స్థలాలను విక్రయించడానికి సహకరించిన రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. బాధ్యులైన ప్రతి ఒక్కరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టప్రకారం కఠినంగా శిక్షించాలన్నారు. లౌకిక, ప్రజా ప్రభుత్వంలో సామాన్యుల హక్కులను హరించే హక్కు ఎవరికీ లేదని.. రెవెన్యూ శాఖలో చేరిన అవినీతి పురుగులను ఏరిపారేయడానికి నిష్పక్షపాత విచారణ జరిపించాలని కలెక్టర్‌ను కోరారు. అర్హులైన అసలైన భవన నిర్మాణ కార్మికులకు వారి స్థలాలను తక్షణమే గుర్తించి సరిహద్దులతో సహా అప్పగించాలని స్పష్టం చేశారు.
 
కదిరి ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటాలు! 

కదిరి నియోజకవర్గంలో విష్ణువర్ధన్ రెడ్డి నిరంతరం ప్రజాపక్షాన నిలుస్తూ అవినీతిపై రాజీలేని పోరాటాలు చేస్తున్నారు. ఇటీవల కదిరి ఖాద్రీశుడి ఆలయ కోనేరు భృగుతీర్థం పునర్నిర్మాణ పనుల్లో జరిగిన రూ. 6 కోట్ల కుంభకోణంపై గళమెత్తి విజిలెన్స్ విచారణకు డిమాండ్ చేసింది ఆయనే. అంతేకాకుండా, నంబులపూలకుంట మండలంలో ప్రైవేట్ సోలార్ ప్లాంట్ భూసేకరణ పేరుతో దళారులు స్థానిక రైతుల భూ రికార్డులను రాత్రికి రాత్రే మార్చేస్తూ బెదిరింపులకు గురిచేస్తుంటే.. క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు అండగా నిలిచారు. కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వేదికగా జరిగిన సుమారు రూ. 25 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన రిజిస్ట్రేషన్ స్కామ్‌ను కూడా విష్ణువర్ధన్ రెడ్డి బయటపెట్టి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. 

 చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం.. బీజేపీ హెచ్చరిక! 

పేదలు, కార్మికుల హక్కులను కాలరాస్తున్న భూమాఫియాపై పోలీసులు, జిల్లా యంత్రాంగం తక్షణమే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని బీజేపీ నేతలు హెచ్చరించారు. నిరుపేద భవన నిర్మాణ కార్మికులకు న్యాయం జరిగే వరకు, వారి స్థలాలు వారికి దక్కే వరకు బీజేపీ పోరాటం ఆగే ప్రసక్తే లేదని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ముట్టడి అనంతరం ఆర్డీవోకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఒకవేళ వారం రోజుల్లోగా కబ్జాదారులపై, అవినీతి అధికారులపై క్రిమినల్ చర్యలు ప్రారంభించకపోతే.. బాధితులందరినీ సమీకరించి కదిరి పట్టణాన్ని స్తంభింపజేసేలా ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

టాప్ హెడ్ లైన్స్

AP Elections: నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Pulivendula High Tension: పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ బాహాబాహీ.. గాల్లోకి 6 రౌండ్ల కాల్పులు!
పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ బాహాబాహీ.. గాల్లోకి 6 రౌండ్ల కాల్పులు!
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Embed widget